శ్రీకృష్ణాంజనేయ యుద్ధం
శ్రీకృష్ణాంజనేయ యుద్ధం (1972 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | సి.ఎస్.రావు |
నిర్మాణం | డి. ఎస్. రాజు |
తారాగణం | నందమూరి తారక రామారావు, వాణిశ్రీ, రాజనాల (ఆంజనేయుని పాత్రలో), కాంతారావు, ఎస్.వి. రంగారావు |
సంగీతం | టి.వి.రాజు |
నిర్మాణ సంస్థ | పూర్ణిమ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఈ సినిమా 1972 లో విడుదలయ్యింది. లవకుశ చిత్రం పుల్లయ్య గారి మరణానంతరం దర్శకత్వం వహించిన వారి కుమారుడు సి.ఎస్.రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పౌరాణికాలను సీక్వెల్స్ గా ఆమోదించగలితే ఈ చిత్రం తొలిభాగం లవకుశకు కొనసాగింపుగా ఉంటుంది.
చిత్రకథ
[మార్చు]సీతాదేవి భూమాతలో లీనమైన తరువాత, రాముడు సీతా వియోగాన్ని భరింపలేక శొకతప్తుడౌతాడు. అయోధ్య లో ఉన్న హనుమ శ్రీరాముని ఆస్తితి లో చూడలేక పోతాడు. ఆసమయంలో దూరంగా వేదోచ్ఛాటన చేస్తున్న భూసురుడు తన వేదన తగ్గించగలడని, ఆతని తోడ్కొని రమ్మని హనుమ కు శ్రీరాముడు చెబుతాడు. వచ్చిన భూసురుడు ఒక షరతు పెడతాడు. తాను రామునితో ఏకాంతంగా సంభాషించాలని ఆఏకాంతాన్ని ఎవరు భంగంచేసినా శిరచ్చేధం చేయాలని ఆ షరతు. రాముడు అంగీకరించి హనుమను తన ద్వారంవద్ద కావలి ఉంచాడు. వచ్చిన బ్రాహ్మణుడు యమధర్మరాజు. రాముని అవతార పరమార్ధం సిద్ధించింది కావున వైకుంఠానికి తిరిగి రమ్మని చెబుతాడు. ఐతే శ్రీరామునికి భూలోకంలో ఉన్న బంధం హనుమ పై ఉన్న ప్రేమ. ఆ ప్రేమరాహిత్యాన్ని సాధించాలంటే శ్రీరామ హనుమలు దూరమవ్వాలి. ఈ ఏకాంత సంభాషణ జరుగుతున్న కాలంలో దూర్వాసుడు శ్రీరాముని చూడాలని వస్తాడు. వారించిన హనుమ తో రఘు వంశాన్ని శపిస్తానని బెదిరిస్తాడు. గత్యంతరం లేని స్థితిలో హనుమ లోనికి వెళతాడు. ఫలితంగా శిరచ్ఛేధానికి సమమైన రాజ్య బహిష్కారానికి గురై గంధమాదన పర్వతంపై రాముని భజిస్తూ కాలంగడుపుతాడు. శ్రీరాముడు అవతారం చాలించి కృష్ణావతారం ధరించాడు. వైకుంఠంలో గరుత్మంతుడు, భూలోకంలో బలరాముడు, సత్యభామ గర్వోన్మత్తులై ఉండటం గమనించి నారదుడు వారందర్నీ హనుమపైకి ఉసికొల్పుతాడు. వారందరూ హనుమని ఎదుర్కొని శృంగభంగం పొందుతారు. హనుమంతుడు చివరగా కృష్ణుని చూడటానికి ద్వారకకు వస్తాడు. అక్కడ రుక్మిణి ని సీతగా గుర్తించి, కృష్ణుని కూడా రాముడి గా అంగీకరించగలుగుతాడు.
పాత్రలు-పాత్రధారులు
[మార్చు]ధరించిన పాత్ర | నటి / నటుడు |
---|---|
రాముడు/కృష్ణుడు | ఎన్.టి.ఆర్ |
సీత/రుక్మిణి | దేవిక |
సత్యభామ/భూదేవి | వాణిశ్రీ |
బలరాముడు | ఎస్.వి. రంగారావు |
నారదుడు | కాంతారావు |
హనుమంతుడు | రాజనాల |
గరుత్మంతుడు | అర్జా జనార్ధనరావు |
యముడు | ధూళిపాళ |
విశ్వామిత్రుడు | ముక్కామల |
నరకాసురుడు | త్యాగరాజు |
యశోద | శాంతకుమారి |
దేవకి | హేమలత |
వసుదేవుడు | మిక్కిలినేని |
విధూషకుడు | రాజబాబు |
సాందీపుడు | చిత్తూరు నాగయ్య |
నాగిని | లీలారాణి |
నళిని | విజయభాను |
ఇంకా రోజారమణి, కాశీనాథ్ తాతా, విజయరాధిక, జయవిజయ, వై.విజయ, ఝాన్సీ, సువర్ణ, బేబీ గౌరి, ఎ.ఎల్.నారాయణ, వేలంగి, శ్రీదేవి మొదలైన వారు.
పాటలు
[మార్చు]- అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా (శ్లోకం) - మాధవపెద్ది
- ఆలము చేయబూని నిటలాక్షుడు నన్నెదిరించుగాక (పద్యం) - ఘంటసాల - రచన: :తాండ్ర
- ఆదివిష్ణువు అవతారివౌ రామచంద్రుడు ఒక్కడే ( పద్యం) - ఘంటసాల - రచన: :తాండ్ర
- ఇనకుల వంశుడు దశరధేశుని పుత్రులు రామలక్ష్మణులు (పద్యం) - ఘంటసాల - రచన: :తాండ్ర
- ఇది లంకాపురి కాదు ద్వారక విజృంభించంగ ఈసీమ (పద్యం) - ఘంటసాల - రచన: :తాండ్ర
- ఇదె సత్యాగ్రహ దీక్షపూనితిన్ నా శ్రీరాముదర్శింపుగా (పద్యం) - ఘంటసాల - రచన: :తాండ్ర
- ఎన్నాళ్ళు వేచేను ఓ రామా నీకు ఇకనైన దయరాద - ఘంటసాల బృందం - రచన: డా॥ సినారె
- ఏ సాధ్వీమణి పాదధూళి అల దేవేంద్రాది దిక్పాలకాంత (పద్యం) - ఘంటసాల - రచన::తాండ్ర
- ఏ దేవి సౌందర్యమాదిజుడైన ఆ అజునికే వర్ణింప (పద్యం) - ఘంటసాల - రచన: డా॥ సినారె
- ఓం సామ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం ( వేదపఠనం) - వేద పండితులు
- ఔరా ! వానరమాతృనికింత గర్వంబా నను (పద్యం) - మాధవపెద్ది
- కౌసల్యా సుప్రజారామా పూర్వాసంధ్యా (సాంప్రదాయ శ్లోకం ) - ఘంటసాల
- కోతియే లంకలో కోటకొమ్మల గాల్చి స్వామికి సీతమ్మ (పద్యం) - ఘంటసాల - రచన: :తాండ్ర
- గోపాల కృష్ణయ్య రావయ్య మా జేజేలనే అందుకోవయ్యా - పి.లీల,మాధవపెద్ది,పిఠాపురం బృందం
- నీవైన చెప్పవే ఓ మురళీ ఇక నీవైన చెప్పవే ప్రియ మురళి - ఘంటసాల,సుశీల - రచన: డా॥ సినారె
- పారావారపరీత భూతలమునన్ ప్రఖ్యాతిగన్నట్టి (పద్యం) - మాధవపెద్ది
- పూలు వేరైనా పూజ ఒకటని నేటికి తెలిసెను ఓ దేవా - ఘంటసాల బృందం - రచన: డా॥ సినారె
- భండనంబున గదాదండంబు చేబూని చెండాడునాడు (పద్యం) - ఎస్.పి. బాలు
- రంకులు మానుము మర్కాటధమా మహారణ్య (పద్యం) - మాధవపెద్ది
- రాక్షసులను చంపి భూమిభారముంబు దీర్ప బహుమతిగ (పద్యం) - ఘంటసాల - రచన: :తాండ్ర
- రామ రామ రామ సీతా రామా రఘురామ దశరధ - ఘంటసాల బృందం - రచన: డా॥ సినారె
- వసుధలో ఎవరైన పత్రాళి వ్రాయుచో శ్రీరామ చుట్టి (పద్యం) - ఘంటసాల - రచన: :తాండ్ర
- వేదముల దొంగలించి అంభోది దాగు ( సంవాద పద్యాలు ) - సుశీల,బి.వసంత,పి.లీల
- సూత్రావతారినై త్రైవిశ్‌తపముతోడ సుత్రాముగెల్చిన (పద్యం) - మాధవపెద్ది
ఇతరవివరాలు
[మార్చు]- తాండ్ర సుబ్రహ్మణ్యం రచన చేసిన కృష్ణార్జున యుద్ధం నాటకం దీనికి ఆధారం.
- రాజనాల చాలా మక్కువతో హనుమంతుని పాత్ర తొలిసారి పోషించారు.
- ఆంజనేయ పాత్ర అనేక సార్లు ధరించిన అర్జా జనార్ధనరావు ఇందులో గరుత్మంతుని పాత్ర ధరించారు.
- శృంగార తార వై.విజయ కృష్ణుని అష్టభార్యలలో ఒకరి గా నటించింది.
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.