చంద్రబోస్ (రచయిత)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంద్రబోస్
చంద్రబోస్
జననం
చంద్రబోస్

10 మే 1970
వృత్తిసినీ గీత రచయిత
నేపథ్యగాయకుడు
జీవిత భాగస్వామిసుచిత్రా చంద్రబోస్‌
తల్లిదండ్రులు
 • నర్సయ్య (తండ్రి)
 • మదనమ్మ (తల్లి)

చంద్రబోస్, తెలుగు సినిమా పాటల రచయిత. 1995లో వచ్చిన తాజ్ మహల్ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు.[1] ఇంజనీరింగ్ పట్టభద్రుడైనా ఈయన చిన్నప్పటి నుండి పాటల మీద మక్కువ పెంచుకొని సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఈయన పాటల రచయితనే కాక నేపథ్యగాయకుడు కూడా.

చంద్రబోస్ సాహిత్యం అందించిన ‘నాటు నాటు’ పాట 2023 మార్చి 13 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.[2][3][4]

69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో కొండపొలం (2021) సినిమాలోని ధమ్ ధమ్ ధమ్ పాటకు జాతీయ ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును ఎంపికయ్యాడు.[5]

బాల్యం

[మార్చు]

చంద్రబోస్ స్వస్థలం వరంగల్ జిల్లా, చిట్యాల మండలం, చల్లగరిగె అనే కుగ్రామం. తండ్రి నర్సయ్య ఉపాధ్యాయుడు. తల్లి మదనమ్మ గృహిణి. వారికి మొత్తం నలుగురు సంతానం. వారిలో చంద్రబోస్ ఆఖరి వాడు.[6] తల్లి మదనమ్మ 2019 మే 20 న మరణించింది.[7]

వారి గ్రామంలో అప్పుడప్పుడూ ఒగ్గు కథలు, చిందు భాగవతాలు, నాటకాలు వేసేవారు. తల్లితో కలిసి వాటిని చూసి చంద్రబోస్ పద్యాలు, పాటలపై ఆసక్తి పెంచుకున్నాడు. ఇంటి పక్కనే ఉన్న గుడిలో జరిగే భజనల్లో పాటలు పాడేవాడు. తరువాత ఆ ఊర్లోకి సినిమా హాలు రావడంతో సినిమాలు వీక్షించడం అలవాటైంది.

విద్య

[మార్చు]

చంద్రబోస్ ముందు డిప్లోమా, ఆ తరువాత ఇంజనీరింగ్ చదివాడు. చదువు పూర్తయ్యే సమయంలో పాటలపై ఆసక్తి కలిగింది. ఒక స్నేహితుని సాయంతో సినీ ప్రముఖుల దగ్గరికి వెళ్ళేవాడు.

సినీ ప్రస్థానం

[మార్చు]

దర్శకుడు ముప్పలనేని శివ చంద్రబోస్ పాటలను నిర్మాత రామానాయుడుకి చూపించడంతో తాజ్‌మహల్ సినిమాలో మంచుకొండల్లోన చంద్రమా అనే పాట రాయడానికి అవకాశం వచ్చింది. ఆ పాట బాగా ప్రజాదరణ పొందింది. అదే సమయానికి ఇంజనీరింగ్ కూడా పూర్తయింది. ఉద్యోగమా, సినీరంగంలో రెండో దాన్నే ఎంచుకుని తల్లిదండ్రులను కూడా అందుకు ఒప్పించాడు. ఆ తరువాత కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్ళిసందడి సినిమాలో కూడా అవకాశం వచ్చింది. ఆ సినిమా సంగీత పరంగా కూడా విజయం సాధించడంతో ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. 800 సినిమాల్లో 3300 పాటల్లో పాటలు రాశాడు.

పాటల రకాలు

[మార్చు]
 • స్ఫూర్తిదాయక పాటలు: బడ్జెట్ పద్మనాభం చిత్రంలోని 'ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన' అనే పాట మొదటి స్ఫూర్తిదాయక పాట. ఓమారియా ఓమారియా (చూడాలనివుంది), కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి (ఠాగూర్), నవ్వేవాళ్లు నవ్వని ఏడ్చేవాళ్లు ఏడ్వనీ (చెన్నకేశవరెడ్డి), లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ (డాడీ), చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని (నేనున్నాను), ఇంతే ఇంతింతే, లేలేలే ఇవ్వాళే లే (గుడుంబా శంకర్), అభిమాని లేనిదే హీరోలు లేరులే,
 • స్నేహం గురించిన పాటలు: ట్రెండు మారినా ఫ్రెండ్ మారడు (ఉన్నది ఒకటే జిందగీ), ఎగిరే ఎగిరే (కొచెం ఇష్టం కొచెం కష్టం)
 • తల్లిదండ్రులపై పాటలు: పెదవే పలికిన మాటల్లోనే (నాని), లాలి లాలి జోలాలి (ఢమరుకం), కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా (మనం), చీరలోని గోప్పదనం (పల్లకిలో పెళ్ళికూతురు)
 • అన్నాచెల్లెలి పాటలు: మరుమల్లి జాబిల్లి (లక్ష్మీనరసింహా), అన్నయ్య అన్నాంటే (అన్నవరం)
 • ప్రేమపాటలు: నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి (ఆది), కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని (నువ్వొస్తావని), నువు చూడూ చూడకపో (ఒకటో నెంబర్ కుర్రాడు), నువ్వే నా శ్వాస (ఒకరికొకరు), పోయే పోయే లవ్వే పోయే (ఆర్య2), పంచదార బొమ్మాబొమ్మా (మగధీర)
 • కళాశాల పాటలు: ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి (స్టూడెంట్ నెంబర్ వన్)
 • దేవుని పాటలు: జైజై గణేషా (జై చిరంజీవా)
 • తెలుగు భాషపై పాటలు: తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పతనం (నీకు నేను నాకు నువ్వు) తెలుగంటే గోంగూర (సుబ్రమణ్యం ఫర్ సేల్),
 • ఇతర పాటలు: బ్రాండ్ల పేరుతో 'చీరలోని గొప్పదనం' (పల్లకిలో పెళ్ళికూతురు), షాప్ బోర్డు పేర్లతో 'గంగా ఏసి వాటర్' (సై), టెలిఫోన్ డైరెక్టరీతో 'ఎక్కడున్నావమ్మా' (ఒకరికొకరు), సెల్ ఫోన్ నెంబర్లతో 'నీది 98490 నాది 98480' (ఒకటో నెంబర్ కుర్రాడు), డబ్బుల గురించి 'రెలుబండిని నడిపేది' (నువ్వొస్తావని), నవ్వు గురించి 'ఒకచిన్ని నవ్వేనవ్వి యుద్ధాలేన్నో ఆపొచ్చు' (అశోక్), అమ్మాయి పేర్లతో 'నాపేరు చెప్పుకోండి' (పల్లకిలో పెళ్ళికూతురు), దేవున్నే పిలిచావంటే రాడురాడు ఎంతో బిజీ (లక్ష్మీనరసింహా), జ్ఞాపకాలపై 'గుర్తుకొస్తున్నాయి' (నా ఆటోగ్రాఫ్), భార్యపై 'సమయానికి తగు సేవలు' (సీతయ్య)

వివాహం

[మార్చు]

పెళ్ళిపీటలు సినిమాకు పనిచేస్తుండగా నృత్య దర్శకురాలు సుచిత్రా చంద్రబోస్‌ పరిచయమైంది. అది ప్రేమగా మారి ఇద్దరూ ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు.

ఇతర వివరాలు

[మార్చు]
 • నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ కు సాంస్కృతిక రాయబారిగా (6సంవత్సరాలుగా) ఉన్నారు.

పాటల సంకలనం

[మార్చు]

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
అకాడమీ అవార్డులు
క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్
గోల్డెన్ గ్లోబ్ అవార్డులు
నంది అవార్డులు[10]
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్
సైమా అవార్డులు
 • ఉత్తమ గీత రచయిత – మనం (2014) నుండి "కనిపించిన మా అమ్మ" కోసం తెలుగు
 • ఉత్తమ గీత రచయిత – రంగస్థలం (2018) నుండి "ఎంత సక్కగున్నావే"కి తెలుగు[12]
 • ఉత్తమ గీత రచయిత – పుష్ప: ది రైజ్ (2022) నుండి "శ్రీవల్లి"కి తెలుగు[13]
సంతోషం ఫిల్మ్ అవార్డ్స్

సన్మానం

[మార్చు]

ఆస్కార్‌ పురస్కారాన్ని గెలుచుకున్నఅనంతరం కీరవాణి, చంద్రబోస్‌లను 2023 ఏప్రిల్ 09న హైదరాబాద్‌లోని శిల్పా కళావేదికలో తెలుగు నిర్మాతల మండలి, ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి. శ్రీనివాస్ గౌడ్, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ అనిల్ కుర్మాచలం సన్మానించారు.[14][15]

చెప్పుకోదగ్గ పాటలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. E, Madhukar. "Chandrabose: Reading literature, friends encouragement my forte". thehansindia.com. The Hans India. Retrieved 16 November 2017.
 2. "Oscar 2023: చరిత్ర సృష్టించిన 'RRR'.. 'నాటు నాటు'కు ఆస్కార్‌." EENADU. Retrieved 2023-04-14.
 3. Chaitanya, Sai (2023-03-13). "ఆస్కార్ లో నాటు నాటు ఊపు - గర్జించిన జూ ఎన్టీఆర్..!!". www.telugu.oneindia.com. Retrieved 2023-04-14.
 4. "The lines I wrote in the Naatu Naatu song, all my experiences in my Village: Chandrabose". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-03-13. Retrieved 2023-03-13.{{cite web}}: CS1 maint: url-status (link)
 5. "National Awards 2023: జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌.. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు వీళ్లే". EENADU. 2023-08-24. Archived from the original on 2023-08-24. Retrieved 2023-08-24.
 6. ఈనాడు డిసెంబరు 8, ఆదివారం వసుంధర
 7. "గేయ రచయిత చంద్రబోస్‌కు మాతృవియోగం". ఈనాడు. 20 May 2019. Archived from the original on 20 May 2019.
 8. "Nagavalli — Movie Review". Oneindia Entertainment. Archived from the original on 22 అక్టోబరు 2012. Retrieved 9 June 2020.
 9. "Chandrabose". Golden Globes (in ఇంగ్లీష్). Archived from the original on 2023-01-11. Retrieved 2023-01-11.
 10. "నంది అవార్డు విజేతల పరంపర (1964–2008)" [A series of Nandi Award Winners (1964–2008)] (PDF). Andhra Pradesh (magazine)|Information & Public Relations of Andhra Pradesh. Retrieved 21 August 2020.
 11. "Winners list: 62nd Britannia Filmfare Awards (South)". The Times of India. 27 June 2015. Archived from the original on 27 June 2015. Retrieved 27 June 2015.
 12. "SIIMA Awards 2019: Ram Charan, Keerthy Suresh and Yash win big laurels". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-08-16. Retrieved 2022-11-10.
 13. "SIIMA 2022: Check full list of winners". Deccan Herald. 19 September 2022. Retrieved 24 December 2022.
 14. Namasthe Telangana (10 April 2023). "తెలుగు సినిమా కీర్తి విశ్వవ్యాప్తమైంది". Archived from the original on 10 April 2023. Retrieved 10 April 2023.
 15. Eenadu (10 April 2023). "ఆస్కార్‌తో తెలుగు సినిమా కీర్తి విశ్వవ్యాప్తమైంది". Archived from the original on 10 April 2023. Retrieved 10 April 2023.