రాజ్ - కోటి

వికీపీడియా నుండి
(రాజ్-కోటి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

రాజ్ - కోటి తెలుగు సినిమాలో ఒక జంట సంగీత దర్శకులు.

వీరిద్దరూ కలిసి అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ప్రళయ గర్జన వీరిద్దరూ కలిసి పనిచేసిన మొదటి చిత్రం. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్న-తమ్ముడు లాంటి విజయవంతమైన చిత్రాలకు వీరే సంగీతాన్ని సమకూర్చారు. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. విడిపోయిన తర్వాత రాజ్ ఎక్కువ చిత్రాలు చేయలేదు. రాజ్ ఒక్కడే చేసిన సినిమాల్లో "సిసింద్రీ" ఒక్కటే చెప్పుకోదగినది. కాకపోతే ఈ మధ్యకాలంలో కొన్ని టీవి షో (ఈటీవీ) లకు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. కోటి మాత్రం ఇంకా చిత్రాలు చేస్తూనే ఉన్నారు. కోటి ఒంటరిగా పనిచేసి పెద్ద హీరోలతో హిట్లు ఇచ్చాడు. చిరంజీవితో హిట్లర్, బాలకృష్ణతో పెద్దన్నయ్య, వెంకటేశ్ తో నువ్వు నాకు నచ్చావ్ మొదలైనవి. 1975లో గిటారిస్టుగా సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద 8 ఏళ్లు పనిచేశారు. లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌, ఆర్డీబర్మన్‌, బప్పీలహరి, జంధ్యాల వద్ద పనిచేసి అనుభవాన్ని ప్రోది చేసుకున్నారు. అన్ని భాషల్లో కలిపి 455 చిత్రాలకు పనిచేశారు. 24 చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించారు. సుభాష్‌ఘాయ్‌, డేవిడ్‌ ధావన్‌ వంటి దర్శక, నిర్మాతలతో కలసి పనిచేశారు. ముఖుల్‌ ఆనంద్‌ డైరెక్టరుగా త్రిమూర్తి అనే సినిమాకు సంగీత బ్రహ్మ రెహ్మాన్‌తో కలసి సంగీత స్వరాలు పలికించారు .

68 ఏళ్ల రాజ్ (తోటకూర సోమరాజు) గుండెపోటుతో హైదరాబాద్ లోని తన నివాసంలో 2023 మే 21న తుదిశ్వాస విడిచాడు.[1]

భావాలు

[మార్చు]
  • నా తండ్రి తరంలో ఆపాత మధురాలే వేరు. ఒక్క పాటను రాయాలన్నా, సంగీతాన్ని సమకూర్చాలన్నా చాలారోజులు పట్టేది. మాకు దర్శకులు స్వేచ్ఛ ఇస్తే అద్భుతమైన రాగాలు సమకూర్చుతాం. 'నువ్వేకావాలి'లో క్త్లెమాక్స్‌ సాంగ్‌ కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవెందుకు గుండెల్లో గూడుకట్టి.. సాంగ్‌ అలా చేసిందే.. నేటి పరిస్థితి దీనికి భిన్నం. కమర్షియల్‌ విలువలే ముఖ్యం. మళ్లీ పాత సంగీతానికి ప్రాణం పోసే రోజులు వస్తాయి.
  • నేపథ్య సంగీతం అనేది సినిమాకు ఆయువుపట్టు. కథలో డొల్లతనం ఉన్నచోట్ల ఇది ప్రాణం పోస్తుంది. సంచలనం సృష్టించిన 'అరుంధతి'కి ప్రాణం నేపథ్య సంగీతమే.
  • నేటి సంగీత ప్రపంచం సాహిత్యం విలువలను కోల్పోతోంది. అవసరాని కనుగుణంగా సాహిత్యాన్ని రంగరించి, సంగీతాన్ని మేళవించే చేసే పాట ప్రజలను హత్తుకుంటుంది. సంగీత దర్శకునికి చిత్ర దర్శకుడు అవసరమైన బాణీలను చెప్పి చేయించుకోవాలి. అర్థంకాని బాణీ, క్రమంలేని సంగీతం, డప్పు వాయిద్యాలతో హృదయంపై ఒత్తిడి తీసుకొచ్చేసంగీతమే నేడు రాజ్యం ఏలుతోంది. అప్పట్లో కొసరాజు, దాశరథి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, రోజులు తరబడి ఒకలైను కోసం కసరత్తు చేసేవారు.ఆత్రేయ గారి చిటపట చినుకులు పడుతూ ఉంటే..ఎంత మధురం.

అవార్డులు

[మార్చు]

1994లో హలో బ్రదర్ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకులుగా నంది అవార్డు

సినిమాలు

[మార్చు]
ఆడది

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "సంగీత దర్శకుడు రాజ్‌ కన్నుమూత |". web.archive.org. 2023-05-21. Archived from the original on 2023-05-21. Retrieved 2023-05-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Bharat Movies, Movie Pages. "Aadadhi. Aadadhi Movie Cast & Crew". www.bharatmovies.com. Retrieved 11 August 2020.[permanent dead link]