ప్రకాష్ రాజ్
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
ప్రకాష్ రాజ్ | |
---|---|
![]() | |
జననం | ప్రకాష్ రాయ్ మార్చి 26, 1965 |
వృత్తి | నటుడు, దర్శకుడు, నిర్మాత |
పిల్లలు | ఒకరు |
ప్రకాష్ రాజ్ దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు, దర్శకుడు, నిర్మాత. రంగస్థల నటుడిగా ప్రారంభమై ఆరు భాషల్లో దాదాపు రెండు వందల సినిమాలకు పైగా నటించిన విలక్షణ నటుడు.[1] ఇప్పటిదాకా నాలుగు జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు.[2] నటుడిగా ఆయనకు తొలుత గుర్తింపు తెచ్చిన చిత్రం కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన డ్యుయెట్. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇద్దరు చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నాడు. కాంచీవరం చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాడు. ఐదు సార్లు ఫిల్మ్‌ఫేర్ పురస్కారం, ఆరు సార్లు నంది పురస్కారం, తమిళ నాడు రాష్ట్ర పురస్కారాలు, విజయ అవార్డు మూడు సార్లు అందుకున్నాడు.[3]
బాల్యం[మార్చు]
ప్రకాష్ రాజ్ కర్ణాటకకు చెందిన ఒక మధ్య తరగతి కుటుంబంలో 1965, మార్చి 26 న జన్మించాడు. ఆయన తల్లి క్రిష్టియన్, ఆమె హుబ్లీ లోని ఒక అనాథ శరణాలయంలో పెరిగిన అమ్మాయి. నర్సింగ్ విద్య పూర్తి చేసి బ్రతుకుదెరువు కోసం బెంగుళూరు మహా నగరానికి వచ్చింది. తండ్రిది మంగుళూరు. ఊళ్ళో ఉండి వ్యవసాయం చెయ్యడం ఇష్టం లేక తన యవ్వనంలో బెంగుళూరుకు పారిపోయి వచ్చాడు. ఒకసారి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. అక్కడ నర్సుగా పనిచేస్తున్న ఆమెను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వారికి ప్రకాష్ రాజ్ తోసహా ముగ్గురు పిల్లలు.
కుటుంబం[మార్చు]
ప్రకాష్ రాజ్ లలిత కుమారిని వివాహం చేసుకున్నాడు. ఆమె డిస్కో శాంతి కి సోదరి. తరువాత ఆమెకు విడాకులిచ్చాడు. వారికి ఓ పాప కూడా ఉంది. ప్రస్తుతము బాలీవుడ్ కు చెందిన నాట్యకారిణి పోనీ వర్మ ను ఆగస్టు 2010 లో రెండవ వివాహము చేసుకున్నాడు.[4]
పురస్కారాలు[మార్చు]
జాతీయ పురస్కారాలు[మార్చు]
ఇప్పటిదాకా నాలుగు జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు.
నంది పురస్కారాలు[మార్చు]
- ఉత్తమ ప్రతినాయకుడు - గంగోత్రి, 2003
- ఉత్తమ సహాయనటుడు - దూకుడు, 2011
- ఉత్తమ సహాయ నటుడు - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు)[5]
నటించిన చిత్రాలు[మార్చు]
తెలుగు[మార్చు]
- ఇద్దరు
- హిట్లర్
- చిరునవ్వుతో
- సుస్వాగతం
- చూడాలని ఉంది
- అడవిచుక్క (2000)
- వీడు సామాన్యుడు కాడు
- నువ్వు నాకు నచ్చావ్
- బద్రి
- అంతఃపురం
- ఇంద్ర
- నువ్వే నువ్వే
- ఇడియట్
- అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి
- జూనియర్స్
- ఒక్కడు
- గంగోత్రి
- దిల్
- ఖడ్గం
- ఠాగూర్
- స్టాలిన్
- నిజం
- వర్షం
- భద్ర
- ఆజాద్
- పోకిరి
- అతడు
- బొమ్మరిల్లు
- విక్రమార్కుడు
- ఆకాశమంత
- చిరుత
- వాంటెడ్ (2009)
- ఖలేజా (2010)
- బృందావనం
- కలెక్టర్ గారి భార్య (2010)
- ఆరెంజ్
- దూకుడు (2011)
- బిజినెస్ మాన్ (2012)
- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013)
- ఒంగోలు గిత్త (2013)
- పవర్ (సినిమా) (2014)
- చీకటి రాజ్యం (2015)
- సన్ ఆఫ్ సత్యమూర్తి (2015)
- ఎటాక్ (2016)[6]
- మనఊరి రామాయణం (2016)
- శతమానం భవతి (2017)
- రాజా ది గ్రేట్ (2017)
- ఉంగరాల రాంబాబు (2017)
- జైసింహా (2018)
- రంగస్థలం (2018)
- భరత్ అనే నేను (2018)
- శ్రీనివాస కల్యాణం (2018)
- రూలర్[7] (2019)
- వెంకీ మామ (2019)
తమిళం[మార్చు]
- కాంజీవరం
- సింగం
మూలాలు[మార్చు]
- ↑ ఏప్రిల్ 19, 2009 ఈనాడు ఆదివారం సంచిక ఆధారంగా...
- ↑ http://timesofindia.indiatimes.com/entertainment/bollywood/news-interviews/Im-no-womanizer-Prakash-Raj/articleshow/5045579.cms
- ↑ "'నటనా ప్రకాశం' మన ఈ రేలంగి మావయ్య! - Prakash Raj Birthday special story". www.eenadu.net. Retrieved 2021-03-26.
- ↑ "Prakash Raj and Pony Verma to wed - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-03-26.
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
- ↑ "RGV-Jagapati Babu team up for 'Golusu'". 123telugu.com. Archived from the original on 30 September 2017. Retrieved 10 January 2020.
- ↑ "First look:Powerful Balayya as Ruler!". Tupaki. Retrieved 7 November 2019.
బయటి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Prakash Raj. |
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Prakash Rai పేజీ