కోటి
స్వరూపం
(Crore నుండి దారిమార్పు చెందింది)
ఇతర వాడుకల కొరకు, కోటి (అయోమయ నివృత్తి) చూడండి.
కోటి (Crore) భారతీయ సంఖ్యామానంలో వంద లక్షలతో సమానం. ఇది ఆంగ్ల సంఖ్యామానంలో 10 మిలియన్లౌ సమానం (10,000,000 లేదా శాస్త్రీయ విధానంలో 107). దీనిని హిందూ అరబిక్ సంఖ్యా విధానంలో కామాల నుపయోగించి 1,00,00,000 గా రాస్తారు. ఆంగ్ల సంఖ్యా విధానంలో కామాలనుపయోగించి 10,000,000 అని రాస్తారు.[1]
1 కోటి = 100 లక్షలు
1 కోటి = 10 మిలియన్లు
హిందూ మతంలో
[మార్చు]- ముక్కోటి ఏకాదశి: హిందువుల పండుగ రోజైన ముక్కోటి ఏకాదశి మూడు కోట్ల ఏకాదశి రోజులతో సమానం అని భావిస్తారు.
- కోటి సోమవారము: కోటి సోమవారము అనగా కార్తీక మాసములో శ్రవణ నక్షత్రము ఉన్న రోజును కోటి సోమవారమని అంటారు[2].
- రామకోటి: చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటే 'రామ' అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. 'రామకోటి' రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం[3].
పాటలు
[మార్చు]- కోటి మన్మథాకార [4]
సామెతలు
[మార్చు]- కోటి విద్యలు కూటి కొరకే
- మనసైన చినదాని చూపు కోటి కోర్కెల పిలుపు
- ఏటికి లాగితే కోటికీ - కోటికి లాగితే ఏటికీ అన్నట్లు
- కానిమందం కోటి దు:ఖము
- కాసుకు గతిలేదు కోటికి కొడియెత్తినాడట
మూలాలు
[మార్చు]- ↑ "Knowing our Numbers". Department Of School Education And Literacy. National Repository of Open Educational Resources. Archived from the original on 16 ఫిబ్రవరి 2016. Retrieved 13 February 2016.
- ↑ "కోటి సోమవారము అనగా కార్తీక మాసములో శ్రవణ నక్షత - శంకర - శుభోదయం". mymandir. Retrieved 2020-04-21.[permanent dead link]
- ↑ Sindhu (2016-07-29). "రామకోటి విశిష్టిత? రామకోటి రాయడానికి పాటించాల్సిన నియమాలు". telugu.boldsky.com. Archived from the original on 2017-05-16. Retrieved 2020-04-21.
- ↑ "కోటి మన్మథాకార - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-04-21.