రణం
స్వరూపం
| రణం | |
|---|---|
![]() | |
| దర్శకత్వం | అమ్మ రాజశేఖర్ |
| రచన | అమ్మ రాజశేఖర్ |
| నిర్మాత | పోకూరి బాబురావు |
| తారాగణం | గోపీచంద్, కామ్న జెఠ్మలాని, చంద్రమోహన్, ఆలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రమాప్రభ |
| సంగీతం | మణిశర్మ |
విడుదల తేదీ | 2006 ఫిబ్రవరి 10[1] |
| భాష | తెలుగు |
రణం అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 2006 నాటి రొమాంటిక్ యాక్షన్ చిత్రం. ఇందులో గోపీచంద్, కామ్న జెత్మలాని ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాను పోకూరి బాబురావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చారు.
కథ
[మార్చు]చిన్నా చదువుకోసం హైదరాబాద్ వస్తాడు. అందరూ భయపడే భగవతి అనే డాన్ చెల్లెలు మహేశ్వరితో ప్రేమలో పడతాడు. భగవతి అతన్ని భయపెట్టడానికి వస్తే తెలివిగా తప్పించుకుంటూ ఉంటాడు. చిన్నా అతన్ని తప్పించుకుని చివరికి తన ప్రేమను ఎలా నెగ్గించుకున్నాడన్నది మిగతా కథ.


నటవర్గం
[మార్చు]- చిన్నాగా గోపీచంద్
- మహేశ్వరిగా కామ్న జెఠ్మలాని
- భగవతిగా బిజు మేనన్
- చిన్నా తండ్రిగా చంద్రమోహన్
- ఆలీ
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- మహేశ్వరి బామ్మగా రమాప్రభ
- వేణు మాధవ్
- సుమన్ శెట్టి
- వేణు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: అమ్మ రాజశేఖర్
- నిర్మాత: పోకూరి బాబు రావు
- సంగీత దర్శకత్వం: మణిశర్మ
- పాటల రచయిత: మణిశర్మ, సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్
- గాయకులు: నవీన్, సుచిత్ర, మల్లికార్జున్, మహాలక్ష్మి అయ్యర్, అనురాధ శ్రీరామ్, టిప్పు, జెస్సీ గిఫ్ట్. కెకె
పాటలు
[మార్చు]ఈ సినిమాలో కందికొండ, సుద్దాల అశోక్ తేజ పాటలు రాశారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర ఆడియోను ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల చేశారు.[2]
| రణం | ||||
|---|---|---|---|---|
| సినిమా పాటలు by | ||||
| Released | 18 జనవరి 2006 | |||
| Recorded | 2005 | |||
| Genre | సినిమా పాటలు | |||
| Length | 27:26 | |||
| Label | ఆదిత్య మ్యూజిక్ | |||
| Producer | మణిశర్మ | |||
| మణిశర్మ chronology | ||||
| ||||
సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: మణిశర్మ.
| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "చెలి జాబిలి" | కందికొండ | నవీన్, సుచిత్ర | 4:35 |
| 2. | "వారెవ్వా" | సుద్దాల అశోక్ తేజ | మల్లికార్జున్, మహాలక్ష్మి అయ్యర్ | 4:35 |
| 3. | "హే చిన్న" | భాషాశ్రీ | టిప్పు, అనురాధ శ్రీరామ్ | 4:04 |
| 4. | "బుల్లిగౌను" | భాషాశ్రీ | జెస్సీ గిఫ్ట్ | 5:36 |
| 5. | "నల్లని మబ్బు" | భాషాశ్రీ | వర్ధిని | 4:38 |
| 6. | "గణ గణ" | చంద్రబోస్ | కేకే, సంగీత కట్టి | 3:37 |
| మొత్తం నిడివి: | 27:26 | |||
మూలాలు
[మార్చు]- ↑ "Ranam (2006) | Ranam Movie | Ranam Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-05-14.
- ↑ "Audio release - Ranam". Idlebrain.com. 18 January 2005.
