ఆజాద్ (2000 సినిమా)
స్వరూపం
(ఆజాద్ నుండి దారిమార్పు చెందింది)
| ఆజాద్ (2000 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | తిరుపతి స్వామి |
| తారాగణం | నాగార్జున, శిల్పాశెట్టి, సౌందర్య |
| సంగీతం | మణి శర్మ |
| నిర్మాణ సంస్థ | వైజయంతి మూవీస్ |
| భాష | తెలుగు |
ఆజాద్ 2000లో తిరుపతి స్వామి దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. నాగార్జున, సౌందర్య, శిల్పాశెట్టి ఇందులో ప్రధాన పాత్రధారులు. 2000 వ సంవత్సరానికి ద్వితీయ ఉత్తమ చిత్రంగా రజత నంది అవార్డు కు ఎంపికైంది.
కథ
[మార్చు]అంజలి ఒక విలేకరి. మాఫియా డాన్ దేవా చేతిలో తనతో పనిచేసే మరో విలేకరి హత్యకు గురవడం ఆమె చూస్తుంది. ఆమె దేవాపై కేసు వేయాలనుకుంటుంది. కానీ ఆమె దగ్గర పక్కా ఆధారాలు ఉండటంతో దేవా ఆమెను బెదిరిస్తుంటాడు.
నటవర్గం
[మార్చు]- ఆజాద్ గా నాగార్జున
- మహాలక్ష్మిగా శిల్పా శెట్టి[1]
- అంజలిగా సౌందర్య
- దేవాగా రఘువరన్
- ఇన్స్పెక్టర్ సలీంగా ప్రకాశ్ రాజ్
- కావేరిగా సుజిత
- కలైరాణి
- శ్రద్ధా నిగమ్
- కన్నెగంటి బ్రహ్మానందం
- నూతన్ ప్రసాద్
- రఘునాథరెడ్డి
- తనికెళ్ళ భరణి
- అనంత్ బాబు
- వేణు మాధవ్
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- ఎం.ఎస్.నారాయణ
- బెనర్జీ
- ఎల్.బి.శ్రీరామ్
- నర్సింగ్ యాదవ్
- చిట్టిబాబు
- గుండు హనుమంతరావు
- ఇందు ఆనంద్
- రాజశ్రీ రెడ్డి
- లిఖిత కామిని
- ఊర్వశి పాటిల్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు: తిరుపతి స్వామి
- సంగీతం: మణి శర్మ
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, ఓరుగంటి ధర్మతేజ,సుద్దాల అశోక్ తేజ
- నేపథ్యగాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, హరిహరన్, చిత్ర, అభిజీత్, ఉదిత్ నారాయణ్, సుఖ్వీందర్, మహాలక్ష్మి, వసుంధరాదాస్
- నిర్మాత: సి.అశ్వినీదత్
- మాటలు: పరుచూరి బ్రదర్స్
- కథ: తిరుపతి స్వామి
- ఛాయ గ్రహణం: చోటా కె నాయుడు
- కూర్పు:మార్తాండ్ కె వెంకటేష్
- నిర్మాణ సంస్థ: వైజయంతి మూవీస్
- విడుదల:29:09:2000.
పాటలు
[మార్చు]- కల అనుకో కల దనుకో నాలో ప్రేమా... హరి హరన్, మహాలక్ష్మి, రచన: వేటూరి సుందర రామమూర్తి.
- హాయ్ హాయ్ నాయిక , సుక్వీందర్ సింగ్ , చిత్ర , రచన: వేటూరి సుందర రామమూర్తి.
- సుడిగాలిలో తడి వూహలు , హరిహరన్ , చిత్ర, రచన: వేటూరి సుందర రామమూర్తి .
- చెమ్మ చెక్కా , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సుజాత , రచన: సిరివెన్నెల .
- సో సో సోనారే , ఉదిత్ నారాయణ్, వసుందర దాస్ , రచన: చంద్రబోస్ .
- కోయిల కోయిలా కొర కోయిల , అభిజిత్, రచన: సుద్దాల అశోక్ తేజ
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు న్యూస్ 18, సినిమాలు (15 May 2020). "శిల్పాశెట్టి తెలుగులో చేసిన సినిమాలు ఇవే." www.telugu.news18.com. Retrieved 22 June 2020.
{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
