సిసింద్రీ
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఇదేపేరుతో కల మరొక వ్యాసం నాగార్జున అక్కినేని కొడుకు అఖిల్ నటించిన - సిసింద్రీ (సినిమా) చూడండి.
సిసింద్రీ ఒక రకమైన దీపావళిలో కాల్చే మతాబు. ఇవి చిన్నగా ఉండి, వెలిగించిన వెంటనే చురుగ్గా గమ్యం లేకుండా తిరుగుతాయి. పిల్లలు ఎక్కువగా వీటిని కాల్చడానికి ఇష్టపడతారు.
సిసింద్రీ తయారీ
[మార్చు]పేపర్ తీసుకొని చిన్న నలు చదరపు ముక్కలుగా చేసుకొని వాటిని జిగురుతో ఒక వైపు మూసివేస్తూ అంటించుకొనిపోతారు. అలా తయారైన దానిని ఎదబెట్టి తరువాత సిద్దం చేసుకొన్న సిసింద్రీ మందు అందులో కొద్దికొద్దిగా పోస్తూ దట్టంగా ఉండేటందుకు మధ్య మధ్య కొద్ది లావు కలిగిన పుల్లలాంటిదానితో నొక్కుతూ చివరకు వచ్చాక మిగిలిన కాగితపు భాగాన్ని మూసివేస్తారు. వాదవలసి వచ్చినపుడు చివర సన్నగా కోలుగా ఉన్న భాగంలో కొంత చించి అక్కడ అంటిస్తారు. మందు వత్తిడితో బయటకు వచ్చేందుకు ప్రయత్నించునపుడు వెలుగులు చిమ్మతూ అటూ ఇటూ తిరుగుతూ సిసింద్రీ ఎగురుతుంటుంది.