ముఠా మేస్త్రి
Appearance
ముఠా మేస్త్రి | |
---|---|
దర్శకత్వం | ఎ. కోదండరామిరెడ్డి |
రచన | పరుచూరి సోదరులు |
నిర్మాత | కె.సి.శేఖర్‌బాబు, డి. శివప్రసాద్ రెడ్డి |
తారాగణం | చిరంజీవి రోజా మీనా |
ఛాయాగ్రహణం | ఎస్. గోపాల రెడ్డి |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థలు | కామాక్షి మూవీస్, కామాక్షి దేవికమల్ కంబైన్స్ |
విడుదల తేదీ | జనవరి 17, 1993 |
భాష | తెలుగు |
ముఠా మేస్త్రి 1993 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. చిరంజీవి, రోజా, మీనా ఇందులో ప్రధాన పాత్రధారులు.
కథ
[మార్చు]బోసు (చిరంజీవి) ఒక దేశభక్తి గలవాడు. కూరగాయల మార్కెట్ లో కూలివారికి అన్యాయం జరగకుండా కాపాడుతుంటాడు. ఆత్మా (శరత్ సక్సేనా) ఆ ప్రాంతంలో ఒక ముఠా నాయకుడు. బోసు అతనికి వ్యతిరేకంగా పోరాడుతుంటాడు. బోసు దేశభక్తిని, అన్యాయాలపై స్పందించే తీరును చూసి ముఖ్యమంత్రి (గుమ్మడి వెంకటేశ్వర రావు) అతన్ని ఎమ్మెల్యేగా నిలబడమంటాడు. బోసు ఎమ్మెల్యే అయి మంత్రిగా అనేక దౌర్జన్యాలను ఎదుర్కొంటాడు. ప్రత్యర్థులు అతని చెల్లెల్ని దొంగతనంగా వ్యభిచారం కేసులో ఇరికించి ఆమె కోర్టు మెట్ల మీదనే ఆత్మహత్య చేసుకునేలా చేస్తారు. బోసు తన రాజకీయ పదవులన్నింటికీ రాజీనామా చేసి తన చెల్లెలి చావుకు కారణమైన వారిని చట్టానికి పట్టించి మళ్ళీ మామూలు కూలీగానే జీవితం గడపాలనుకుంటాడు.
తారాగణం
[మార్చు]- బోసు గా చిరంజీవి
- రోజా
- మీనా
- ఆత్మ గా శరత్ సక్సేనా
- మన్సూర్ ఆలీ ఖాన్
- బ్రహ్మానందం
- కోట శ్రీనివాసరావు
- అల్లు రామలింగయ్య
- ముఖ్యమంత్రి గా గుమ్మడి వెంకటేశ్వరరావు
- జె. వి. సోమయాజులు
- యువరాణి
ఈ చిత్రంలోని పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | గానంఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కె ఎస్ చిత్ర | నిడివి |
---|---|---|---|
1. | "అంజనీపుత్రుడా వీరాధివీరుడా" | ||
2. | "ఈ పేటకి నేనే మేస్త్రి" | ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం | |
3. | "ఎంత ఘాటు ప్రేమయో" | ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం | |
4. | "చికి చికి చాం" | మనో, కె ఎస్ చిత్ర | |
5. | "వాన గడియారంలో" | ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం |
బహుమతులు
[మార్చు]సంవత్సరం | ప్రతిపాదించిన విభాగం | పురస్కారం | ఫలితం |
---|---|---|---|
1993 | చిరంజీవి (ఆయనకు 4వది) | ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటుడు బహుమతి | గెలుపు |