శేషు
Appearance
శేషు | |
---|---|
దర్శకత్వం | జీవిత |
రచన | బాల (దర్శకుడు) |
నిర్మాత | బేబి శివాని |
తారాగణం | రాజశేఖర్, కళ్యాణి |
ఛాయాగ్రహణం | హరి అనుమోలు |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | యువన్ శంకర్ రాజా ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | శివ శివాని మూవీస్ |
విడుదల తేదీ | 28 ఫిబ్రవరి 2002 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శేషు 2002, ఫిబ్రవరి 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. జీవిత తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజశేఖర్, కళ్యాణి నాయికానాయకులుగా నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. యువన్ శంకర్ రాజాకు తెలుగులో మొదటి చిత్రం ఇది. 1999లో తమిళ దర్శకుడు బాల దర్శకత్వంలో విక్రమ్ నటించిన సేతు చిత్రం, ఈ చిత్రానికి మాతృక.
నటవర్గం
[మార్చు]- రాజశేఖర్ (శేషు)
- కళ్యాణి (అబిత)
- జ్యోతిలక్ష్మీ
- గణేష్
- నాజర్ (శేషు అన్న)
- శ్రీమాన్
- మోహిని పటేల్
- నకూల్ మెహతా
- మోహన్ విద్య
- అంజు
సాంకేతికవర్గం
[మార్చు]- మాటలు, దర్శకత్వం: జీవిత
- కథ, కథనం: బాల (దర్శకుడు)
- నిర్మాణం: బేబి శివాని
- సంగీతం: యువన్ శంకర్ రాజా
- ఛాయాగ్రహణం: హరి అనుమోలు
- కూర్పు: గౌతంరాజు
- నిర్మాణ సంస్థ: శివ శివాని మూవీస్
- పాటలు: చంద్రబోస్ & శ్రీహర్ష
పాటలు
[మార్చు]యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన తొలి తెలుగు చిత్రం శేషు. దీనికి తమిళ మాతృక అయిన సేతు సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. శేషు సినిమలో 8 పాటలుండగా, అందులోని 4 పాటల బాణీలను సేతు సినిమా నుండి తీసుకున్నారు. ఈ సినిమా పాటలల్లో గాయనిమణి గాత్రం కూడా లేదు. ఇందులోని పాటలను చంద్రబోస్, శ్రీహర్ష రాశారు.
సం. | పాట | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఏదిదారి బాటసారి" | ఇళయరాజా | ఎస్.పి. బాలు | 05:07 |
2. | "ఆకాశం కిందుంది" | యువన్ శంకర్ రాజా | టిప్పు, యువన్ శంకర్ రాజా, శ్రీనివాస్ | 05:13 |
3. | "సాయంత్రం చేరువయ్యిందో" | యువన్ శంకర్ రాజా | శంకర్ మహదేవన్ | 04:06 |
4. | "మన శేషు అన్న" | ఇళయరాజా | ఎస్.పి. బాలు | 02:27 |
5. | "చీయా చీయా" | యువన్ శంకర్ రాజా | దేవన్ ఏకాంబరం | 05:12 |
6. | "గూడు విడిచిన" | ఇళయరాజా | ఎస్.పి. బాలు | 03:01 |
7. | "మెరిసి మెరిసి" | ఇళయరాజా | ఉన్నికృష్ణన్ | 00:47 |
8. | "థీమ్ మ్యాజిక్" | ఇళయరాజా | వాయిద్యం | 05:13 |
మొత్తం నిడివి: | 34:03 |