మేఘనా నాయుడు
మేఘ్న నాయుడు | |
---|---|
జననం | విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం | 1980 సెప్టెంబరు 19
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1999—2019 |
జీవిత భాగస్వామి | లూయిస్ మిగ్యుల్ రీస్
(m. 2016) |
మేఘనా నాయుడు (జననం 19 సెప్టెంబర్ 1980) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ & బెంగాలీ సినిమాల్లో నటించింది. మేఘనా నాయుడు 2002లో విడుదలైన 'కలియోన్ కా చమన్' మ్యూజిక్ వీడియోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.[1] [2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]మేఘనా నాయుడు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో 19 సెప్టెంబర్ 1980న జన్మించింది.[3] ఆమె తండ్రి ఎతిరాజ్ ఎయిర్ ఇండియాలో, తల్లి పూర్ణిమ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేస్తున్నారు.[4] ఆమె తన తండ్రి ఉద్యోగరీత్యా మహారాష్ట్ర కు మరి ముంబైలో పెరిగింది. మేఘనా నాయుడు ముంబైలోని, అంధేరిలోని భవన్ కళాశాల నుండి బి.కామ్ డిగ్రీతో పట్టభద్రురాలైంది. ఆమె ఏడేళ్ల పాటు క్లాసికల్ భరతనాట్యంలో శిక్షణ పొందింది.
వివాహం
[మార్చు]మేఘనా నాయుడు 2011లో టెన్నిస్ ఆటగాడు లూయిస్ మిగ్యుల్ రీస్‌తో ప్రేమలో ఉండి 12 డిసెంబర్ 2016న అతనిని వివాహం చేసుకుని దుబాయ్‌లో నివసిస్తున్నారు.[5] [6]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | భాష | ఇతర గమనికలు |
2002 | పృధ్వీ నారాయణ | తెలుగు | ||
వెండి మబ్బులు | శానాయ సర్దేశాయి | తెలుగు | ||
2003 | కత్తెగాలు సార్ కత్తెగలు | కన్నడ | ||
డాన్ | కన్నడ | |||
2004 | హవాస్ | సప్నా ఆర్. మిట్టల్ | హిందీ | |
ఏకె 47 | హిందీ | ప్రత్యేక ప్రదర్శన | ||
కూలీ | బెంగాలీ | |||
శత్రువు | దుబాయ్‌లో క్లబ్ డాన్సర్ | తెలుగు | ||
2005 | జాక్‌పాట్ - మనీ గేమ్ | గౌరీ | హిందీ | |
క్లాసిక్ డాన్స్ ఆఫ్ లవ్ | డోలి | హిందీ | ||
మషూకా | సంజన | హిందీ | ||
భామా కలాపం | అంజలి | తెలుగు | ||
రెయిన్: ది టెర్రర్ వితిన్... | సంధ్యా భట్నాగర్ | హిందీ | ||
బ్యాడ్ ఫ్రెండ్ | సర్గం | హిందీ | ||
2006 | శరవణ | సత్య | తమిళం | |
ఎనిమిది: శని శక్తి | సప్నా | హిందీ | ||
విక్రమార్కుడు | డాన్సర్ చమేలీ | తెలుగు | ప్రత్యేక ప్రదర్శన | |
జాంభవన్ | అను | తమిళం | ||
బడా దోస్త్ | మలయాళం | ప్రత్యేక ప్రదర్శన | ||
2007 | ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే | ఆమెనే | తెలుగు | ప్రత్యేక ప్రదర్శన |
వీరాసామి | తమిళం | |||
2008 | వైతీశ్వరన్ | రూప | తమిళం | |
పాండురంగడు | తెలుగు | ప్రత్యేక ప్రదర్శన | ||
పాంధాయం | ఆమెనే | తమిళం | అతిధి పాత్ర | |
2010 | కుట్టి | రైలులో నర్తకి | తమిళం | ప్రత్యేక ప్రదర్శన |
వాడా | తమిళం | |||
2011 | సిరుతై | ఐటమ్ గర్ల్ | తమిళం | ప్రత్యేక ప్రదర్శన |
100% లవ్ | ఆమెనే | తెలుగు | ప్రత్యేక ప్రదర్శన | |
రివాజ్ | చందా | హిందీ | ||
పులి వేషం | తమిళం | ప్రత్యేక ప్రదర్శన | ||
వెల్లూరు మావట్టం | తమిళం | ప్రత్యేక ప్రదర్శన | ||
పిల్ల జమీందార్ | ఆమెనే | తెలుగు | ప్రత్యేక ప్రదర్శన | |
2012 | లవ్ ఎట్ ఫస్ట్ సైట్ | హిందీ | ||
ఇష్క్ దీవానా | హిందీ | |||
2013 | పరారీ | కన్నడ | ప్రత్యేక ప్రదర్శన | |
ఎలక్షన్ | కన్నడ | ప్రత్యేక ప్రదర్శన | ||
2014 | రణతంత్ర | కన్నడ | ప్రత్యేక ప్రదర్శన | |
ధమక్ | మరాఠీ | ప్రత్యేక ప్రదర్శన | ||
2016 | క్యా కూల్ హై హమ్ 3 | మాసి | హిందీ | |
ఇలమై ఊంజల్ | తమిళం | |||
2019 | ధర్మప్రభు | తమిళం |
టెలివిజన్
[మార్చు]- కలర్స్ టీవీలో ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 1
- కలర్స్ టీవీలో డ్యాన్స్ క్వీన్
- జీ టీవీలో జోధా అక్బర్
- MTV ఇండియాలో MTV ఫనాహ్
- సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్లో అదాలత్
- కలర్స్ టీవీలో ససురల్ సిమర్ కా
- జీ టీవీలో మహారక్షక్ ఆర్యన్
మూలాలు
[మార్చు]- ↑ "Meghna: Blast from the past". The Times of India. 9 August 2009. Archived from the original on 8 March 2012. Retrieved 1 March 2011.
- ↑ "The kaliyon ka chaman girl – The Times of India". The Times of India. Archived from the original on 18 November 2011. Retrieved 14 October 2011.
- ↑ "I'm already booked: Meghna Naidu". Rediff. 27 July 2005. Archived from the original on 16 September 2018. Retrieved 26 May 2016.
- ↑ "Meghana Naidu – Telugu Cinema interview – Telugu film & Bollywood Heroine". Idlebrain.com. Archived from the original on 28 July 2013. Retrieved 17 August 2013.
- ↑ "In pictures: Celebs and their foreign attractions". Mid Day. Archived from the original on 4 June 2016. Retrieved 26 May 2016.
- ↑ Maheshwri, Neha (17 October 2011). "Luis is a complete romantic, says Meghna Naidu". The Times of India. Archived from the original on 12 May 2016. Retrieved 27 May 2016.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మేఘనా నాయుడు పేజీ
- ట్విట్టర్ లో మేఘనా నాయుడు
- ఇన్స్టాగ్రాం లో మేఘనా నాయుడు
- ఫేస్బుక్ లో మేఘనా నాయుడు