ఏక్ నిరంజన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏక్ నిరంజన్
(2009 తెలుగు సినిమా)
Ek Niranjan poster.jpg
దర్శకత్వం పూరీ జగన్నాథ్
కథ పూరీ జగన్నాథ్
తారాగణం ప్రభాస్, కంగన రనౌత్
ఛాయాగ్రహణం శ్యాం కె. నాయుడు
నిర్మాణ సంస్థ ఆదిత్య రామ్ మూవీస్
విడుదల తేదీ 29 అక్టోబర్ 2009
నిడివి 155 ని.
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఏక్ నిరంజన్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2009 లో విడుదలైన చిత్రం. ఇందులో ప్రభాస్, కంగనా రనౌత్ ముఖ్యపాత్రలు పోషించారు.

కథ[మార్చు]

వీరయ్య చిన్నకొడుకుని చిన్నపిల్లలను అపహరించి వారిని భిక్షగాళ్ళగా మార్చివేసే ముఠాకి చెందిన చిదంబరం అనే వ్యక్తి అపహరిస్తాడు. ఆ పిల్లవాడికి అతను చోటు అని పేరు పెడతాడు. వీధుల్లో అడుక్కుని అతనికి డబ్బులు తెచ్చివ్వమని చెబుతాడు చిదంబరం. ఒకసారి పోలీసులు చిదంబరం మీద దాడి చేస్తే చోటు పోలీసులకు సహాయం చేస్తాడు. పోలీసులు అతని సహాయానికి మెచ్చి బహుమానం ఇస్తారు. అప్పటి నుంచి చోటు నేరస్థులను పట్టుకోవడానికి పోలీసులకు సహాయం చేస్తూ ఉంటాడు.

చోటు పెద్దయిన తర్వాత కూడా చిదంబరాన్ని తన తల్లిదండ్రులను గురించి అడుగుతూ ఉంటాడు కానీ అతను మాత్రం సమాధానం చెప్పడు. ఒక రౌడీని పట్టుకునే క్రమంలో చోటుకి సమీర అనే గిటార్ టీచర్ తో పరిచయం అవుతుంది. ఆమె అన్న జానూ భాయ్ అనే ముఠానాయకుడి దగ్గర పనిచేస్తుంటాడు.

పోలీసులు ఎన్నో నేరాల్లో ముఖ్య పాత్రధారియైన జానూభాయ్ ని పట్టుకోవడానికి చోటు సహాయం అడుగుతారు. సమీర తన అన్నకి అన్నం పెడుతున్న సమయంలో చోటూ పోలీసుల సాయంతో వచ్చి ఇల్లంతా చిందరవందర చేస్తాడు. సమీరను ప్రేమిస్తున్నట్లు చెబుతాడు. అన్న జైలుకి వెళ్ళడంతో ఆమె కూడా చోటుని ప్రేమిస్తున్నానని చెబుతుంది. వీరయ్య పెద్ద కొడుకు కైలాష్ కూడా జానూ భాయ్ దగ్గరే పనిచేస్తుంటాడు. అతన్ని జానూభాయ్ పథకం వేసి ఒక మంత్రిని చంపిన కేసులో అరెస్టు చేస్తారు పోలీసులు.

జానూ భాయ్ కైలాష్ ని జైలులోనే హతమార్చాలని ప్రయత్నిస్తాడు. కైలాష్ పోలీసుల నుంచి తప్పించుకోగా జానూభాయ్ అతని కోసం వెతుకుతుంటాడు. పోలీసు కమీషనర్ కైలాష్ ను పట్టుకుని ఇస్తే మంచి రివార్డు ఇస్తామని చెబుతాడు. సమీర అన్న జానూ భాయ్ కి భయపడి ఇల్లు ఖాళీ చేసి బ్యాంకాక్ వెళ్ళిపోతాడు. చోటు సమీరను వెతుక్కుంటూ బ్యాంకాక్ వెళ్ళగా అక్కడ అతనికి కైలాష్ కనిపిస్తాడు. నిజానికి మంత్రిని చంపింది తాను కాదనీ మంత్రి సోదరుడనీ, నేరం తన మీద వేసుకున్నానని చెబుతాడు కైలాష్. ఈ లోపు జానూ భాయ్ సమీర, ఆమె అన్నను అపహరించి కైలాష్ ను తనకు అప్పజెప్పమని చెబుతాడు. చోటు సమీరను రక్షించి తన కుటుంబంతో కలుసుకోవడంతో కథ ముగుస్తుంది.

తారాగణం[మార్చు]

విడుదల, ఫలితం[మార్చు]

ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. కానీ విమర్శకుల ప్రశంసలు పెద్దగా రాలేదు.[1]

మూలాలు[మార్చు]

  1. cinejosh (2009). "Ek Niranjan boost and waste for Prabhas". cinejosh. Archived from the original on 13 నవంబరు 2009. Retrieved 9 November 2009.