గలగల పారుతున్న గోదారిలా (క్రొత్త పాట)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
POkiri2.jpg
పోకిరి సినిమా పోస్టరు

ఈ పాట మహేష్ బాబు, ఇలియానా నటించిన పోకిరి చిత్రం లోనిది. ఈ పాట మహేశ్ బాబు తండ్రి ఐన తెలుగు చలనచిత్ర కథానాయకుడు ఘట్టమనేని కృష్ణ, నాయకి జమున నటించిన గౌరి (1974 సినిమా) చిత్రం‌లోని "గలగల పారుతున్న గోదారిలా" పాటకి పునర్నిర్మాణం. మూలగీతం దేశభక్తినీ, పల్లెవాసుల జీవితాన్నీ చాటేది కాగా, ఈ చిత్రంలో ప్రేయసి తన కోసం పడే బాధలో తనకి హాయి ఉన్నది అని ప్రియుడు తెలిపే పాట. మణిశర్మ స్వరాలు కూర్చి, కందికొండ యాదగిరి సాహిత్యాన్ని ఇచ్చిన ఈ పాటను నిహాల్ పాడారు.

గీతం

[మార్చు]

గలగల పారుతున్న గోదారిలా
జలజల జారుతుంటె కన్నీరలా
||గల గల||
నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నదీ హాయిగా
||నా కోసమై||
||గల గల||

వయ్యారి వానలా వాన నీటిలా ధారగా
వర్షించి నేరుగా వాలినావిలా నా పైనా
తెన్నేటి తారలా వేచి నువ్విలా చాటుగా
పొమ్మన పోవుగా చేరుతావిలా నా లోనా

ఉవ్వోహువోహా
ఈ అల్లరి
ఉవ్వోహువోహా ఉవ్వోహువోహా
బాగున్నది
||గల గల||

Gal I'm watching your booty
Coz you're making me to feel so naughty
Let's go out to night and party
Ohu vohu vohu vohu vohu voho

Gal I'm watching your beauty
To love you forever is my duty
So feel it you're my baby
Ohu vohu vohu vohu vohu voho

చామంతి రూపమా రాకుమా
ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా
హిందోళ రాగమా మేళ తాళమా గీతమా
కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా

ఉవ్వోహువోహా
ఈ లాహిరీ
ఉవ్వోహువోహా ఉవ్వోహువోహా
నీకే మరీ

||గల గల||

ఇతర విశేషాలు

[మార్చు]
  • సుప్రసిద్ధ స్పానిష్ గాయకుడు ఎన్రికె ఇగ్లెషియస్ పాడిన I don't know why, why, but I like to see you cry అనే పాట ఇందులోని సాహిత్యానికి స్ఫూర్తి

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]