చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్
| చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్ | |||
2018లో విజయ్ | |||
| Taking office 10 మే 2026 | |||
| గవర్నరు | రాజేంద్ర అర్లేకర్ | ||
| Succeeding | ఎం. కె. స్టాలిన్ | ||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 4 మే 2026 | |||
| ముందు | ఆర్. డి. శేఖర్ | ||
| నియోజకవర్గం | పెరంబూర్ | ||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 4 మే 2026 | |||
| ముందు | ఇనిగో ఎస్. ఇరుదయరాజ్ | ||
| నియోజకవర్గం | తిరుచిరాపల్లి తూర్పు | ||
తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు
| |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2 ఫిబ్రవరి 2024 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1974 జూన్ 22 మద్రాస్ (ప్రస్తుతం చెన్నై), తమిళనాడు, భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | తమిళగ వెట్రి కళగం (2024 నుండి) | ||
| తల్లిదండ్రులు | ఎస్.ఎ.చంద్రశేఖర్ శోభా చంద్రశేఖర్ | ||
| జీవిత భాగస్వామి |
సంగీతా సోర్నలింగం
(m. 1999; వేరు. 2026) | ||
| బంధువులు | విక్రాంత్ (కజిన్) విరాజ్ (కజిన్) | ||
| సంతానం | 2 | ||
| వృత్తి |
| ||
| పురస్కారాలు | పూర్తి జాబితా | ||
చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్ [4][5](జననం 22 జూన్ 1974) భారతీయ రాజకీయ నాయకుడు, మాజీ నటుడు, నేపథ్యగాయకుడు. ఇతను ప్రధానంగా తమిళ సినిమాలలో నటిస్తాడు.[6] ఆయన 2026 నుండి తమిళనాడుకు తొమ్మిదవ ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్నారు. ఆయన తమిళగ వెట్రి కళగం (టీవీకే) రాజకీయ పార్టీ స్థాపకుడు, అధ్యక్షుడు. రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు, ఆయన తమిళ సినిమాలో ప్రముఖ నటులలో ఒకరిగా గుర్తింపు పొందారు. అభిమానులు, మీడియా ఇతనిని దళపతి అనే పేరుతో పిలుస్తారు.[7][8][9]
ఆయన చిత్ర పరిశ్రమలో బాలనటునిగా తన తండ్రి దర్శకత్వం వహించిన సినిమాలలో వెట్రి (1984) నుండి ఇతు ఎంగల్ నీతి (1988) వరకు నటించాడు. విజయ్ తన తండ్రి ఎస్. ఏ. చంద్రశేఖరన్ దర్శకత్వంలో రూపొందిన నాళైయ తీర్పు (1992) చిత్రంతో కథానాయకుడిగా అరంగేట్రం చేశాడు. అనంతరం పూవే ఉనక్కాగా (1996), లవ్ టుడే (1997), కాదలుక్కు మరియాధై (1997), తుళ్లాథ మనముం తుళ్లుం (1999) వంటి ప్రేమకథా చిత్రాల ద్వారా విశేష ఖ్యాతి పొందాడు. తరువాత తిరుమలై (2003), గిల్లీ (2004), పొక్కిరి (2007) చిత్రాలతో యాక్షన్ హీరోగా ఎదిగాడు. 2010ల నుండి ఆయన తుప్పాక్కి (2012), కత్తి (2014), మెర్సల్ (2017), సర్కార్ (2018), మాస్టర్ (2021), లియో (2023), ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (2024) వంటి వాణిజ్యపరంగా అత్యంత విజయవంతమైన చిత్రాలలో నటించాడు. వీటిలో అనేక చిత్రాలు అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాలలో చోటు సంపాదించాయి.[10]
2024 ఫిబ్రవరిలో విజయ్ సినిమాలకు విరమణ ప్రకటించి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. అదే సమయంలో ఆయన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించాడు. 2026 తమిళనాడు శాసనసభ ఎన్నికలలో ఆయన పార్టీ 108 స్థానాలను గెలుచుకుని విశేష రాజకీయ విజయాన్ని సాధించినప్పటికీ, పూర్తి మెజారిటీకి తక్కువగా నిలిచింది.[11][12] టీవీకే నేతృత్వంలోని కూటమిలోని ఇతర మిత్రపక్షాల మద్దతుతో విజయ్ 2026 మే 10న తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.
ప్రారంభ జీవితం, కుటుంబం
[మార్చు]చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్ 1974 జూన్ 22న మద్రాస్ (ప్రస్తుతం చెన్నై), తమిళనాడులో ఎస్.ఎ.చంద్రశేఖర్, శోభ దంపతులకు జన్మిచాడు.[13][14] ఆయన తండ్రి ఎస్. ఏ. చంద్రశేఖరన్ సినీ దర్శకుడు; తల్లి శోభా చంద్రశేఖర్ నేపథ్య గాయని, గాయని, కర్ణాటక సంగీత విద్వాంసురాలుగా ప్రసిద్ధి చెందారు.[15] ఆయన తండ్రి క్రైస్తవుడు, తల్లి హిందువు.[16][17] విజయ్‌కు విద్య అనే చెల్లెలు ఉండేది. ఆమె రెండేళ్ల వయస్సులోనే మరణించింది.[18] సోదరి మరణం విజయ్ పై ప్రభావం చూపింది. తన తల్లి చెప్పిన కథనం ప్రకారం బాల్యంలో విజయ్ చాలా చురుకుగా, ఉత్సాహంగా ఉండేవాడు. తన సోదరి మరణం తరువాత చురుకుదనం తగ్గింది.[19] తన సోదరి విద్య యొక్క కథను 2005లో సుక్రన్ అనే చిత్రం ద్వారా తెరకెక్కించాడు.[20]
ఆయన తన బాల్యం చెన్నైలో గడిపాడు. ప్రారంభ విద్యను కోడంబాక్కం లోని ఫాతిమా హయ్యర్ సెకండరీ పాఠశాలలో పూర్తిచేసాడు.[21] తరువాత బాలలోక్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో చేరాడు.[22] లయోలా కళాశాల నుండి విజువల్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీని పూర్తిచేసాడు. ఆయన చిన్నతనంనుంచే నటనపై ఆసక్తిని కనవరచేవాడు.[19] అయితే నటనా జీవితంపై దృష్టి కేంద్రీకరించడానికి ఆ కోర్సును మధ్యలోనే విరమించాడు.[23]
విజయ్ 1999 ఆగస్టు 25 న సంగీత స్వర్ణలింగం అనే అమ్మాయిని హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాలలో వివాహమాడాడు.[24][25] వారికి ఇద్దరు పిల్లలు. కుమారుడు జాసన్ సంజయ్ 2000లో లండన్ లో జన్మించాడు.[26] [27] కుమార్తె దివ్యా షాష 2005 లో చెన్నైలోజన్మించింది.[28] తన కుమారుడు జాసన్ సంజయ్ 2009 లో విడుదలైన "వెట్టైకారణ్" చిత్రంలో ఆయనతో పాటు నటించాడు. కుమార్తె 2016 లో విడుదలైన తేరీ చిత్రంలో చిన్నపాత్రలో దర్శనమిచ్చింది.
తన యుక్త వయస్సులో తన తండ్రి దర్శకత్వంలోని "నాలయ తీర్పు" (1992) లో నటునిగా ప్రవేశించాడు కానీ తన మొదటి విజయవంతమైన సినిమా 1996లో విడుదలైన "పూవె ఉనక్కాగ". ఈ చిత్రానికి విక్రమన్ దర్శకత్వం వహించాడు.[29] యిప్పటి వరకు ఆయన 61 చిత్రాలలో నటునిగా నటించాడు. ఆయన మూడు తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డ్సు, ఒక కాస్మోపోలిటన్ పురస్కారం, ఎనిమిది విజయ్ పురస్కారాలు, మూడు ఎడిసన్ పురస్కారాలు, రెండు వికటన్ పురస్కారాలు అందుకున్నాడు. యుకె జాతీయ అవార్డులకు నామినేట్ చేయబడ్డాడు.[30] ఆయన ఇప్పటి వరకు 32 పాటలను పాడాడు.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]- బొబ్బిలి రాయుడు (1994)
- యమలవ్ (1995)
- సర్కార్ 2018 (తెలుగు)
- అదిరింది 2017 ( తెలుగు )
- ఏజెంట్ భైరవ 2017 ( తెలుగు )
- పోలీస్ 2016 ( తెలుగు )
- జిల్లా 2015 ( తెలుగు )
- పులి 2015 ( తెలుగు )
- దమ్ముంటే కాస్కో 2013 ( తెలుగు )
- స్నేహితుడు 2012 (తెలుగు)
- విజిల్ (2019)
- మాస్టర్ (2021)
- బీస్ట్ (2022) [31]
- ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్
రాజకీయ జీవితం
[మార్చు]2009లో విజయ్ తన ఫ్యాన్ క్లబ్ విజయ్ మక్కల్ ఇయక్కం ప్రారంభించాడు.[32][33] 2011 ఆగస్టులో, అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేస్తున్న నిరాహార దీక్షకు తన మద్దతును తెలియజేయడానికి విజయ్ స్వయంగా ఢిల్లీలో ఆయనను సందర్శించారు. ఈ సంఘటన విజయ్ రాజకీయ ఆశయాలను వెలుగులోకి తెచ్చింది, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఈ సంస్థ ఎఐఎడిఎంకె నేతృత్వంలోని కూటమికి మద్దతు ఇచ్చింది.[34] ఫిబ్రవరి 2019లో, కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం 2019కు వ్యతిరేకంగా విజయ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు, ఇది దేశ సామాజిక మత సామరస్యాన్ని దెబ్బతీస్తుందని అన్నాడు.[35]
అతని అభిమాన సంఘం సభ్యులు 2022 తమిళనాడు స్థానిక ఎన్నికలలో పోటీ చేసి 115 సీట్లలో విజయం సాధించారు.[36] 2024 ఫిబ్రవరి 2న విజయ్ తమిళగ వెట్రి కళగం అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు.[37][38][39][40] తమిళగ వెట్రి కళగం పార్టీ జెండాను ఆగష్టు 21న ఆవిష్కరించాడు.[41]
2025 సెప్టెంబరు 27న కరూర్ లో విజయ్ రాజకీయ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలొ 41 మంది మరణించారు. ఆయన మృతులకు సంతాపం తెలియచేసాడు, ఆ తరువాత మృతులు, గాయపడిన వారి బంధువులకు ఎక్స్-గ్రేషియా చెల్లింపులను ప్రకటించాడు.[42] దాని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను సమన్వయం చేస్తూ, నిర్మాణాలను ఏర్పాటు చేయడం కొనసాగించాడు. దీని తర్వాత, 2011లో విజయ్ పూర్తిస్థాయిలో రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించాడు. 2011 ఫిబ్రవరిలో తమిళనాడు మత్స్యకారులపై జరిగిన దాడి తర్వాత, నాగపట్టణంలో విజయ్ నిర్వహించిన బహిరంగ సభ అందరి దృష్టిని ఆకర్షించింది
2026 జనవరి 30న, రాజకీయాల్లోకి వచ్చిన తరువాత జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీకి ఇచ్చిన తన మొదటి ఇంటర్వ్యూలో విజయ్ తన రోల్ మోడళ్లలో ఎం. జి. రామచంద్రన్, జె. జయలలిత, ఎం. కరుణానిధి వంటివారు ఉన్నారని పేర్కొన్నాడు.[43]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆయన 1999 ఆగస్టు 25న సంగీత సోర్నలింగం ను హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కొడుకు, జాసన్ సంజయ్, ఒక కూతురు దివ్య సాషా ఉన్నారు. అయితే, విజయ్ నుంచి విడాకులు కోరుతూ చెంగల్ పట్టు జిల్లా కోర్టులో సంగీత పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో 2026 ఏప్రిల్ 20న విచారణకు హాజరు కావాలని విజయ్ కి నోటీసులు జారీ అయ్యాయి.[44] దీనిపై చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును జూన్ 15కు వాయిదా వేసింది. ఆరోజు విజయ్, సంగీత ఇద్దరూ హాజరుకావాలని ఆదేశించింది.[45]
మూలాలు
[మార్చు]- ↑ "Actor-politician Vijay's wife Sankgeetha files for divorce". The News Minute. 5 February 2026.
- ↑ "Who Is Vijay's Wife Sankgeetha Sornalingam, Who Filed For Divorce After 26 Years Of Marriage?". NDTV (in ఇంగ్లీష్). 27 February 2026. Archived from the original on 4 March 2026. Retrieved 4 March 2026.
- ↑ "The Indian superstar whose political rally turned fatal for dozens". BBC. Archived from the original on 29 September 2025. Retrieved 29 September 2025.
- ↑ "Vijay full name is Joseph Vijay".
- ↑ "Vijay uses full name as Joseph Vijay in his official letter head".
- ↑ "TN doesn't care if their Thalapathy is Joseph Vijay: Why does BJP's H Raja?". 23 October 2017. Retrieved 11 January 2018.
- ↑ "Vijay's title changed from Ilayathalapathy to Thalapathy". Behindwoods. 2017-06-21. Retrieved 2017-12-03.
- ↑ "A teen shares why actor Joseph 'Ilayathalapathy' Vijay is her hero – News & Events | The Star Online". The Star (Malaysia).
- ↑ "Why Vijay's Mersal was destined to be a blockbuster, even without the BJP's help".
- ↑ "The Indian superstar whose political rally turned fatal for dozens". BBC. Archived from the original on 29 September 2025. Retrieved 29 September 2025.
- ↑ "TVK storms Tamil Nadu, eclipses DMK and AIADMK but falls short of majority: What next for Vijay?". The Times of India. 4 May 2026. ISSN 0971-8257. Retrieved 4 May 2026.
- ↑ Kumar, D. Suresh (4 May 2026). "TVK chief Vijay makes stunning debut, disrupts T.N.'s bipolar politics but falls short of magic figure". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 4 May 2026.
- ↑ "Happy birthday Thalapathy! Check out some rare images of the Vijay". The New Indian Express. 22 June 2021. Archived from the original on 4 October 2023. Retrieved 15 September 2023.
- ↑ Manoj Kumar R (24 June 2022) [22 June 2022]. "'Thalapathy' Vijay, the last superstar of Tamil box office". The Indian Express. Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.
- ↑ "Did you know Kizhakku Vasal fame S.A. Chandrasekhar was a director?". The Times of India. 28 November 2023. Archived from the original on 2 February 2024. Retrieved 12 November 2022.
- ↑ "About Vijay". Vikatan. 27 December 2021. Archived from the original on 27 December 2021. Retrieved 27 December 2021.
- ↑ ""I was born as a Christian, my wife is a Hindu": Vijay's father SA Chandrasekhar responds to allegations". Keralakaumudi Daily. 21 February 2020. Archived from the original on 4 January 2022. Retrieved 4 January 2022.
- ↑ "Rare picture of Vijay with his sister". IndiaGlitz.com. 25 February 2019. Archived from the original on 12 May 2021. Retrieved 23 December 2020.
- ↑ 19.0 19.1 "Mothers Day special Interview with Illayathalapathy Vijay mother Shobha Chandrasekhar – Tamil Movie News – IndiaGlitz" Archived 2022-09-28 at the Wayback Machine.
- ↑ "Vijay". starsbiography.
- ↑ "Vijay speaks about his childhood schooling in fathima matriculation school chennai".
- ↑ "Vijay | Which Celebrity belongs to your school/college?". Behindwoods. Retrieved 2017-12-28.
- ↑ "Top actors who studied in Loyola college". The Economic Times. 22 May 2023. Retrieved 1 December 2023.
- ↑ "Vijay Marriage: When The Tamil Superstar Fell For His Fan". The Bridal Box (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-07-28. Retrieved 2017-11-23.
- ↑ "Rediff On The Net, Movies: Gossip from the southern film industry". Rediff.com. 17 August 1998. Retrieved 18 July 2010.
- ↑ Andhra Jyothy (29 August 2023). "మెగాఫోన్ పడుతున్న విజయ్ వారసుడు". Archived from the original on 30 August 2023. Retrieved 30 August 2023.
- ↑ "rediff.com, Movies: Vijay meets his son on the Net!". Rediff.com. 26 August 2000. Retrieved 18 July 2010.
- ↑ "Great Pillai Gallery -A list of PILLAI WHO'S WHO". www.saivaneri.org. Archived from the original on 10 నవంబరు 2015. Retrieved 5 November 2015.
- ↑ "Poove Unakkaga - The First Blockbuster of Vijay's Career - #22YearsOfVijayism: The 11 Big Box Office Comebacks of Ilayathalapathy Vijay". www.behindwoods.com. Retrieved 11 January 2018.
- ↑ Awards, National Film (2018-01-15). "Congratulations to @actorvijay nominated for #BestSupportingActor at the #NationalFilmAwardsUK for his role on the film @MersalFilm Vote now". @NATFilmAwards (in ఇంగ్లీష్). Retrieved 2018-01-16.
- ↑ "BEAST: Vijay Thalapathy 65's First Look and Title is out". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-06-21. Archived from the original on 2021-06-21. Retrieved 2022-04-04.
- ↑ "Vijay's fan club to take 'new dimension', hints at his political plunge". Deccan Herald. Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.
- ↑ "Vijay Makkal Iyakkam was launched in 2009". The Times of India. 28 September 2015. Archived from the original on 14 November 2022. Retrieved 1 February 2024.
- ↑ "'Makkal Iyakkam won't be a political outfit'". The New Indian Express. 16 May 2012. Archived from the original on 4 February 2024. Retrieved 1 December 2023.
- ↑ "Tamil Superstar Vijay Calls Citizenship Law CAA "Unacceptable"". NDTV. 22 February 2019. Archived from the original on 6 October 2024. Retrieved 12 March 2024.
- ↑ "Actor Vijay speaks to students at meet in Chennai, takes a potshot at political parties". 17 June 2023. Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.
- ↑ Sakshi (2 February 2024). "రాజకీయ పార్టీ ప్రకటించిన హీరో విజయ్". Archived from the original on 3 February 2024. Retrieved 3 February 2024.
- ↑ Eenadu (13 April 2024). "రాజకీయ తెరపై తారల తళుకులు.. తమిళనాట పరిస్థితి ఇలా." Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.
- ↑ "Thalapathy Vijay Launches Political Party, Names it Tamizha Vetri Kazhagam (Read Official Statement)". Lokmat Times. 2 February 2024. Archived from the original on 6 October 2024. Retrieved 2 February 2024.
- ↑ "'Thalapathy' Vijay floats political party, names it 'Thamizhaga Vettri Kazhagam'". Deccan Herald. 2 February 2024. Archived from the original on 6 October 2024. Retrieved 2 February 2024.
- ↑ Eenadu (22 August 2024). "విజయ్ పార్టీ జెండా ఇదే.. ఆవిష్కరించిన నటుడు". Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024.
- ↑ "TVK president Vijay announces solatium for stampede victims". The Hindu (in Indian English). 27 September 2025. ISSN 0971-751X. Retrieved 27 September 2025.
- ↑ "'Not A Kingmaker, I Will Win': Actor Vijay's Candid Chat With NDTV". NDTV (in Indian English). 30 January 2026. Retrieved 31 January 2026.
- ↑ "విజయ్-సంగీత విడాకులు.. రూ. 250 కోట్లు అడిగారా?". Sakshi. Retrieved 2026-04-20.
- ↑ "Vijay: విజయ్ విడాకుల కేసు.. ఆరోజు ఇద్దరూ హాజరుకావాలి: కోర్టు ఆదేశం". EENADU. Retrieved 2026-04-20.
ఇతర లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Vijay పేజీ