శరత్ సక్సేనా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శరత్ సక్సేనా
Sharat Saxena at the music launch of the film ‘Luckhnowi Ishq’.jpg
2015 లో ఒక కార్యక్రంలో శరత్ సక్సేనా
జననం (1950-08-17) 1950 ఆగస్టు 17 (వయసు 72)
విద్యాసంస్థజబల్పూర్ ఇంజనీరింగ్ కళాశాల
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1972–present
ఎత్తు1.77 మీ. (5 అ. 10 అం.)
జీవిత భాగస్వామిశోభ సక్సేనా

శరత్ సక్సేనా ఒక ప్రముఖ భారతీయ నటుడు.[1] ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కొన్ని ప్రతినాయక, సహాయ పాత్రల్లో నటించాడు. కొన్ని టి. వి కార్యక్రమాల్లో కూడా నటించాడు.[2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

శరత్ 1950, ఆగస్టు 17 న మధ్య ప్రదేశ్ లోని సత్నా లో జన్మించాడు. భోపాల్ లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్, జబల్పూర్ లోని చర్చి బాయ్స్ సీనియర్ సెకండరీ హైస్కూల్లో చదువుకున్నాడు. జబల్పూర్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించాలనుకున్నాడు. అలా 1972 లో ముంబైకి వచ్చాడు. మొదట్లో చిన్న చిన్న వేషాలతో మొదలుపెట్టి ప్రతినాయక, సహాయ పాత్రల్లోకి అడుగు పెట్టాడు.[3]

ఈయన భార్య పేరు శోభ. వీరికి వీర, విశాల్ అనే ఇద్దరు పిల్లలు. వీరిద్దరూ కూడా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు శరత్ వెల్లడించాడు.

సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నితీష, కశ్యప్. "I can't do anything other than acting: Sharat Saxena". timesofindia.indiatimes.com. టైమ్స్ ఆఫ్ ఇండియా. Retrieved 21 September 2017.
  2. "Sharat Saxena to appear in 'Sajjan Re Phir Jhooth Mat Bolo'". timesofindia.indiatimes.com. టైమ్స్ ఆఫ్ ఇండియా. Retrieved 21 September 2017.
  3. మిశ్రా, అభిమన్యు. "People think muscular men have no brains: Sharat Saxena". timesofindia.indiatimes.com. టైమ్స్ ఆఫ్ ఇండియా. Retrieved 21 September 2017.