సోనూ సూద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోనూ సూద్
Sonu sood 2012.jpg
జననంసోనూ సూద్
1972/1973 (age 46–47)[1]
పంజాబ్, భారతదేశం
ఇతర పేర్లుసోనూ,
హాండ్సం విలన్,
రొమాంటిక్ విలన్
జాతిపంజాబీ
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు1999 – ఇప్పటివరకు
జీవిత భాగస్వామిసోనాలి

సోనూ సూద్ ఒక భారతీయ నటుడు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటించాడు. నాటకాలలో కూడా నటించాడు. తెలుగులో అరుంధతి చిత్రానికి ఉత్తమ ప్రతినాయకునిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు.

జీవిత విశేషాలు[మార్చు]

సోనూ సూద్ పంజాబ్ లోని మోగ అనే పట్టణంలో జన్మించాడు. నాగపూర్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తరువాత మోడలింగ్, ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్ చేసేవాడు. అప్పుడే సినిమాల్లోకి వెళ్ళాలనే కోరిక బలపడింది. ఒక నెలరోజులు నటనలో శిక్షణ తీసుకున్నాడు.

కెరీర్[మార్చు]

1999 లో కుళ్ళళలగర్ అనే తమిళ సినిమాలో సౌమ్య నారాయణ అనే పూజారి పాత్రతో చిత్రరంగంలోకి ప్రవేశించాడు. తరువాత మరో తమిళ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా నటించాడు. 2000 లో శివనాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన హ్యాండ్సప్ అనే సినిమాలో నటించాడు. కానీ బాలీవుడ్ సినిమాలో నటించాలని కోరిక ఉండేది. 2002 లో వచ్చిన షాహిద్-ఏ-ఆజం అనే హిందీ సినిమాలో భగత్ సింగ్ పాత్ర పోషించాడు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువ లో అభిషేక్ బచ్చన్ తమ్ముడిగా నటించాడు. తరువాత నాగార్జున సరసన సూపర్ సినిమాలో హైటెక్ దొంగగా నటించాడు. అరుంధతి సినిమాలో పశుపతి పాత్రతో మంచి పేరు సాధించాడు. ఆ సినిమాకు ఉత్తమ విలన్ గా నంది పురస్కారం లభించింది.[2]

-- సమాజ సేవ --

సోనూసూద్ వృత్తి పరంగా నటుడు. ప్రవృత్తి పరంగా సమాజ సేవకుడు. కరోనా వైరస్ విజ‌ృంభిస్తున్న నేపథ్యంలో సోనూ సూద్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రవాసీ రోజ్గార్ అనే వెబ్సైట్ ద్వారా వలస కార్మికులకు ఉపాధి చూపిస్తున్నారు.

నటించిన చిత్రాలు[మార్చు]

తెలుగు[మార్చు]

 1. సీత (2019)
 2. అబినేత్రి (2016)
 3. ఆగడు (2014)
 4. జులాయి (2012)
 5. ఊ కొడతారా ఉలిక్కి పడతారా (2011)
 6. తీన్ మార్ (2011)
 7. కందిరీగ (2011)
 8. దూకుడు (2011)
 9. శక్తి (2011)
 10. అరుంధతి (2009)
 11. ఆంజనేయులు (2009)
 12. ఏక్ నిరంజన్ (2009)
 13. నేనే ముఖ్యమంత్రినైతే (2009)
 14. మిస్టర్ మేధావి (2008)
 15. అశోక్ (సినిమా) (2006)
 16. చంద్రముఖి (2005)
 17. అతడు (2005)
 18. సూపర్ (సినిమా) (2005)
 19. అమ్మాయిలు అబ్బాయిలు (2003)

హిందీ[మార్చు]

 1. జోధా అక్బర్ (2009)

మూలాలు[మార్చు]

 1. Sonu Sood turns producer with Lucky Unlucky - The Hindu
 2. సాక్షి ఫన్ డే, సెప్టెంబరు 11, 2016, 14వ పేజీ

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సోనూ_సూద్&oldid=3024002" నుండి వెలికితీశారు