యువన్ శంకర్ రాజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యువన్ శంకర్ రాజా
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంయువన్ శంకర్ రాజా
ఇతర పేర్లుయువన్, యువన్ శంకర్, వైఎస్ఆర్ , యు1
జననం (1979-08-31) 1979 ఆగస్టు 31 (వయసు 44)
మద్రాస్, తమిళనాడు, ఇండియా
మూలంపన్నైపురం, తమిళనాడు, ఇండియా
సంగీత శైలిఫిల్మ్ స్కోర్ , వరల్డ్ మ్యూజిక్
వృత్తిఫిల్మ్ కంపోసర్, సంగీత దర్శకుడు, రికార్డ్ ప్రొడ్యూసర్, ఇంస్ట్రుమెంటలిస్ట్, ఆరెంజర్, గాయకుడు, లిరిసిస్ట్
వాయిద్యాలుగిటార్, కీబోర్డ్/పియానో, వోకల్స్ (నేపధ్య గాయకుడు)
క్రియాశీల కాలం1996–ప్రస్తుతం
బంధువులుభవతారిణి (సోదరి), కార్తీక్ రాజా (సోదరుడు)

యువన్ శంకర్ రాజా (జ. 1979 ఆగస్టు 31) తమిళ, తెలుగు సంగీత దర్శకులు. వీరు సంగీత దర్శకులయిన ఇళయరాజా గారి అబ్బాయి. 1996లో అరవిందన్ అనే సినిమా ద్వారా 16 ఏళ్ళ వయసులో సంగీత దర్శకునిగా తెరంగేట్రం చేసిన యువన్ 2013లో వచ్చిన బిరియాని సినిమాతో 15 ఏళ్ళలో 100 సినిమాలకు సంగీతాన్ని అందించారు. వీరి సంగీతం పాశ్చ్యాత సంగీతం ఛాయల్లో ఉండటం గమనార్హం. తమిళనాట రీమిక్స్ సంప్రదాయాన్ని మొదలుపెట్టిన వీరు తెలుగునాట కూడా అనతికాలంలో కీర్తి గడించారు. ముఖ్యంగా వీరు తను పనిచేసిన సినిమాలకు ఇచ్చిన నేపథ్య సంగీతానికి విమర్శకుల, ప్రేక్షకుల మెప్పును పొందారు. సిప్రస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం అందుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడు కూడా యువన్ శంకర్ రాజా కావడం గమనార్హం.

యువన్‌ ఇటివల ఉల్‌ఫెల్‌ (woolfel) అను ఆ౦గ్‌ల చిత్‌ర౦కి సైన్‌ చేసాడు

తెలుగులో (నేరుగా) స్వరపరిచిన సినిమాలు

[మార్చు]
నెం. పాట గాయకులు
2002 "శేషు" 8 లో 4 పాటలను స్వరపరిచారు
2002 "మళ్ళీ మళ్ళీ చూడాలి"
2003 "ఆడంతే అదోటైపు"
2006 "కలిసుంటే"
2006 "హ్యాపీ"
2006 "రామ్"
2008 "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే"
2007 "రాజు భాయ్"
2009 "ఓయ్"
2011 "పంజా"
2012 "మిస్టర్ నూకయ్య"
2012 "దేనికైనా రేడీ" 5 లో 2 పాటలను స్వరపరిచారు
2021 "1945"
2022 "విరుమాన్"

ఇతర లంకెలు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.