ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ | |
---|---|
దర్శకత్వం | వెంకట్ ప్రభు |
స్క్రీన్ ప్లే | వెంకట్ ప్రభు ఎళిలరసు గుణశేఖరన్ కె. చంద్రు |
కథ | వెంకట్ ప్రభు [1] |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | సిద్ధార్థ నుని |
కూర్పు | వెంకట్ రాజన్ |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
నిర్మాణ సంస్థ | ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీs | 5 సెప్టెంబరు 2024(థియేటర్) 3 అక్టోబరు 2024 ( నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో) |
సినిమా నిడివి | 183 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) 2024లో విడుదలైన సినిమా. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. విజయ్, స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను న, ట్రైలర్‌ను ఆగస్ట్ 17న విడుదల చేయగా, సినిమాను సెప్టెంబర్ 15న విడుదలైంది.[2]
ది గోట్ తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అక్టోబర్ 3న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]
కథ
[మార్చు]గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ లో పని చేస్తూ ఓ మిషన్ కోసం భార్య పిల్లలతో థాయ్‌లాండ్ వెళ్లినప్పుడు కొడుకు జీవన్ (విజయ్)ను కోల్పోతాడు. దీంతో గాంధీ డిప్రెషన్‌కు లోనై స్క్వాడ్‌ను వదిలి బయటకు వచ్చేసి భార్యకు దూరంగా ఉంటూ పాస్‌పోర్ట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ ఉంటాడు. పదిహేనేళ్ల తర్వాత మాస్కోకు వెళ్లిన గాంధీకి జీవన్ కనిపించడంతో ఇండియాకు తీసుకొచ్చి మళ్లీ ఫ్యామిలీ అంతా కలిసి ఉంటారు. ఈ క్రమంలో గాంధీతో పాటు యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ బృందంలోని వారు ఒకరొకరు హత్యకు గురౌతారు. ఆ హత్యల వెనుక ఉన్నది ఎవరు? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[4]
నటీనటులు
[మార్చు]- విజయ్
- స్నేహ
- ప్రభుదేవా
- ప్రశాంత్
- మోహన్
- జయరాం
- అజ్మల్ అమీర్
- వైభవ్
- లైలా
- మీనాక్షి చౌదరి
- ప్రేమ్గీ అమరెన్
- యోగిబాబు
- అభ్యుక్త మణికందన్
- యుగేంద్రన్
- టి.శివ
- సుబ్బు పంచు
- అరవింద్ ఆకాష్
- అజయ్ రాజ్
- దిలీపన్
- వీటీవీ గణేష్
- పార్వతి నాయర్
- ఒమర్ లతీఫ్
- హృషీకేశ్
- అంజెనా కీర్తి
- సుబ్రమణియన్ గోపాలకృష్ణన్
- ఇర్ఫాన్ జైనీ
- శివకార్తికేయన్ (అతిధి పాత్ర)
- త్రిష కృష్ణన్ "మట్టా" పాటలో (అతిధి పాత్ర)
- వై.జి.మహేంద్రన్ (అతిధి పాత్ర)
- కనికా (అతిధి పాత్ర)
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాత: కల్పతి ఎస్. అఘోరం, కల్పతి గణేష్, కల్పతి సురేష్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు
- సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్
- ఎడిటర్: వెంకట్ రాజన్
- సంగీతం: యువన్ శంకర్ రాజా
మూలాలు
[మార్చు]- ↑ "Actor Cool Suresh Brings Goat To Watch Vijay's The Greatest of All Time; Watch". Mashable India (in Indian English). 5 September 2024. Archived from the original on 8 September 2024. Retrieved 6 September 2024.
- ↑ "ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్) | The Greatest of All Time movie review avm". Chitrajyothy Telugu News. 5 September 2024. Retrieved 8 September 2024.
- ↑ Hindustantimes Telugu (1 October 2024). "నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అప్‌కమింగ్ టాప్ 6 సినిమాలు.. ప్రతిదీ డిఫరెంట్ కాన్సెప్ట్.. ఏది ఎప్పుడు రిలీజ్ అంటే?". Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
- ↑ TV5 (5 September 2024). "రివ్యూ : ది గోట్ - గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్". Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)