భరత్ అనే నేను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భరత్ అనే నేను
Bharat ane nenu logo.jpg
భరత్ అనే నేను లోగో
దర్శకత్వంకొరటాల శివ
నిర్మాతడివివి దానయ్య
రచనకొరటాల శివ
నటులు
సంగీతందేవి శ్రీ ప్రసాద్[2]
ఛాయాగ్రహణం
  • రవి కె. చంద్రన్
  • తిరు
కూర్పుఅక్కినేని శ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ
డివివి ఎంటర్టైన్మెంట్స్
విడుదల
20 ఏప్రిల్ 2018 (2018-04-20)
నిడివి
173 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
ఖర్చుINR65 crore
(US$10 million)[3]
బాక్సాఫీసు<₹232 crores-- not allowed without a cited WP:RS -->

భరత్ అనే నేను 2018లో కొరటాల శివ దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా.[4]మహేష్ బాబు కధానాయకుడుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డివివి దానయ్య నిర్మించగా కైరా అడ్వాణీ కథానాయికగా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించాడు.ఈ చిత్రం ఒక విద్యార్థి గురించి.అతని పేరు భరత్.అనుకోకుండా అతను ఆంధ్రప్రదేశ్ నాయకుడు అవుతాడు .అతను రాజకీయాలను సంస్కరించడానికి ప్రయత్నిస్తాడు.ఈ సినిమా పాలిటిక్స్ ఆక్షన్ మిక్స్ అయినా సినిమా

కథ[మార్చు]

చిన్నతనం లో అతను వైద్య సలహాకి వ్యతిరేకంగా ఐస్ క్రీం తింటాడు.అతని తల్లి అతన్ని తిడుతుంది .అతను ఆమెకు  మళ్ళీ తినను  అని  వాగ్దానం చేస్తాడు.భరత్  మళ్ళీ ఐస్ క్రీమ్ తినడం చుసిన తరువాత , అతని తల్లి వాగ్దానాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది.తరువాతి రోజు, భరత్ తన తల్లి మరణించినట్లు తెలుసుకుంటాడు. .తన తండ్రి తన కుటుంబంతో సమయాన్ని గడపడానికి చాలా బిజీగా ఉంటాడు .అందుకు ఇతను బాధ పడతాడు.భరత్  సవతి తల్లి వద్ద గడప డానికి ఇష్టపడడు .తన స్నేహితుడు సుబాష్ ఇంటిలో గడుపుతాడు.

భరత్‌ రామ్‌(మహేష్‌ బాబు)కు కొత్త విషయాలను నేర్చుకోవటమంటే చాలా ఇష్టం. అందుకే లండన్‌ ఆక్స్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో డిగ్రీలు చేస్తూనే ఉంటాడు. అలాంటి సమయంలో తండ్రి రాఘవ(శరత్‌ కుమార్‌) మరణం అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో నవోదయం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా ఎదిగిన రాఘవ మృతితో పార్టీలో చీలిక రాకుండా ఉండేందుకు రాజకీయ గురువు వరద(ప్రకాశ్‌ రాజ్‌) భరత్‌ను ముఖ్యమంత్రిని చేస్తాడు. అదుపు తప్పిన ప్రజా జీవితాన్ని భరత్‌ తన మొండి నిర్ణయాలతో గాడిన పెట్టే యత్నం చేస్తుంటాడు. భరత్‌ దూకుడు స్వభావం రాజకీయ వ్యవస్థ మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నాయకుడి కుమారుడి కేసులో భరత్‌కు తొలి ఎదురుదెబ్బ తగులుతుంది. ప్రజల నుంచి భరత్‌కు మద్ధతు పెరుగుతున్నా.. సొంత పార్టీ నుంచే ప్రతిఘటన ఎదురవుతుంటుంది. ఈ పోరాటంలో భరత్‌ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు..? వాటన్నింటిని అధిగమించి భరత్‌ తన వాగ్దానాలను ఎలా పూర్తి చేస్తాడు? అన్నదే మిగిలిన కథ.

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

ప్రచార చిత్రం[మార్చు]

'చిన్నప్పుడు మా అమ్మ నాకు ఓ మాట చెప్పింది. ఒకసారి ప్రామిస్‌ చేసి ఆ మాట తప్పితే యు ఆర్‌ నాట్‌ కాల్డ్‌ ఎ మ్యాన్‌ అని. ఎప్పటికీ ఆ మాట తప్పలేదు, మర్చిపోలేదు. నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్‌ చేయాల్సిన రోజు ఒకటి వచ్చింది. పెద్దదే కాదు కష్టమైంది కూడా'.. 'భరత్‌ అనే నేనూ..’ అన్న సంభాషణతో సాగిన చిత్ర ప్రచార చిత్రం మార్చి 6 , 2018 మంగళవారం చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో మహేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తూ కనిపించాడు. ఆయన వేషధారణ మాత్రం ఓ రాజకీయ నాయకుడిలా లేకుండా చాలా స్టైలిష్‌గా ఉంది.

‘కానీ.. ఎంత కష్టమైనా ఆ మాట కూడా తప్పలేదు. బికాజ్‌ ఐ యామ్‌ ఎ మ్యాన్‌ (ఎందుకంటే నేను మనిషిని). విఆర్‌ లివింగ్‌ ఇన్‌ ఎ సొసైటీ (మనం సమాజంలో నివసిస్తున్నాం). ప్రతి ఒక్కళ్లకి భయం, బాధ్యత ఉండాలి.. ప్రామిస్‌’ అంటూ మహేశ్‌ చెప్పే డైలాగ్‌ మొత్తం టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది.[5]

మూలాలు[మార్చు]

  1. Chowdhary, Y Sunita (20 April 2018). "Kiara Advani is confident about 'Bharat Ane Nenu'". The Hindu. Retrieved 23 March 2018.
  2. Jayakrishnan (14 March 2018). "Mahesh Babu and Kiara Advani shooting a romantic number for 'Bharat Ane Nenu'". The Times of India. Retrieved 23 March 2018.
  3. "Bharat Ane Nenu Budget". International Business Times. Cite web requires |website= (help)
  4. "Mahesh Babu to romance Kiara Advani in 'Bharat Ane Nenu'". మూలం నుండి 2018-06-25 న ఆర్కైవు చేసారు. Retrieved 2018-02-15. Cite web requires |website= (help)
  5. http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=new-movies&no=965

బయటి లంకెలు[మార్చు]