లక్ష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లక్ష (లేదా ల్యాక్‌) సాంప్రదాయ సంఖ్యా మానము లోని ఒక కొలత. భారత దేశము, బంగ్లాదేశ్‌లలో ఇప్పటికీ దీనిని చాలా విరివిగా ఉపయోగిస్తారు. ఒక లక్ష, వంద వేలకు సమానము. వంద లక్షలు కలిపి ఒక కోటి అవును.

భారత దేశము కాక తక్కిన ప్రపంచములో సాధారణముగా ఉపయోగించే పద్ధతికి భిన్నముగా, ఈ సాంప్రదాయ సంఖ్యా మానము ప్రకారము అంకెల మధ్య విభాజకాలు వేరే పద్ధతిలో ప్రవేశపెడతారు. ఉదాహరణకు, 3 మిలియన్లు ఈ విధముగా వ్రాయబడును: 3,000,000. ఇదే విలువగల 30 లక్షలు ఈ విధముగా వ్రాయబడును: 30,00,000. కామాలు పెట్టిన తీరు గమనించండి.

ఇవి కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=లక్ష&oldid=2988279" నుండి వెలికితీశారు