Jump to content

మణిశర్మ

వికీపీడియా నుండి
(మణి శర్మ నుండి దారిమార్పు చెందింది)
మణిశర్మ
జననం
యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ

జూలై 11, 1964
మచిలీపట్నం
వృత్తిసంగీత దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1992–ప్రస్తుతం
పిల్లలుసాగర్ మహతి
తల్లిదండ్రులు

యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ (జూలై 11, 1964) మణిశర్మగా ప్రసిద్ధి పొందిన తెలుగు, తమిళ సినీ సంగీత దర్శకుడు. 200 కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు.[1] సాలూరి రాజేశ్వర రావు దగ్గర్నుంచి వందేమాతరం శ్రీనివాస్ వరకు మేటి సంగీత దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవం ఆయనకుంది.[2]

బాల్యం

[మార్చు]

మణిశర్మ కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో జన్మించాడు. చిన్నప్పుడే ఇంట్లో ఉన్న హార్మోనియం పెట్టెను తెలియకపోయినా వాయించేవాడు. ఆయన తండ్రి యనమండ్ర నాగయజ్ఞ శర్మ వయొలిన్ కళాకారుడు. సినిమాల్లో పనిచేయాలని కోరికతో భార్యతో సహా మద్రాసు చేరుకున్నాడు. కాబట్టి మణిశర్మ పెరిగింది అంతా మద్రాసులోనే. చిన్నప్పుడే అతని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వయొలిన్ తోపాటు మాండొలిన్, గిటార్ కూడా నేర్పించారు. తర్వాత రికార్డింగుల్లో వయొలిన్ గిటార్ కన్నా కీబోర్డ్ వాయించే వాళ్ళకే ఎక్కువ చెల్లిస్తుండటంతో తండ్రి సలహా మేరకు దాన్ని కూడా నేర్చుకున్నాడు.

పాశ్చాత్య సంగీతంలో ఇళయరాజాకు, రెహమాన్ కు ఇంకా చాలామందికి గురువైన జాకబ్ జాన్ దగ్గర మణిశర్మ పాశ్చాత్య సంగీతం నేర్చుకున్నాడు. తరువాత కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నాడు.1982 లో 18 ఏళ్ళ వయసులో చదువు పూర్తిగా ఆపేసి సంగీత రంగంలోకి దిగిపోయాడు.

కెరీర్

[మార్చు]

సంగీత దర్శకుడు చెళ్ళపిళ్ళ సత్యం దగ్గర కీబోర్డ్ ప్లేయర్ గా సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఇళయరాజా, ఎం.ఎం.కీరవాణి, రాజ్-కోటిల దగ్గర శిష్యరికం చేసారు. ఎ. ఆర్. రహ్మాన్ తో కలిసి కీబోర్డు సహాయకుడిగా పనిచేశాడు. అప్పట్లో దక్షిణాది సినిమాలన్నింటి రికార్డింగులకీ అప్పట్లో మద్రాసే కేంద్రం. కాబట్టే అన్ని భాషల సినిమాలకీ ఎందరో మహానుభావులైన సంగీతదర్శకుల దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది. కీరవాణి మొదటి సినిమా నుంచి ఆయన ప్రతి సినిమాకీ పనిచేశాడు.

క్షణక్షణం సినిమాకి కీరవాణిగారి దగ్గర పనిచేస్తున్నప్పుడు రాంగోపాల్‌వర్మ అప్పుడప్పుడూ వచ్చి కూర్చుని ఆసక్తిగా గమనించేవాడు. అలా ఆయనకు మొట్టమొదటిసారి రీరికార్డింగ్‌ చేసే అవకాశాన్నిచ్చింది రామ్‌గోపాల్‌వర్మ. అది రాత్‌ (తెలుగులో రాత్రి) అనే హర్రర్‌ సినిమా. తర్వాత అంతం సినిమాలో ఒక పాట చెయ్యమంటూ మళ్లీ రామూ దగ్గర్నుంచి పిలుపొచ్చింది. చలెక్కి ఉందనుకో, ఈ చలాకి రాచిలకో అనే పాట అది. ఆయన స్వరపరిచిన చేసిన మొట్టమొదటి పాట.

ఈ తరం సంగీత దర్శకుల్లోని దేవి శ్రీ ప్రసాద్ కు కీ-బోర్డ్ గురువీయన. ఏ.వి.యస్. తొలిసారి దర్శకత్వం వహించిన "సూపర్ హీరోస్" చిత్రంతో సంగీత దర్శకునిగా కెరీర్ ప్రారంభించి ఇప్పటి వరకు 200 చిత్రాలకి పైగా సంగీతాన్నందించారు. సంగీత దర్శకుడుగా ఆయన కొచ్చిన తొలి అవకాశం చిరంజీవి సినిమానే అయినా విడుదలయింది మాత్రం సూపర్‌ హీరోస్‌.

బావగారూ బాగున్నారా పాటలు సూపర్‌హిట్‌ కావడంతో ఇండస్ట్రీలో మంచి పేరొచ్చింది. జయంత్‌, గుణశేఖర్ లాంటి మంచి అభిరుచి ఉన్న దర్శకుల సినిమాలకు పనిచేసే అవకాశాలు వరసగా వచ్చాయి. దానికితోడు సమరసింహారెడ్డి, గణేష్‌, రావోయి చందమామ, చూడాలని ఉంది ఇలా వెంటవెంటనే పెద్దహీరోల సినిమాలకు సంగీత దర్శకత్వం వహించే అవకాశం రావడం, అన్నీ మ్యూజికల్‌హిట్లు కావడంతో ఆయన దశ తిరిగింది.

ఇతని సంగీతం చాలా వరకు ఫాస్ట్ బీట్ తో, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేదిగా ఉంటుంది. కానీ ఆయన ప్రతీ సినిమాలో కనీసం ఒక్కటైనా మెలోడీ ఉంటుంది.

ఈయన చేసిన మెలొడీలలో చాలా మంచి పాటలున్నాయి. అందుకే అతనిని మెలోడీ బ్రహ్మ అని కూడా పిలుస్తారు. మనసిచ్చి చూడు చిత్ర నిర్మాణ సమయంలో ఆ చిత్ర నిర్మాత ఎడిటర్ మోహన్ ఇచ్చిన బిరుదది. పరిశ్రమలోని దాదాపు ప్రతీ నాయకుడికి సంగీతాన్ని అందించాడు. ఇతనిని అగ్రతారల సంగీత దర్శకుడని కూడా అంటారు. ఇతర చిత్రాలకు కూడా తన నేపథ్య సంగీతాన్ని అందించి వాటికి ప్రాణం పోశాడు.

మణిశర్మ సంగీతం వహించిన కొన్ని చిత్రాలు

[మార్చు]
సంవత్సరం చిత్రం దర్శకుడు అదనం
1997 సూపర్ హీరోస్ ఏ.వీ.ఎస్
1998 చూడాలని ఉంది గుణశేఖర్
1998 గణేష్ తిరుపతిసామి
1998 బావగారూ బాగున్నారా? జయంత్.సి.పరాన్జీ
1998 మనసిచ్చి చూడు రుద్రరాజు సురేష్ వర్మ
1999 అనగనగా ఒక అమ్మాయి రమేష్ సారంగ
1999 ఇద్దరు మిత్రులు కె. రాఘవేంద్రరావు
1999 సమరసింహా రెడ్డి బీ.గోపాల్
1999 రాజకుమారుడు కె. రాఘవేంద్రరావు
1999 రావోయి చందమామ జయంత్.సి.పరాన్జీ
1999 శీను శశి
2000 అన్నయ్య ముత్యాల సుబ్బయ్య
2000 ఆజాద్ తిరుపతిసామి
2000 కౌరవుడు వీ.జ్యోతి కుమార్
2000 చిరునవ్వుతో జీ.రామ్ ప్రసాద్
2000 వంశీ బీ.గోపాల్
2000 మనోహరం గుణశేఖర్
2001 దేవి పుత్రుడు కోడి రామకృష్ణ
2001 ఖుషీ ఎస్.జే.సూర్య
2001 మురారి కృష్ణ వంశీ
2001 ప్రేమతో రా ఉదయ శంకర్
2001 సుబ్బు రుద్రరాజు సురేష్ వర్మ
2001 రూపాయి భారతి శ్రీనివాస్
2001 భలేవాడివి బాసు పీ.ఏ.అరుణ్ ప్రసాద్
2001 నరసింహ నాయుడు బీ.గోపాల్
2002 ఇంద్ర బీ.గోపాల్
2002 ఆది వీ.వీ.వినాయక్
2002 చెన్న కేశవ రెడ్డి వీ.వీ.వినాయక్
2002 బాబీ శోభన్
2002 టక్కరి దొంగ జయంత్.సి.పరాన్జీ
2002 రాయలసీమ రామన్న చౌదరి సురేష్ కృష్ణ
2002 మృగరాజు గుణశేఖర్
2003 ఠాగూర్ వీ.వీ.వినాయక్
2003 అంజి కోడి రామకృష్ణ
2003 సీమ సింహం జీ.రామ్ ప్రసాద్
2003 పల్నాటి బ్రహ్మనాయుడు బీ.గోపాల్
2003 కళ్యాణ రాముడు జీ.రామ్ ప్రసాద్
2003 రాఘవేంద్ర సురేష్ కృష్ణ
2003 ఒక్కడు గుణశేఖర్
2004 గుడుంబా శంకర్ వీరశంకర్
2004 లక్ష్మీనరసింహా జయంత్.సి.పరాన్జీ
2004 శ్రీ ఆంజనేయం కృష్ణ వంశీ
2004 అడవి రాముడు బీ.గోపాల్
2004 సాంబ వీ.వీ.వినాయక్
2004 సఖియా జయంత్.సి.పరాన్జీ
2004 విధ్యార్ధి బాలాచారి
2004 యజ్ఞం ఏ.ఎస్.రవి కుమార్ చౌదరి
2005 బాలు ఏ.కరుణాకరన్
2005 అతడు త్రివిక్రమ్ శ్రీనివాస్
2005 జై చిరంజీవ కే. విజయభాస్కర్
2005 నరసింహుడు బీ.గొపాల్
2005 సుభాష్ చంద్రబోస్ కె. రాఘవేంద్రరావు
2005 అర్జున్ గుణశేఖర్
2005 రాధా గోపాళం బాపు రమణ
2005 అల్లరి పిడుగు జయంత్.సి.పరాన్జీ
2005 అతనొక్కడే సురేందర్ రెడ్డి
2006 పోకిరి పూరి జగన్నాధ్
2006 రాగం కే.ఎస్.ప్రకాష్ రావు
2006 స్టైల్ రాఘవ లారెన్స్
2006 అశోక్ సురేందర్ రెడ్డి
2006 వీరభద్ర ఏ.ఎస్.రవి కుమార్ చౌదరి
2006 స్టాలిన్ ఏ.అర్.మురుగదాస్
2006 రారాజు జి. రామ్మోహన్ రావు
2006 రూమేట్స్ ఏ.వీ.ఎస్
2006 మార్నింగ్ రాగ కే.ఎస్.ప్రకాష్ రావు
2007 చిరుత పూరి జగన్నాధ్
2007 అతిథి సురేందర్ రెడ్డి
2007 లక్ష్యం శ్రీవాస్
2007 గొడవ ఏ.కోదండరామిరెడ్డి
2008 పౌరుడు తంపి రాజకుమార్
2008 ఒంటరి బీ.వీ.రమణ
2008 పరుగు భాస్కర్
2008 కంత్రి మెహెర్ రమేష్
2008 హీరో జీ.వీ.సుధాకర్ నాయుడు
2008 శౌర్యం శివ
2009 ఏక్ నిరంజన్ పూరి జగన్నాధ్
2009 రెచ్చిపో పరచూరి మురళి
2009 బాణం దంతులూరి చైతన్య
2009 ఎవరైనా ఎపుడైనా మార్తాండ్.కే.శంకర్
2009 శశిరేఖా పరిణయం కృష్ణవంశీ
2009 ఆ ఒక్కడు[3][4] నిడదవోలు శ్రీనివాస మూర్తి
2009 బిల్లా మెహెర్ రమేష్
2009 పిస్తా సభా అయ్యప్పన్
2009 మిత్రుడు మహాదేవ
2010 కత్తి ఎం.మల్లిఖార్జున్
2010 వరుడు గుణశేఖర్
2010 ఖలేజా త్రివిక్రమ్ శ్రీనివాస్
2010 డాన్ శీను మలినేని గోపీచంద్
2010 హాపీహాపీగా ప్రియ శరన్
2010 శుభప్రధం కే.విశ్వనాధ్
2010 ఏం పిల్ల ఏం పిల్లడో ఏ.ఎస్.రవి కుమార్ చౌదరి
2010 కోతిమూక ఏ.వీ.ఎస్
2011 వస్తాడు నా రాజు హేమంత్ మధుకర్
2011 మారో సిద్దిక్
2011 తీన్ మార్ జయంత్.సి.పరాన్జీ
2011 శక్తి మెహెర్ రమేష్
2011 పరమవీరచక్ర దాసరి నారాయణ రావు
2014 బసంతి చైతన్య దంతులూరి
2014 రఫ్ సి. హెచ్. సుబ్బారెడ్డి
2015 లయన్ సత్యదేవ్
2015 రణం 2 అమ్మ రాజశేఖర్
2015 టిప్పు జగధీష్ దనేటి 
2016 జెంటిల్ మేన్ ఇంద్రగంటి మొహన్ క్రిష్ణ
2016 సిద్ధార్ధ కె. వి. దయానంద రెడ్డి
2017 ఆకతాయి రోమ్ భిమన
2017 ఆరడుగుల బుల్లెట్ బి. గోపాల్
2017 అమీ తుమీ   మొహన్ క్రిష్ణ ఇంద్రగంటి
2017 బాలక్రిష్ణుడు    పవన్ మల్లెల
2017 ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్ వంశీ
2017 జయదేవ్ జయంత్.సి.పరాన్జీ
2017 లై అను రాఘవపూడి 
2017 ఒక్క క్షణం ఆనంద్
2017 శమంతక మణి శ్రీరామ్ ఆదిత్య
2018 దేవదాస్[5] శ్రీరామ్ ఆదిత్య
2018 ఈ మాయ పేరేమిటో రాము కొప్పుల
2018 ఎమ్ ఎల్ ఎ ఉపేంద్ర మాధవ్
2019 ఇస్మార్ట్ శంకర్[6] పూరీ జగన్నాథ్
2022 యశోద హరి శంకర్ - హరీష్ నారాయణ్
2022 నేను మీకు బాగా కావాల్సిన వాడిని శ్రీధర్‌ గాదె
2023 రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం జైదీప్ విష్ణు
2023 బెదురులంక 2012 క్లాక్స్
2023 శాకుంతలం గుణశేఖర్
2023 మధురపూడి గ్రామం అనే నేను మల్లి
2023 మిస్టర్ కింగ్

మణిశర్మ తమిళ చిత్రాలు

[మార్చు]
  • వెఱ్ఱి నెల్వన్
  • రగళై
  • ఉయర్తిరు 420
  • నిఙం పులి
  • నుఱా
  • మాప్పిళ్ళై
  • మలై మలై
  • పడిక్కాదవన్
  • పోక్కిరి
  • తిరుప్పాచ్చి
  • అరను
  • యూత్
  • యేళుమలై

అవార్డులు

[మార్చు]

నంది పురస్కారం

[మార్చు]
  1. ఉత్తమ సంగీత దర్శకుడు - ఒక్కడు, (2003)
  2. ఉత్తమ సంగీత దర్శకుడు - చూడాలని వుంది (1998)

ఫిలింఫేర్ పురస్కారం

[మార్చు]
  1. ఉత్తమ సంగీత దర్శకుడు - ఒక్కడు, (2003)
  2. ఉత్తమ సంగీత దర్శకుడు - చిరునవ్వుతో (2000)
  3. ఉత్తమ సంగీత దర్శకుడు - చూడాలని వుంది (1998)

మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ సౌత్

[మార్చు]
  1. ఉత్తమ సంగీత దర్శకుడు - ఖలేజా (2010)
  2. సాంగ్ అఫ్ ది ఇయర్ - సదా శివ - ఖలేజా (2010)
  3. ఉత్తమ సంగీత దర్శకుడు - ఏక్ నిరంజన్ (2009)

మూలాలు

[మార్చు]
  1. మహమ్మద్, అన్వర్. "బంగారం తాకట్టు పెట్టి స్టూడియో కట్టాను". eenadu.net. ఈనాడు. Archived from the original on 17 October 2018.
  2. Andhra Jyothy (11 July 2023). "తెలుగు సినిమా ఇండస్ట్రీకి 'మణి'హారం". Archived from the original on 11 July 2023. Retrieved 11 July 2023.
  3. Idlebrain, Movie Review (5 June 2009). "Aa Okkadu review". www.idlebrain.com. Archived from the original on 12 December 2019. Retrieved 29 May 2020.
  4. Great Andhra, Movie Review (5 June 2009). "'Aa Okkadu' Review: Not Upto Expectations". greatandhra.com (in ఇంగ్లీష్). Venkat Arikatla. Retrieved 29 May 2020.[permanent dead link]
  5. సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్‌' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 మార్చి 2020. Retrieved 2 April 2020.
  6. సాక్షి, సినిమా (18 July 2019). "'ఇస్మార్ట్‌ శంకర్‌' మూవీ రివ్యూ". Archived from the original on 18 July 2019. Retrieved 21 July 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=మణిశర్మ&oldid=4339046" నుండి వెలికితీశారు