టి.వి.రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తోటకూర వెంకట రాజు
T.V.Raju.jpg
టి.వి.రాజు
జననంటి.వి.రాజు
అక్టోబరు 25 1921
రఘుదేవపురం , రాజమండ్రిభారతదేశం
మరణం20 ఫిబ్రవరి, 1973
మతంహిందూమతం
భార్య / భర్తసావిత్రి
పిల్లలుఇద్దరు; వెంకట సత్య సుర్యనారాయణ (గిటారిస్ట్), సోమరాజు (రాజ్) - సంగీత దర్శకులు)
తండ్రిపెద్ద సోమరాజు
తల్లిరత్తమ్మ

తోటకూర వెంకట రాజు (టి.వి.రాజు) (జ: 1921 - మ: ఫిబ్రవరి 20, 1973) తెలుగు-తమిళ సినిమా సంగీత దర్శకుడు. ఈయన కన్నడ సినీ రంగములో కూడా పనిచేశాడు. ఈయన అంజలీదేవి నృత్యప్రదర్శనలకు హార్మోనియం వాయించేవాడు.

తోటకూర వెంకటరాజు రాజమండ్రి తాలూకా రఘుదేవపురంలో జన్మించాడు. స్వగ్రామంలోనే నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారి వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. మాస్టర్ వెంకటరాజు అన్న పేరుతో రంగస్థల నటునిగా మద్రాసులో స్థిరపడ్డాడు. నటించిన సినిమాలు : పల్లెటూరి పిల్ల (1950)లో గూఢచారిగా, పిచ్చి పుల్లయ్య (1953)లో న్యాయమూర్తిగా, బంగారుపాప (1954)లో డాక్టర్‌గా, పాండురంగ మహాత్మ్యం (1957)లో ‘కృష్ణా ముకుందా మురారి’ అనే పాటలో భక్తునిగా కనిపిస్తారు.

కుటుంబం[మార్చు]

ఈయనకు 33వ యేట సావిత్రితో వివాహం జరిగింది. ఇద్దరు కుమారులు. పెద్దవాడు వెంకట సత్య సూర్యనారాయణ రాజు, ఈయన గిటారిస్ట్. రెండవ కుమారుడు తోటకూర సోమరాజు (రాజ్ గా తెలుగు సినీరంగంలో ప్రసిద్ధి చెందాడు), రాజ్-కోటి ద్వయంలో ఒకడు. కోటి నుండి విడివడి సిసింద్రీ వంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు.

సినీ ప్రస్థానం[మార్చు]

1950లో విడుదలైన పల్లెటూరి పిల్ల సినిమాలో సంగీతదర్శకుడు పి.ఆదినారాయణరావుకు సహాయకునిగా పనిచేశాడు. సంగీతదర్శకునిగా వెంకటరాజు తొలి సినిమా 1952లో బి.ఎ.సుబ్బారావు దర్శకత్వం వహించిన టింగురంగ. 70వ దశకపు తొలినాళ్లలో యోగానంద్, వేదాంతం రాఘవయ్య, కమలాకర కామేశ్వరరావు, ఎన్టీయార్ మరియు కె.విశ్వనాథ్‌ల సినిమాలకు సంగీతం సమకూర్చాడు. టీవీ రాజు సంగీతదర్శకత్వం వహించిన చిత్రాలలో జయసింహ, పాండురంగ మహత్యం, శ్రీకృష్ణపాండవీయం, గండికోట రహస్యం, మంగమ్మ శఫదం, పిడుగు రాముడు, విచిత్ర కుటుంబం, కథానాయకుడు, జ్వాలాదీప రహస్యం వంటి చిత్రాలున్నాయి.

సినిమాలు[మార్చు]

ప్రచురణలు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

విశేషాలు[మార్చు]

ఈయన ఒకే ఒక సినిమాను నిర్మాతగా తీసారు. ఒకప్పటి రూమ్ మేట్స్ అయిన ఎన్.టి.ఆర్ మరియు ఎస్.వి.ఆర్ తో కలిసి "బాల నాగమ్మ" (1959) సినిమాను నిర్మించారు.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]