అర్జా జనార్ధనరావు
అర్జా జనార్ధన రావు | |
---|---|
జననం | కాకినాడ | 1926 డిసెంబరు 21
మరణం | 2007 నవంబరు 4 | (వయసు 80)
విద్య | బి. ఎ, బి. ఎస్. సి |
వృత్తి | నటుడు, ఆడియో ఇంజనీరు |
అర్జా జనార్ధనరావు (డిసెంబర్ 21, 1926 - నవంబర్ 4, 2007) ప్రసిద్ధ తెలుగు నాటక, సినిమా నటుడు. ఇతడు ఎక్కువగా పౌరాణిక చిత్రాలలో హనుమంతుడు వేషంతో మంచిపేరు సంపాదించుకున్నాడు. హనుమ అనగానే గుర్తువచ్చే విదంగా ఆయన నటన ఉండేది. అరను సుమారు 72 సినిమాలలో నటించాడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ఇతని స్వస్థలం కాకినాడ. అక్కడే బి.ఎ., బి.ఎస్.సి చదువుకున్నాడు. చదువుకొనే సమయంలోనే ఇతనికి నాటకరంగంలో కొంత అనుభవం కలిగింది. ఇతనికి చిన్నతనం నుండి ఆటలమీద, కసరత్తులు చేయడం మీద ఉత్సాహం ఉండేది. ఆ ఉత్సాహమే ఇతడిని మిస్టర్ ఆసియా, మిస్టర్ హెర్క్యులస్ (1954), మిస్టర్ ఇండియా (1955)గా ఎన్నిక చేసింది. ఇతడు శబ్దగ్రహణ శాఖలో డిప్లొమా చదివి కొన్నాళ్ళు శ్యామలా స్టుడియోలో రికార్డిస్ట్‌గా పనిచేశాడు.
మొదటిసారిగా 1968లో కమలాకర కామేశ్వరావు దర్శకత్వంలో 'వీరాంజనేయ' సినిమాలో ఆంజనేయుని పాత్ర పోషించాడు. ఇందులో రాముడిగా కాంతారావు, సీతగా అంజలీదేవి చేశారు. ఈ సినిమా మంచి ప్రజాదరణ పొందిన సినిమా. ఆ తరువాత అతనికి మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా 'సంపూర్ణ రామాయణం'. దర్శకుడు బాపుగారు శోభన్ బాబు రాముడిగా, చంద్రకళ సీతగా, ఎస్వీ రంగారావు రావణాసురిడిగా తీసిన 'సంపూర్ణ రామాయణం' (1971) లో ఆర్జా జనార్ధనరావు హనుమంతుని పాత్రలో ఒదిగిపోయాడు. అక్కడ హనుమంతుడు మాత్రమే ప్రేక్షకులకి కనిపిస్తాడు అంటే ఆ పాత్రలో అతను ఎంతగా ఇమిడిపోయారో అర్థం అవుతుంది.[2]
డిటెక్టివ్ నవలా రచయిత విశ్వప్రసాద్ కథ, మాటలు సమకూర్చిన, 1969 జూలై 25న సినిమా విడుదలైన, కృష్ణ, గుమ్మడి, ఎస్వీ రంగారావు, వాణిశ్రీ లు ప్రధాన పాత్రధారులుగా ఉన్న జగత్ కిలాడీలు’ చిత్రంలో జనార్దన రావు భిన్నమైన పాత్రలో నటించాడు.[3]
నటించిన సినిమాలు
[మార్చు]- లవకుశ (1963)
- శ్రీకృష్ణావతారం (1967)
- వీరాంజనేయ (1968)
- శ్రీ రామాంజనేయ యుద్ధం (1974)
- ముత్యాల ముగ్గు (1975)
- శంకరాభరణం (1979)
- త్యాగయ్య (1981)
- శ్రీ ఆంజనేయ చరిత్ర (1981)
- దేవాంతకుడు (1984)
మూలాలు
[మార్చు]- ↑ "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2024-12-10.
- ↑ ABN (2024-04-23). "Hanuman Jayanti: తెలుగు సినిమాలో ఆంజనేయుడు అంటే ఆర్జా జనార్దన్ రావు | When it comes to Lord Hanuman in Telugu Cinema, its Arja Janardhan Rao only Kavi". Chitrajyothy Telugu News. Retrieved 2024-12-10.
- ↑ Sanganabhatla, Ramakistaiah (2020-11-03). "హనుమ పాత్రలకు పెట్టింది పేరు జనార్దన రావు". Sakalam (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-12-10.