Jump to content

ఎస్.ఎ.చంద్రశేఖర్

వికీపీడియా నుండి
ఎస్.ఎ.చంద్రశేఖర్
జననం
సేనాధిపతి అలెక్స్ చంద్రశేఖరన్[1]

వృత్తినటుడు, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1981-ప్రస్తుతం
జీవిత సహచరిశోభ చంద్రశేఖర్
పిల్లలుఇద్దరు, విజయ్ తో సహా
బంధువులువిక్రాంత్ (మేనల్లుడు)
విరాజ్ (అల్లుడు)

సేనాధిపతి అలెక్స్ చంద్రశేఖరన్ ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు, రచయిత. ఇతడు ముఖ్యంగా తమిళ చిత్రాలకు పనిచేశాడు.[3] ఇతడు సట్టం ఒరు ఇరుత్తరై (1981) అనే తమిళ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[4] ఇతడు వేట్రి, నాన్ సిగప్పు మనిధన్, ముత్తం, సట్టం ఒరు ఇరుత్తరై వంటి అనేక విజయవంతమైన సినిమాలను తీశాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సేనాధిపతి అలెక్స్ చంద్రశేఖరన్ తమిళనాడు రాష్ట్రంలోని, రామేశ్వరం నగరంలోని "తంగచిమదం" అనే ప్రాంతానికి చెందినవాడు.[2] ఇతడు కర్ణాటక సంగీత కళాకారిణి శోభను వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించింది. కొన్ని సినిమాలలో పాటలు పాడింది. కొన్ని సినిమాలకు కథను సమకూర్చింది. ఇతని కుమారుడు విజయ్ కూడా తమిళ సినిమా నటుడు, గాయకుడు.[5] ఇతని దర్శకత్వంలో వెలువడిన "నాలయ తీర్పు" అనే సినిమాతో విజయ్ వెండితెర జీవితాన్ని ప్రారంభించాడు. ఇతని కుమార్తె విద్య రెండేళ్ల వయసులోనే మరణించింది.[6] ఇతని సమీప బంధువులు ఎస్.ఎన్.సురేందర్ నేపథ్య గాయకుడిగా, విక్రాంత్ నటుడిగా సినిమాలలో పనిచేస్తున్నారు.

సినిమా రంగం

[మార్చు]

ఇతడు తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో 70కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. నిర్మాతగా ఏడు చలన చిత్రాలను నిర్మించాడు. 17 తమిళ సినిమాలకు కథను అందించాడు. 44 సినిమాలకు స్క్రీన్‌ప్లే వ్రాశాడు. అంతే కాక 15 సినిమాలలో నటించాడు కూడా. ఇతడు తెలుగులో "చట్టానికి కళ్లులేవు", "బలిదానం", "పల్లెటూరి మొనగాడు", "దేవాంతకుడు", "దోపిడి దొంగలు", "ఇంటికో రుద్రమ్మ" సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతని సినిమాలలో విజయ కాంత్, విజయ్, రజనీకాంత్, చిరంజీవి, శోభన్ బాబు, విష్ణువర్ధన్, అంబరీష్, శంకర్ నాగ్, మిథున్ చక్రవర్తి, జితేంద్ర, ధనుష్ మొదలైన హీరోలు నటించారు. విజయశాంతి, రోహిణి, త్రిష, ముచ్చర్ల అరుణ, ఆరతి, మేఘనా నాయుడు, రాధిక, పూనమ్ కౌర్, రంభ, ప్రియాంక చోప్రా, అభిరామి, మీనా, సిమ్రాన్ మొదలైన నటీమణులు ఇతని సినిమాల్లో నటించారు. ఇతడు ఎక్కువగా విజయకాంత్, విజయ్‌లతో సినిమాలు తీశాడు. ఇతని కుమారుడు విజయ్ ఇతని దర్శకత్వంలో 16 పైచిలుకు సినిమాలలో నటించాడు. ఎస్. శంకర్, ఎం.రాజేష్, పొన్రామ్, రజినీ మురుగన్ తదితరులు ఇతని వద్ద సహాయకులుగా పనిచేసి ఆ తరువాత దర్శకులుగా రాణించారు.[7][8]

వివాదాలు

[మార్చు]

ఇతడు ఒక ఆడియో రిలీజింగ్ ఫంక్షన్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కాడు. తిరుపతి దేవస్థానంలో ప్రజలు దేవునికి ముడుపుల పేరుతో లంచం ఇస్తున్నారని, భగవంతుడు భక్తుల కోరికలన్నీ తీర్చేటట్టయితే ఇక ఎవరూ చదువుకోవలసిన అవసరం లేదని ఇతడు చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. హిందు మున్నాని అనే సంస్థ ఇతని వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని, ఇతనిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో హిందూ మున్నాని హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్ట్ న్యాయాధికారి ఇతనిపై కేసు నమోదు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించాడు.[9]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పనిచేసిన శాఖ భాష వివరణ
దర్శకత్వం నిర్మాణం స్క్రీన్‌ప్లే కథ నటన
2018 ట్రాఫిక్ రామసామి check తమిళం
2016 కోడి check తమిళం తెలుగులో ధర్మయోగి పేరుతో డబ్ అయ్యింది.
2016 నయ్యపుదై check check check తమిళం
2015 టూరింగ్ టాకీస్ check check check check check తమిళం
2011 సత్తపది కుట్రమ్‌ check check check check తమిళం
2010 వెలుతు కట్టు check తమిళం
2008 పంద్యం check check check తమిళం
2007 నెంజిరుక్కుమ్‌ వరై check check తమిళం
2006 ఆది check తమిళం తెలుగులో "నేనేరా ఆది" పేరుతో డబ్ అయ్యింది.
2005 సుక్రన్ check check check check check తమిళం
2003 ముత్తం check check తమిళం
2002 తమిళన్ check తమిళం దమ్ముంటే కాస్కో పేరుతో తెలుగులో డబ్బింగ్ చేయబడింది.
2001 దోస్త్ check check check తమిళం
1999 పెరియన్న check check తమిళం
1999 నెంజినిలె check check check తమిళం సారథి పేరుతో తెలుగులో డబ్ అయ్యింది.
1998 ప్రియముదన్ check తమిళం ప్రేమించేమనసు పేరుతో తెలుగులో పునర్మించబడింది.
1997 వన్స్‌మోర్ check check తమిళం
1996 మాంబుమిగు మానవన్ check check తమిళం
1995 విష్ణు check check తమిళం మిస్టర్ హరికృష్ణ పేరుతో తెలుగులో డబ్ అయ్యింది.
1995 దేవా check check check తమిళం
1994 రసిగన్ check check తమిళం
1993 సెంధూరపండి check check తమిళం బొబ్బిలి రాయుడు పేరుతో తెలుగులో డబ్ అయ్యింది.
1993 జీవన్ కి షత్రంజ్ check check హిందీ ఇది "రాజనాదై" అనే తమిళ సినిమాకు రీమేక్
1993 రాజదురై check check తమిళం రాజసింహ పేరుతో తెలుగులో డబ్ చేయబడింది.
1992 ఇన్నిసై మళై check check తమిళం
1992 నాలయ తీర్పు check check తమిళం
1992 మేరా దిల్ తేరే లియే check హిందీ నంబరగళ్ అనే తమిళ సినిమా రీమేక్
1992 ఇన్సాఫ్ కి దేవి check హిందీ
1990 ఆజాద్ దేశ్ కె గులామ్‌ check check తమిళం
1990 జై శివ్ శంకర్ check హిందీ
1990 సీత check తమిళం
1989 రాజనాదై check check తమిళం
1988 ఇదు ఎంగళ్ నీతి check check తమిళం
1988 సుధాంతిర నాత్తిన్ ఆడిమైగళ్ check తమిళం
1988 పూవుం పూయలం check తమిళం
1987 ఖుద్రత్ కా కానూన్ check హిందీ
1987 సట్టం ఒరు విలయాత్తు check check check check తమిళం
1987 నీతిక్కు దండనై check check check తమిళం తెలుగులో న్యాయానికి శిక్ష పేరుతో పునర్మించబడింది.
1986 నీలవె మాలరె check check తమిళం
1986 వసంత రాగం check check తమిళం
1986 ఏనక్కు నానె నీదిపతి check check check check తమిళం
1986 ఏన్ శబదం check తమిళం
1986 సిగప్పు మాలర్గల్ check check check తమిళం
1985 ఇంటికో రుద్రమ్మ check తెలుగు
1985 నీదియిన్ మరుపక్కమ్ check check తమిళం
1985 నాన్ సిగప్పు మనిధన్ check check check తమిళం తెలుగులో మిస్టర్ విజయ్ పేరుతో డబ్బింగ్ అయ్యింది.
1985 బలిదాన్ check హిందీ
1985 పుదు యుగం check check check తమిళం
1984 కుదుంబం check check check check తమిళం
1984 దోపిడి దొంగలు check తెలుగు
1984 వీటుకు ఒరు కన్నగి check check check తమిళం
1984 దేవాంతకుడు check తెలుగు
1984 వేట్రి check తమిళం
1983 సింహ గర్జనె check check కన్నడ
1983 హసిద హెబ్బులి check check కన్నడ
1983 సాచ్చి check check check తమిళం
1983 సంసారం ఎంబత్తు వీణై check తమిళం
1983 గెద్ద మగ check కన్నడ "మూండ్రు మగం" తమిళ సినిమా రీమేక్
1983 పల్లెటూరి మొనగాడు check తెలుగు
1983 బలిదానం check తెలుగు పట్టణదు రాజక్కల్ సినిమా రీమేక్
1982 ఇదయం పెసుగిరాదు check check check తమిళం
1982 న్యాయ ఎల్లిదె check check కన్నడ ఇది సట్టం ఒరు ఇరుత్తరై అనే తమిళ సినిమా రీమేక్
1982 ఓమ్‌ శక్తి check తమిళం
1982 పట్టణదు రాజక్కల్ check check check తమిళం
1981 నీది పిళైతదు check check check తమిళం
1981 చట్టానికి కళ్లులేవు check check తెలుగు ఇది సట్టం ఒరు ఇరుత్తరై అనే తమిళ సినిమా రీమేక్
1981 జాదిక్కొరు నీది check check check తమిళం
1981 నెంజిలె తునివిరుంతల్ check check check తమిళం
1981 సట్టం ఒరు ఇరుత్తరై check check తమిళం

గుర్తింపు

[మార్చు]

ఇతడు సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా అమెరికాలోని ఇంటర్నేషనల్ తమిళ్ యూనివర్సిటీ ఇతనికి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసి గౌరవించింది.[10]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ↑ Director S.A.Chandrasekhar. Facebook.com. Retrieved on 2015-10-16.
  2. 1 2 http://www.veethi.com/india-people/s._a._chandrasekhar-profile-8016-14.htm
  3. ↑ "Exclusive biography of #SAChandrasekhar and on his life". filmibeat.com. Archived from the original on 27 మార్చి 2017. Retrieved 28 November 2016.
  4. ↑ cbarn. "The Hindu : Metro Plus Coimbatore : `Message' man". thehindu.com. Archived from the original on 10 నవంబరు 2016. Retrieved 28 November 2016.
  5. ↑ "Exclusive biography of @actorvijay and on his life". filmibeat.com. Retrieved 28 November 2016.
  6. ↑ "Archived copy". Archived from the original on 2015-12-23. Retrieved 2018-03-05.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  7. ↑ "Demystifying India's highest paid film-maker — the elusive S Shankar — The Economic Times". indiatimes.com. Retrieved 28 November 2016.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  8. ↑ Kamath, Sudhish (26 September 2013). "Master of Bromance". Retrieved 28 November 2016 – via The Hindu.
  9. ↑
  10. ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-10. Retrieved 2018-03-05.