దేవాంతకుడు (1984)
Jump to navigation
Jump to search
దేవాంతకుడు (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.ఎ.చంద్రశేఖర్ |
---|---|
నిర్మాణం | నారాయణరావు |
కథ | శోభ |
చిత్రానువాదం | ఎస్.ఎ.చంద్రశేఖర్ |
తారాగణం | చిరంజీవి (విజయ్), విజయశాంతి (శాంతి), నారాయణరావు (చంటి), వరలక్ష్మి[-అయోమయ నివృత్తి పేజీకి వెళ్తున్న ఈ లింకును సవరించాలి-] (విజయ్ చెల్లెలు), చిట్టిబాబు (చౌదరి, అబ్బాయి), రోహిణి (లలిత), గొల్లపూడి మారుతీరావు (రామానుజం), గుమ్మడి వెంకటేశ్వరరావు (పోలీస్ కమిషనర్), గోకిన రామారావు (ధర్మరాజు), హరి (అరుణ్ కుమార్), కోట శ్రీనివాసరావు, అర్జా జనార్ధనరావు, అన్నపూర్ణ, సిల్క్ స్మిత, విజయలక్ష్మి |
సంగీతం | జె. వి. రాఘవులు |
నేపథ్య గానం | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ, పి. సుశీల |
గీతరచన | వేటూరి సుందరరామమూర్తి, గోపి, జ్యోతిర్మయి |
సంభాషణలు | తోటపల్లి మధు (తొలి చిత్రం) |
ఛాయాగ్రహణం | ఎన్. కేశవ |
కూర్పు | గౌతంరాజు |
నిర్మాణ సంస్థ | దమయంతి ఆర్ట్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 12 ఏప్రిల్ 1984 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
దేవాంతకుడు, చిరంజీవి హీరోగా 1984లో విడుదలైన ఒక తెలుగు సినిమా. చిరంజీవి తారాపధంలో ఎదగడానికి తోడ్పడిన సినిమాలలో ఇది ఒకటి. దమయంతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నారాయణరావు నిర్మించిన ఈ సినిమాకి దర్శకత్వం ఎస్. ఏ. చంద్రశేఖర్. కన్నడ చిత్రం" ఇది గెలుపు నన్నదే " ఆధారంగా తీసిన చిత్రం. ఇందులో చిరంజీవి , విజయశాంతి జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం జె వి రాఘవులు సమకూర్చారు. తెలుగులో ఈ చిత్రం సూపర్ హిట్ అయింది.
కథ
[మార్చు]ఆడుతూ, పాడుతూ సరదాగా ఉండే విజయ్ (చిరంజీవి) అనే యువకుడికి పందాలు కాయడం, ఎలాగైనా ఆ పందెం నెగ్గించుకోవడం అలవాటు. అతను అరుణ్ (హరి) అనే యువకుని హత్య కేసులో ఇరుక్కుంటాడు. అప్పుడు విజయ్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడమే ఈ సినిమా కథ.
పాటలు
[మార్చు]- చెల్లెమ్మకీ పెళ్ళంట, అన్నయ్యకి సంబరమంటా - రచన: గోపి - గానం: బాలు, శైలజ
- చిలకొచ్చి కొడుతుంటే చిరుబుగ్గా - రచన: వేటూరి- గానం: బాలు, శైలజ
- ఘడియకో కౌగిలింత, గంటకో పులకరింత - రచన: వేటూరి - గానం: బాలు, సుశీల
- చెల్లెమ్మకీ పెళ్ళంట (విషాదంగా) - రచన: గోపి - గానం: బాలు
- ఆకేసి, పీటేసి, ముంగిట్లో ముగ్గేసి సోగ్గాడికీ - రచన: జ్యోతిర్మయి- గానం: బాలు, సుశీల
- నే కుబుసం విడిచిన నాగుని - రచన: వేటూరి - గానం: బాలు (సిల్క్ స్మిత, చిరంజీవిలపై చిత్రీకరించిన పాట)
విశేషాలు
[మార్చు]- ఇది గెలువు నన్నదే అనే కన్నడ సినిమా కథతో పునర్నిర్మించబడింది. కన్నడ సినిమా బాక్సాఫీసువద్ద విఫలమయ్యింది కాని తెలుగు సినిమా సూపర్ హిట్ అయింది.
- ఇది చిరంజీవికి 68వ సినిమా. 1984లో చిరంజీవివి 10 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో చాలా వరకు విజయవంతమయ్యాయి.
- చిరంజీవి - విజయశాంతిల హిట్ కాంబినేషన్ ఈ సినిమాతో మొదలయ్యింది.
- ఈ సినిమాలో కోట శ్రీనివాసరావుకు మొట్టమొదటి 100 రోజుల షీల్డు లభించింది.
- సంభాషణల రచనలో తోటపల్లి మధుకి ఇది మొదటి సినిమా. అతనికి 12,500 రూపాయల పారితోషికం లభించింది. తరువాత అతను సుమారు 200 సినిమాలకు మాటలు వ్రాశాడు.
- ఈ సినిమా షూటింగ్ 22 రోజుల్లో పూర్తి చేశారు. మొత్తం ఖర్చు 22 లక్షలంట.
వనరులు
[మార్చు]- తెలుగు సినిమా వెబ్ సైటు లో వ్యాసం- రచయితలు - నచకి, అట్లూరి
వర్గాలు:
- అయోమయ నివృత్తి పేజీకి లింకులున్న వ్యాసాలు
- అయోమయ నివృత్తి పేజీకి లింకులున్న వ్యాసాలు from జనవరి 2020
- 1984 తెలుగు సినిమాలు
- చిరంజీవి నటించిన సినిమాలు
- గొల్లపూడి మారుతీరావు నటించిన సినిమాలు
- కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు
- గుమ్మడి నటించిన సినిమాలు
- రోహిణి నటించిన సినిమాలు
- సిల్క్ స్మిత నటించిన సినిమాలు
- జె.వి.రాఘవులు సంగీతం అందించిన సినిమాలు