Jump to content

పోకిరి

వికీపీడియా నుండి
పోకిరి
(2006 తెలుగు సినిమా)
తారాగణం మహేష్ బాబు,
ఇలియాన,
కృష్ణుడు (నటుడు)
ప్రకాశ్ రాజ్,
సాయాజీ షిండే,
ఆశిష్ విద్యార్థి,
బ్రహ్మానందం,
ఆలీ,
నాజర్,
సుధ
మల్లేశ్ బలష్టు
భాష తెలుగు

పోకిరి 2006లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించిన తెలుగు సినిమా. ఇది బాక్సాఫీసు వద్ద ఒక నూతన ఒవరడిని సృస్టించింది. మగధీర చిత్రం విడుదలవరకు ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోఅత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది.

కథ సారాంశం

[మార్చు]

పండు అనే మాఫియా రౌడీ, డబ్బు కోసం ప్రజలను చంపే వారిని చంపే ఒక ముసుగులో ఉన్న పోలీసు అధికారి కథ ఇది. అతను శ్రుతి అనే ఒక అందమైన యోగా ఉపాధ్యాయురాలితో ప్రేమలో పడతాడు. అలీ భాయ్ అనే వాడి మాఫియా గుంపులో చేరి అలీ భాయ్ మీద సమరానికి దిగుతాడు. అతను ఈ సమరం ఎలా గెలిచాడు, అతని నిజ స్వరూపం ఎలా బయటపెట్టాడనేదే మిగిలిన కథాంశం. పండు గత చరిత్ర ఈ ఛిత్రానికి ప్రాణం.

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

పోకిరి సినిమా స్క్రిప్ట్ పూరీ జగన్నాధ్ తన తొలిచిత్రం బద్రి చిత్రీకరిస్తున్న సమయంలోనే రాసుకున్నారు. అప్పటికి ఆ ప్రాజెక్టుకు ఆయన పెట్టుకున్న పేరు "ఉత్తమ్‌సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ". ఆ తర్వాత కొన్నేళ్ళకు వరుస విజయాల అనంతరం ఆంధ్రావాలా భారీ పరాజయం పాలైన తర్వాత పూరీ జగన్నాథ్ చిరంజీవితో "శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీ" పేరుతో ఓ సినిమా ప్లాన్ చేశారు. చిరంజీవితో సినిమా అంటే ఆయన స్క్రిప్ట్ ఫైనలైజ్ చేయడం డేట్స్ ఇచ్చిన సినిమాలు పూర్తవ్వడం వంటి చాలా కారణాలతో కొంత ఆలస్యం ఉంటుంది. ఆ కారణంగా అప్పటికే తన వద్ద ఉన్న స్క్రిప్టుతో రవితేజ హీరోగా "ఉత్తమ్‌సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ" సినిమా చేద్దామనున్నారు. ఆ ప్రాజెక్ట్ పేరు వినీవినడంతోనే సినిమా చేద్దామన్న నిర్ణయానికి రవితేజ వచ్చేశారు. అయితే తమిళ సినిమా ఆటోగ్రాఫ్ రీమేక్ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ చేసే అవకాశం రవితేజకి వచ్చింది. రవితేజకి అది ఇష్టమైన సబ్జెక్ట్, వదులుకుంటే ఎవరైనా చేసేస్తారని దాన్ని అంగీకరించారు. దాంతో ఈ ప్రాజెక్ట్ వాయిదాపడింది. ఈలోగా తన తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా 143 సినిమా చేశారు పూరీ జగన్నాథ్. అయితే ఆ సినిమా చేశాకా కూడా రవితేజ డేట్స్ ఖాళీగా లేకపోవడంతో పూరీ జగన్నాథ్ ఈ స్క్రిప్ట్ ని విలన్, సపోర్టింగ్ పాత్రల్లో చేస్తున్న సోనూ సూద్తో చేసేద్దామని అనుకున్నారు. సోనూ సూద్ ని హీరోగా పరిచయం చేసి ఈ సినిమా చేయడం ప్రయోగాత్మకమే అయినా ఆలస్యం చేయడం కన్నా అదే నయమని భావించారు. కానీ కొన్ని మార్కెట్ లెక్కలు కుదరకపోవడంతో ఆ ఆలోచన వదులుకున్నారు.
అలా చివరకు నవంబర్ 3, 2004న హైదరాబాద్ తాజ్ హోటల్లో మహేష్ బాబుకు పూరీ కథ చెప్పారు. అప్పుడు చెప్పిన కథ ప్రకారం హీరో పాత్ర పేరు ఉత్తమ్ సింగ్, ఓ సిక్ఖుల కుర్రాడు. కానీ చివర్లో అతని తండ్రి సూర్యనారాయణ అనీ, అతనో పోలీసాఫీసర్ అనీ తెలుస్తుంది. కథ మహేష్ బాబుకు నచ్చింది, తర్వాతి సంవత్సరం మొదలుపెట్టేద్దామని మహేష్ బాబు అంగీకరించేశారు. అయితే హీరోకి ఉన్న సిక్ఖు నేపథ్యం తీసేయమని మహేష్ అడిగారు. దాంతో హీరో సిక్ఖు అన్న నేపథ్యాన్ని తీసేశారు. అప్పటివరకూ స్క్రిప్ట్ పేరును దాని నేపథ్యంలోనే ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ అని పెట్టారు, దాన్ని మార్చేయడంతో పూరీ సినిమాకి పోకిరి అన్న పేరు పెట్టారు.[1]

నటీనటుల ఎంపిక

[మార్చు]

పోకిరి సినిమా మొట్టమొదట రవితేజతో తీద్దామనుకున్నారు. ఆయనకు కూడా సినిమా నచ్చి ఒకే చేశారు. కానీ ఎప్పుడూ డేట్స్ సమస్య వస్తూండడంతో ఆయన చేయలేకపోయారు. తర్వాత పూరీ జగన్నాథ్ సోనూ సూద్ హీరోగా సినిమా చేద్దామని భావించారు. అయితే సినిమాకు అవసరమైన కొన్ని లెక్కలు సరిపడకపోవడంతో ప్రాజెక్టు సోనూ సూద్ నుంచి చేజారింది. చివరకు మహేష్ బాబు కథ విని సినిమా అంగీకరించారు. సినిమాలో ఆయన పాత్ర కోసం అప్పటివరకూ ఒకలా ఉన్న మహేష్ హెయిర్ స్టైల్ విభిన్నంగా మార్చారు. సినిమా హీరోయిన్ గా ముందు ఆయేషా టాకియాని పెట్టుకుందామనుకున్నారు. అయితే ఆఖరి నిమిషంలో హీరోయిన్ ని మార్చారు. తర్వాత చాలామందిని హీరోయిన్ పాత్ర కోసం చూశారు. అలా చూసినవారిలో దీపికా పదుకునే, పార్వతీ మెల్టన్ వంటివారు ఉన్నారు. ఆఖరికి దేవదాసు సినిమా ద్వారా సినిమాలకు పరిచయమైన ఇలియానాని హీరోయిన్ గా తీసుకున్నారు.[1]

చిత్రీకరణ

[మార్చు]

సినిమా చిత్రీకరణ 70 రోజుల్లో పూర్తైంది. పూరీ జగన్నాథ్ సినిమా షూటింగ్ చాలా వేగంగా చకచకా చేశారు. ముఖ్యంగా ప్రతీ షాట్ సింగిల్ టేక్ లోనే ఒకే చేసేశారు.[1]

విడుదల, స్పందన

[మార్చు]

ఏప్రిల్ 28, 2006న సినిమా విడుదలైంది. సినిమా సంచలన విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది.[1] ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమ ప్రారంభమైన 75 సంవత్సరంలో విడుదలైంది. సినిమా సాధించిన కలెక్షన్లు రూ.40 కోట్లు దాటడం 75ఏళ్ళ సినీ పరిశ్రమలో కొత్త రికార్డుగా నిలిచింది.

రీమేక్స్

[మార్చు]

సినిమా తమిళంలో 2007లో విజయ్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో పోక్కిరి అన్న పేరుతో రీమేక్ చేశారు. హిందీలో వాంటెడ్ అన్న పేరుతో ప్రభుదేవానే దర్శకునిగా సల్మాన్ ఖాన్ హీరోగా పునర్నిర్మించారు. కన్నడంలో దర్శన్ హీరోగా పోర్కి అన్న పేరుతోనూ, బెంగాలీలో షకీబ్ ఖాన్ హీరోగా రాజోట్టో పేరిట రీమేక్ చేశారు. ఇవన్నీ సంచలన విజయాలు సాధించినవే.[1]

మహేష్ బాబు - ఇలియాన

నటీనటులు

[మార్చు]

సంభాషణలు

[మార్చు]
  • ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండు బ్లాక్ అవుతుందో, ఆడే పండుగాడు. నేనే, ఏంటి?
  • గన్నూ నాదే, శృతీ నాదే!
  • సినిమాలు జూట్లేదేటీ?
  • నేనెంత ఎదవనో నాకే తెలియదు.
  • ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినను.

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలో మొత్తం 6 పాటలు ఉన్నాయి.

  • 1.జగడమే - కునాల్ గుంజన్ వాలా, రచన: కందికొండ యాదగిరి
  • 2.దేవుడ...దేవుడ - నవీన్ , రచన: భాస్కర భట్ల
  • 3.డోలే డోలే దిల్ జర జరా - రంజిత్, సుచిత్ర , రచన: విశ్వా
  • 4.గల గల పారుతున్న గోదారిలా - నిహాల్ , రచన: కందికొండ యాదగిరి
  • 5.ఇప్పటికింకా నావయస్సు నిండా పదహారే - కార్తీక్, సుచిత్ర , రచన: భాస్కర భట్ల
  • 6.చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా - కార్తీక్, మహాలక్ష్మి అయ్యర్ , రచన: భాస్కర భట్ల

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 పులగం, చిన్నారాయణ. "మైండ్ బ్లాక్ చేసింది". సాక్షి. Retrieved 12 August 2015.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పోకిరి&oldid=4211390" నుండి వెలికితీశారు