మేడమ్ (సినిమా)
| మేడమ్ | |
|---|---|
| దర్శకత్వం | సింగీతం శ్రీనివాసరావు |
| రచన | సింగీతం శ్రీనివాసరావు (కథ, స్క్రీన్ ప్లే), ఎం. వి. ఎస్. ఎస్. బాబూ రావు (మాటలు) |
| నిర్మాత | ఎం. చిట్టిబాబు, జి. జ్ఞానం హరీష్, రాజేంద్ర ప్రసాద్ (సమర్పణ) |
| తారాగణం | రాజేంద్ర ప్రసాద్, సౌందర్య |
| ఛాయాగ్రహణం | వి. సురేష్ |
| కూర్పు | త్రినాథ్ |
| సంగీతం | మాధవపెద్ది సురేష్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1994 సెప్టెంబరు 19 |
| భాష | తెలుగు |
మేడమ్ 1994 లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో రాజేంద్రప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రలు పోషించారు. రాజేంద్రప్రసాద్ ఇందులో ప్రయోగాత్మకంగా ఓ మహిళ పాత్రలో నటించాడు. ఈ పాత్రకు గాను రాజేంద్రప్రసాద్ 1994 లో నంది ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకున్నాడు.[2]
కథ
[మార్చు]ప్రసాద్ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్. అతని స్నేహితుడు బాబీ. బాబీ కల్పన అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆమె ప్రసాద్ ని ప్రేమిస్తుంది. కానీ ఈ విషయం వీరిద్దరికీ తెలియక కల్పన సోదరుడైన మేజర్ చంద్రకాంత్ దగ్గరకు పెళ్ళి ప్రస్తావన తెస్తారు. బాబీ తన నాన్నమ్మ శారదాదేవికి ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను చూడటానికి వెళతాడు. ఆమె తాను చనిపోయేలోపు మనవడు పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిని చూడాలని చెబుతుంది. వెంటనే ప్రసాద్ కల్పనను తీసుకురావడానికి వెళ్ళి ఆమె తనని ప్రేమిస్తుందనే నిజాన్ని తెలుసుకుంటాడు. కానీ చండశాసనుడైన ఆమె అన్నకు భయపడి తనను ప్రేమిస్తున్నదీ, పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నదీ బాబీ అని చెప్పడు. శారదాదేవి కోసం బాబీని పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిగా సరోజిని అనే మారువేషంలో వెళతాడు ప్రసాద్. కానీ విచిత్రంగా సరోజినిని చూడగానే ఆమె ఆరోగ్యం మెరుగవుతుంది. శారదాదేవి ఆమెను తన పక్కనే ఉంచుకోవాలనుకుంటుంది. సరోజినిని తనకు తెలిసిన కళాశాలలో లెక్చరర్ గా నియమిస్తుంది. ప్రసాద్ అక్కడ సౌందర్య అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. అందుకోసం ప్రసాద్ రెండు పాత్రలు పోషిస్తూ సౌందర్య కూడా తనను ప్రేమించుకునేలా చేసుకుంటాడు.
కొన్ని సంఘటనల తర్వాత సరోజిని ఒక సామాజిక కార్యకర్తగా మారవలిసి వస్తుంది. ఆమె మేడం అనే పేరుతో అందరికీ చిరపరిచితం అవుతుంది. ఒకసారి కల్పన నుంచి తప్పించుకోవడానికి మందాకిని అనే ఆధునిక యువతి వేషంలో ఉండగా వృద్ధ ఫోటోగ్రాఫర్ ఆమెను చూసి ప్రేమలో పడతాడు.
తారాగణం
[మార్చు]- రాజేంద్ర ప్రసాద్_ మేడమ్ సరోజిని/ మందాకిని
- సౌందర్య_ సౌందర్య
- శుభలేఖ సుధాకర్_ బాబీ
- షావుకారు జానకి_ శారదాదేవి
- నగేష్_ రాయుడు
- నారమల్లి శివప్రసాద్_ రాయుడు పి. ఎ.
- పుణ్యమూర్తుల చిట్టిబాబు
- కళ్ళు చిదంబరం
- గుండు సుదర్శన్_ సరోజిని బాడీ గార్డ్
- అత్తిలి లక్ష్మి
- ఏ.వి.ఎస్ _ జర్నలిస్ట్
- రావికొండలరావు _ సౌందర్య తండ్రి
- రాధాకుమారి_ సౌందర్య తల్లి
- సాక్షి రంగారావు
- విజయ రంగరాజు_ మేజర్ చంద్రకాంత్
- వినోద్_ వేడుకల వెంకట్రావు
- కె.కె.శర్మ
- లతాశ్రీ_ కల్పన
- శైలజ_ సౌందర్య చెల్లెలు
- కల్పనా రాయ్
- చిరంజీవి_ నిజజీవిత పాత్ర
- విజయశాంతి_ నిజజీవిత పాత్ర.
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: సింగీతం శ్రీనివాసరావు
- కథ, చిత్రానువాదం: సింగీతం శ్రీనివాసరావు
- సంగీతం: మాధవపెద్ది సురేష్
- సంభాషణలు: యం.వి.ఎస్.బాబూరావు
- పాటల రచయితలు: వేటూరి సుందరరామమూర్తి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, భువనచంద్ర
- నేపథ్య గాయకులు: రాజేంద్ర ప్రసాద్, మనో, రేణుక, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
- ఛాయ గ్రహణం: వి.సురేష్
- కూర్పు: త్రినాథ్
- సమర్పణ: రాజేంద్ర ప్రసాద్
- నిర్మాతలు: యం.చిట్టిబాబు_ జి.జ్ఞానం హరీష్
- నిర్మాణ సంస్థ: విజయ చాముండేశ్వరి ఫిలింస్
- విడుదల:19:10:1994.
పాటల జాబితా
[మార్చు]- మై డియర్ మేడమ్ , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం. రాజేంద్ర ప్రసాద్, కె ఎస్ చిత్ర
- మహిళా ఇక నిదురించే , రచన: భువనచంద్ర , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- వచ్చే వచ్చే వైశాఖం లో, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- నావల్ల కాదు, రచన: భువనచంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, మనో
- సింగుదమ సింగుడమ, రచన: భువనచంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రేణుక.
మూలాలు
[మార్చు]- ↑ "Madam (1994)". gomolo.com. Archived from the original on 24 June 2016. Retrieved 23 October 2016.
- ↑ "King of Comedy Heroes". cineoutlook.com. Archived from the original on 27 October 2016. Retrieved 23 October 2016.