కందికొండ యాదగిరి
కందికొండ యాదగిరి | |
---|---|
జననం | అక్టోబర్ 13, 1973 నాగుర్లపల్లి గ్రామం, నర్సంపేట మండలం, వరంగల్ జిల్లా |
మరణం | మార్చి 12, 2022 వెంగళరావు నగర్, హైదరాబాదు |
మరణ కారణం | క్యాన్సర్, అనారోగ్యం |
విద్య | ఎం. ఎ పాలిటిక్స్, ఎం. ఎ తెలుగు |
విద్యాసంస్థ | ఉస్మానియా విశ్వవిద్యాలయం |
వృత్తి | సినీ గీత రచయిత, కవి, కథకుడు |
జీవిత భాగస్వామి | రమాదేవి |
పిల్లలు | మాతృక (కూతురు), ప్రభంజన్ (కుమారుడు) |
కందికొండ (1973 అక్టోబరు 13 - 2022 మార్చి 12) గా పిలువబడే కందికొండ యాదగిరి ప్రముఖ సినీ గీత రచయిత, కవి, కథకుడు.[1][2] 20 ఏళ్ల సినీ ప్రస్థానంలో 1300లకు పైగా పాటలు రాశారు.
జీవిత విశేషాలు
[మార్చు]కందికొండ స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామం. ప్రాథమిక విద్య సొంతూర్లోనే పూర్తిచేసాడు. డిగ్రీ వరకు మహబూబాబాద్ లో చదువుకున్నాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి యం.ఎ (తెలుగు లిటరేచర్), యం.ఎ (పొలిటికల్ సైన్స్) చేసారు. కందికొండ తాను చదువుకునే రోజుల నుంచే పాటలు రాయడం నేర్చుకున్నాడు.
ఆయనకు ఇంటర్ చదివేటప్పుడు చక్రితో పరిచయం ఏర్పడింది. మొదట్లో జానపద గీతాలు రాసిన కందికొండ సినీ సంగీత దర్శకుడైన చక్రి సాన్నిహిత్యంతో సినిమా సాహిత్యం వైపు మొగ్గు చూపాడు. తొలిసారిగా చక్రి సంగీత దర్శకత్వం వహించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలో మళ్లి కూయవే గువ్వా పాట రచనతో సినీ సాహిత్యంలో అడుగుపెట్టారు. ఆ పాట చాలా ప్రాచుర్యం పొందింది. సంగీత దర్శకుడు చక్రి, దర్శకుడు పూరీ జగన్నాథ్ వరుస అవకాశాలతో పాటలు రాసి గేయరచయితగా నిలదొక్కుకున్నాడు.
కందికొండ సినీరంగంలో అడుగుపెట్టిన నాటి నుండి పన్నెండేళ్ళ సినీ ప్రస్థానంలో వేయికి పైగా పాటలు వ్రాసారు. అంతేకాకుండా తెలంగాణ నేపథ్యంలో ఎన్నో జానపద గీతాలు కూడా రచించారు. ఆయన బతుకమ్మ నేపథ్యంలో రాసిన పాటలు పల్లెపల్లెనా, గడపగడపనా, జనాల నోటన మార్మోగాయి.
ఆయన పాటలే కాదు కవిత్వం రాయటంలోనూ దిట్ట. తెలంగాణా యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయటం ఆయన ప్రత్యేకత. మట్టిమనుషుల వెతలను, పల్లె బతుకు చిత్రాన్ని కథలుగా రచించి ఆయన కథకుడిగా కూడా విశేష ఆదరణ పొందారు.[3]
గేయ రచయితగా
[మార్చు]- ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం
- 143
- ఆంధ్రావాలా (2004): గిచ్చి గిచ్చి, మల్లెతీగరోయ్, కొక్కొ కోలమిస్స
- అల్లరి పిడుగు
- ఆప్తుడు
- ఒక రాధ ఇద్దరి కృష్ణుల పెళ్ళి
- చక్రం
- ఎంజాయ్
- ఆడుతూ పాడుతూ
- షాక్
- రణం
- పోకిరి
- సీతారాముడు
- స్టాలిన్
- తొలి చూపులోనే
- పొగరు
- చిన్నోడు
- రిలాక్స్
- భాగ్యలక్ష్మి బంపర్ డ్రా
- ఆదిలక్ష్మి
- నువ్వంటే నాకిష్టం
- జూనియర్స్
- ధన 51
- దొంగ దొంగది
- అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి
- మున్నా
- లవ్ యు బంగారమ్ (2014): రెండు కళ్ళు సాలవట
- మా అబ్బాయి (2017): కదిలే కదిలే, ఆ చందమామ
మరణం
[మార్చు]49 ఏళ్ల కందికొండ క్యాన్సర్‌ని జయించి, కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 2022 మార్చి 12న హైదరాబాదులోని తన ఇంట్లో మరణించాడు.[4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ. "పాటకు కొత్త పరిమాళాలద్దిన కందికొండ". Retrieved 30 September 2017.[permanent dead link]
- ↑ http://telugucinemacharitra.com/%E0%B0%97%E0%B1%80%E0%B0%A4-%E0%B0%B0%E0%B0%9A%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%95%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95%E0%B1%8A%E0%B0%82%E0%B0%A1/
- ↑ Sakshi (13 March 2022). "1300 పాటల పరవశం.. కందికొండ సినీ ప్రస్థానం". Archived from the original on 13 March 2022. Retrieved 13 March 2022.
- ↑ విలేకరి (12 March 2022). "గేయ రచయిత కందికొండ కన్నుమూత!". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Retrieved 12 March 2022.[permanent dead link]
- ↑ Namasthe Telangana (12 March 2022). "కందికొండ కన్నుమూత". Archived from the original on 12 March 2022. Retrieved 12 March 2022.
- ↑ Andhra Jyothy (13 March 2022). "గీత రచయిత కందికొండ ఇకలేరు". Archived from the original on 13 March 2022. Retrieved 13 March 2022.
ఇతర లింకులు
[మార్చు]- All articles with dead external links
- Pages using infobox person with unknown parameters
- Infobox person using religion
- Infobox person using residence
- Wikipedia articles with MusicBrainz identifiers
- తెలుగు సినిమా పాటల రచయితలు
- వరంగల్లు గ్రామీణ జిల్లా కవులు
- విప్లవ రచయితలు
- వరంగల్లు గ్రామీణ జిల్లా సినిమా పాటల రచయితలు
- 2022 మరణాలు