యజ్ఞం (2004 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యజ్ఞం
దర్శకత్వంఎ. ఎస్. రవి కుమార్ చౌదరి
రచనమరుధూరి రాజా (సంభాషణలు)
స్క్రీన్ ప్లేరవి కుమార్ చౌదరి
కథఈతరం ఫిలింస్ విభాగం
నిర్మాతపోకూరి బాబూరావు
తారాగణంగోపీచంద్
సమీరా బెనర్జీ
ఛాయాగ్రహణంసీహెచ్ రమణ రాజు
కూర్పుగౌతం రాజు
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
ఈతరం ఫిలింస్
విడుదల తేదీ
2 జూలై 2004 (2004-07-02)[1]
సినిమా నిడివి
145 నిమిషాలు
దేశంభారత్
భాషతెలుగు

యజ్ఞం 2004 లో రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఈతరం ఫిలింస్ బ్యానరుపై పోకూరి బాబురావు నిర్మించగా, గోపిచంద్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ సినిమా. ఫ్యాక్షనిజం నేపథ్యంలో కథ నడుస్తుంది.

శీను (గోపీచంద్) ఫ్యాక్షన్ లీడరైన రెడ్డెప్ప (దేవరాజ్) కి కుడిభుజం లాంటి వాడు. శీను, రెడ్డెప్ప కూతురు శైలజ (సమీరా బెనర్జీ) ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. రెడ్డెప్పకూ నాయుడమ్మకూ (విజయ రంగరాజు) మధ్య బద్ధవిరోధం ఉంటుంది. వీరిద్దరి మధ్య గొడవల వల్ల చాలా మంది మరణించి ఉంటారు. వారి కుటుంబాలు వీధిన పడి ఉంటాయి. శైలజ, శీను ఒకర్నొకరు ప్రేమించుకుంటారు. శీను తక్కువ జాతివాడని రెడ్డెప్ప అందుకు అంగీకరించడు. మిగతా కథంతా శీను తమ ప్రేమకు అడ్డుపడే వారిని అడ్డుతొలగించి జనాలలో చైతన్యం కలిగించడం చుట్టూ తిరుగుతుంది.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకత్వం వహించగా సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ పాటలు రాశారు.

[2] చమక్కు చమక్కుమని , రచన; సుద్దాల అశోక్ తేజ, గానం. సందీప్, మల్లికార్జున్

2: ఏం చేశావో నా మనసు, రచన: సుద్దాల అశోక్ తేజ, గానం. శ్రీ పండితారాధ్య చరణ్, శ్రేయా ఘోషల్

3: చిన్ననాటి చెలికాడు, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , శ్రేయా ఘోషల్

4: హాయిగా అమ్మవోల్లో , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గోపికా పూర్ణిమ , శ్రీ వర్దిని

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (2 July 2021). "గోపీచంద్‌ను హీరోగా నిలబెట్టిన యజ్ఞం సినిమాకు 17 ఏళ్లు". Namasthe Telangana. Archived from the original on 2 జూలై 2021. Retrieved 2 July 2021.
  2. "Telugu cinema Review - Yagnam - Gopichand, Sameera Benarjee - Pokuri Babu Rao". www.idlebrain.com. Retrieved 2020-12-11.