విజయ రంగరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయ రంగరాజు
జననం
వి. రాజ్ కుమార్[1]

విద్యబి. ఎ
పిల్లలుదీక్షిత, పద్మిని
తల్లిదండ్రులు
  • జానకిరామయ్య (తండ్రి)
  • జగదీశ్వరి (తల్లి)

విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ తెలుగు సినీ నటుడు. ఎక్కువగా ప్రతినాయక, సహాయ పాత్రలు పోషించాడు. కొన్ని తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటించాడు. స్వతహాగా క్రీడాకారుడు, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ లో కూడా ప్రవేశం ఉంది. 1994 లో వచ్చిన భైరవ ద్వీపం చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యాడు. యజ్ఞం సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.[2] ఈ చిత్రంలో హీరోగా గోపీచంద్ నటించగా విలన్ పాత్రలో విజయ రంగరాజు నటించాడు. అతని అసలు పేరు అసలు పేరు విజయ రంగరాజు కాదని ఉదయ్ రాజ్ కుమార్  అని, అప్పటికే సినీ పరిశ్రమలో తన అసలు పేరుతో వేరే నటులు ఉండడంతో సినీ పరిశ్రమే తనకు ఈ విజయ రంగరాజు అని పేరు పెట్టిందని అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.[3] సినిమా ఇండస్ట్రీలో ఎంత టాలెంట్ ఉన్నా కులం ప్రధానం అని, కులం లేనిదే ఇక్కడ అవకాశాలు ఉండవని, ప్రస్తుతం కాపు యుగం నడుస్తోందని రంగరాజు చెప్పాడు.[4]

జీవిత విశేషాలు

[మార్చు]
విజయ రంగరాజు

విజయ రంగరాజు అసలు పేరు రాజ్ కుమార్. అతను మద్రాసులో రంగస్థల కళాకారునిగా అనేక నాటకాలలో నటించాడు. వియత్నాం కాలనీ అనే మలయాళ సినిమాతో సినిమా రంగంలో అరంగేట్రం చేసాడు. ఆ సినిమాలో ప్రధాన ప్రతినాయకుని పాత్ర పోషించాడు. ఆ సినిమాలో కథానాయకుడు మోహన్ లాల్. ఆ సినిమా 150 రోజులు ఆడడంతో అతని నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సమయంలో తెలుగులో భైరవ ద్వీపం చిత్రంలో అతనికి ప్రతినాయకునిగా అవకాశం వచ్చింది. ఆ సినిమాలో అతని పేరు మార్చారు. విజయా బ్యానర్ పై నూతన ప్రతినాయకుని పాత్రను పరిచయం చేస్తున్నందున "విజయ", పాతాళ భైరవిలో ఎస్. వి. రంగారావు పాత్రను పోలిన పాత్ర పోషిస్తున్నందున "రంగ", అతని అసలు పేరు రాజ్‌కుమార్ కనుక "రాజు" లను కలిపి "విజయ రంగరాజు" గా పేరు పెట్టారు. ఆ సినిమాలో నటనతో మంచి గుర్తింపు పొందాడు. సినిమా కూడా విజయవంతం అయింది. దాని తరువాత అతనిని ఒకటిన్నర సంవత్సరాలుగా ఏ వేషాలు రాలేదు. తరువాత ఇ.వి.వి.సత్యనారాయణ తీసిన మగరాయుడు సినిమాలో జిన్నా పాత్రకు అవకాశం ఇచ్చాడు. తరువాత కొంతకాలం తెలుగు సినిమాలలో నటించి లండన్ వెళ్ళి అక్కడ ఐదు సంవత్సరాలు ఉన్నాడు. తిరిగి వచ్చిన తరువాత కొంతకాలం అవకాశాలు రాలేదు. తరువాత ఉరి సినిమాలో ప్రతినాయకునిగా నటించాడు. తరువాత అతనికి యజ్ఞం సినిమాలో ప్రతినాయకునిగా అవకాశం వచ్చింది.

కెరీర్

[మార్చు]

బాపు దర్శకత్వంలో వచ్చిన సీతా కల్యాణం రంగరాజుకు నటుడిగా మొదటి సినిమా.

సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "విజయ రంగరాజు". maastars.com. Movie Artists Association. Retrieved 12 April 2018.
  2. "Rajinikanth: నాకు మద్యం అలవాటు చేసింది రజినీకాంతే.. తాగకపోతే ఇండస్ట్రీలో ఉండవన్నారు". Samayam Telugu. Retrieved 2020-07-14.
  3. Shekar, Raja (2020-01-25). "ఆ హీరో నన్ను కావాలనే తొక్కేశాడంటున్న విలన్…". TeluguStop.com. Retrieved 14 July 2020.
  4. "ఇండస్ట్రీలో కులం పిచ్చా. మీరు చౌదరీసా.. ప్రస్తుతం కాపు యుగం.!". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 14 July 2020.

బాహ్య లంకెలు

[మార్చు]