అంబరీష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం. హెచ్. అంబరీష్ - ಎಂ.ಹೆಚ್.ಅಂಬರೀಶ್
అంబరీష్

2006లో అంబరీష్


పదవీ కాలం
24 October 2006 - 15 February 2007
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
తరువాత చౌదురి మోహన్ జతువ & ఎస్. జగత్ రక్షకణ్


పదవీ కాలం
1998-2009
ముందు ఎస్. ఎం. కృష్ణ
తరువాత చెలువరాయ స్వామి
నియోజకవర్గం మాండ్య

వ్యక్తిగత వివరాలు

జననం (1952-05-29)1952 మే 29
మండ్య (ಮಂಡ್ಯ), కర్ణాటక (ಕರ್ನಾಟಕ)
మరణం 2018 నవంబరు 24(2018-11-24) (వయసు 66)
బెంగుళూరు, కర్ణాటక (ಕರ್ನಾಟಕ)
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి సుమలత
సంతానం ఒక కుమారుడు - అభిషేక్ గౌడ
నివాసం బెంగుళూరు (ಬೆಂಗಳೂರು)
వృత్తి నటుడు
మతం హిందూ

అంబరీష్ ( 1952 మే 29 - 2018 నవంబర్ 24 ) ఒక కన్నడ సినిమా నటుడు, రాజకీయనాయకుడు. అప్పటి మైసూరు రాష్ట్రంలో మండ్య జిల్లాలో జన్మించిన ఈయన మైసూరులో ఉన్నత విద్యాభ్యాసం చేశాడు. సినిమాల్లో మొదటగా ప్రతినాయక పాత్రలు పోషించి తర్వాత కథానాయకుడిగా మారి సుమారు 200కి పైగా సినిమాల్లో నటించాడు.

1994 లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 1996 ఎన్నికల్లో పార్టీ టెకెట్ దక్కకపోవడంతో జనతాదళ్ పార్టీలో చేరి 1998 నుంచి మండ్య నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు పర్యాయాలు మండ్య పార్లమెంటరీ నియోజక వర్గం నుంచి ఎం. పిగా ఎన్నికయ్యాడు. 14 వ లోక్ సభలో ప్రసార్ శాఖ మంత్రి (స్టేట్) గా పనిచేశాడు. 2009 ఎన్నిల్లో పరాజయం పాలయ్యాడు.

ఇతను ప్రముఖ తెలుగు నటి సుమలతను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు అభిషేక్. ఇతను సినీ నటుడు. కన్నడ రెబెల్ స్టార్ గా పిలవబడే ఈయన్ను అభిమానులు ఆయన్ను ముద్దుగా అంబి అని కూడా పిలుచుకుంటారు.

ఆరంభ జీవితం[మార్చు]

అంబరీష్ 1952, మే 29న మైసూర్ స్టేట్(ప్రస్తుతం:కర్ణాటక రాష్ట్రం), మండ్య జిల్లా, దొడ్డరాశినకెరే గ్రామంలో హుచ్చెగౌడ, పద్మమ్మ దంపతుల ఏడుగురు సంతానంలో ఆరవవాడిగా జన్మించాడు. ఇతని అసలు పేరు అమర్‌నాథ్. ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం మండ్య పట్టణంలో జరిగింది. తరువాత మైసూరులో ఉన్నత విద్య అభ్యసించాడు.

సినిమా జీవితం[మార్చు]

ప్రముఖ కన్నడ చలనచిత్ర దర్శకుడు పుట్టణ్ణ కనగాళ్ తన నాగరహావు చిత్రానికి ప్రతినాయకుని పాత్రకు సరైన నూతననటుని కోసం వెదుకుతూ అంబరీష్‌ను ఎంపిక చేశాడు. ఆవిధంగా ఇతడు 1972 తొలిసారిగా సినిమాలలో అడుగుపెట్టాడు. ఇదే నాగరహావు చిత్రం ద్వారా విష్ణువర్ధన్‌ కథానాయకునిగా పరిచయమయ్యాడు. అప్పటి నుండి అంబరీష్ అనేక కన్నడ, తమిళ, మలయాళ, తెలుగు, హిందీ చిత్రాలలో నటించాడు. ఇతడు అత్యధిక సినిమాలలో నటించి రాజ్‌కుమార్ (206 చిత్రాలు), విష్ణువర్ధన్‌ (230 చిత్రాలు)ల రికార్డును బద్దలు చేశాడు. ఇతనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్.టి.ఆర్. పురస్కారం, ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం, ఫిల్మ్‌ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం, కర్ణాటక ప్రభుత్వం నుండి విష్ణువర్ధన్ పురస్కారం మొదలైన పురస్కారాలు లభించాయి. ఇతని భార్య సుమలత, కుమారుడు అభిషేక్ గౌడ కూడా సినిమా నటులే.

రాజకీయ జీవితం[మార్చు]

ఇతడు 1994లో భారత జాతీయ కాంగ్రెస్లో చేరాడు. 1996 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి టికెట్ దక్కనందువల్ల పార్టీకి రాజీనామా చేశాడు. తరువాత ఇతడు జనతాదళ్లో చేరి 1998లో మాండ్య శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి గెలిచాడు. ఇతడు తిరిగి కాంగ్రెస్‌లో చేరి మాండ్య పార్లమెంటరీ నియోజకవర్గం నుండి రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనాడు. ఇతడు 14వ లోక్‌సభలో సమాచార ప్రసార శాఖ మంత్రి (స్టేట్)గా పనిచేశాడు. అయితే కావేరీ ట్రిబ్యూనల్‌ కేటాయింపులకు నిరసనగా రాజీనామా చేశాడు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికలలో ఓడిపోయాడు.

నటించిన చిత్రాల పాక్షిక జాబితా[మార్చు]

ఈ దిగువ పట్టికలో అంబరీష్‌ నటించిన చలన చిత్రాల వివరాలు ఇవ్వబడినవి,ఇతను కన్నడ భాషాచిత్రాలతో పాటు తమిళం,హిందీ చిత్రాలలోకూడ అభినయించాడు.

సంవత్సరం చిత్రం పాత్ర నటవర్గం వివరాలు
1972 నాగరహావు జలీల విష్ణువర్దన్, ఆరతి సహాయక పాత్ర
1973 సీతె యల్ల సావిత్రి విష్ణువర్దన్,జయలక్ష్మి సహాయక పాత్ర
1974 జహిరీలా ఇన్సాన్ జలీల్ రిషీకపూర్, మౌసమి చటర్జి,నీతూ సింగ్ హింది సినిమా
1975 శుభమంగళ మూగ శ్రీనాథ్,ఆరతి సహాయక పాత్ర
1975 దేవర గుడి విష్ణువర్దన్, భారతి
1978 ప్రేమ పూజారి కమల్ హాసన్, షీలా మలయాళం సినిమా
1978 పడువారహళ్ళి పాండవరు రామకృష్ణ,శాంతల,జయశ్రీ
1978 ప్రియ భారత్ రజనీకాంత్,శ్రీదేవి తమిళ సినిమా
1978 అమర్‌నాథ్ అమర్ విష్ణువర్దన్, శ్రీకళ
1978 స్నేహ సేడు విష్ణువర్దన్,బాలకృష్ణ
1978 సిరితనక్కె సవాల్ విష్ణువర్దన్, మంజులా దేవి
1979 పక్కా కళ్ళ' శ్రీనాథ్, మంజుల(కన్నడ నటి)
1979 సవతియ నెరళు శ్రీనాథ్, మంజుల(కన్నడ నటి)
1980 న్యాయ నీతి ధర్మ ఆరతి,సుందర కృష్ణ అరస్
1981 అంత కన్వర్‌లాల్
సుషీల్‌కుమార్(ద్విపాత్రాభినయం)
లక్ష్మి, లత
1981 రంగనాయకి ఆరతి
1981 స్నేహితర సవాల్ విష్ణువర్దన్,మంజుల(కన్నడ నటి), కె.ఆర్.విజయ
1982 అవళ హెజ్జే విష్ణువర్దన్,లక్ష్మి
1981 భర్జరి బేటె శంకర్ నాగ్, జయమాల
1982 కదీమ కళ్ళరు' రాజా వి.రవిచంద్రన్,జయమాల
1982 ప్రేమ మత్య్సర భారతి,లక్ష్మి,ఆరతి
1982 రాజా మహరాజా రాజ ఆరతి
1982 టోనీ టోని లక్ష్మి,శ్రీనాథ్
1983 చక్రవ్యూహ అంబిక
1983 జగ్గు ఆరతి, ప్రభాకర్
1983 హొస తీర్పు జయంతి,మంజుల
1984 మృగాలయ గీతా
1984 మసనాద హూవు జయంతి,అపర్ణ
1984 గండ భేరుండ శంకర్‌ నాగ్,శ్రీనాథ్, అమ్రీష్ పురి,వజ్రముని,లక్ష్మి,జయమాల
1984 మూరు జన్మ అంబిక,అనురాధ
1985 గజేంద్ర పవిత్ర
1985 గురు జగద్గురు దీపా
1985 మమతెయ మడిలు గీతా
1985 చదురంగ అంబిక
1985 జాకీ మహాలక్ష్మి
1985 దెవరెల్లిద్దానె గీత
1986 అమర జ్యోతి అమర్ మాధవి
1986 శంకర్ సుందర్ శంకర్ ఉర్వశి, జయసుధ
1987 ఏళు సుత్తిన కోటే గౌతమి
1987 ఒలవిన ఉడుగోరె మంజుల శర్మ
1987 ఆశ అర్జున్ సర్జా,ఇందిర
1987 మి.రాజా రాజా మహాలక్ష్మి,తార
1987 ఆహుతి సుమలత
1987 బగార్ భీమా గీత,అంబిక
1987 బేడి భవ్య,సుధా చంద్రన్,ప్రభాకర్
1987 అంతిమ తీర్పు భారతి,గీత
1987 ఇన్‌స్పెక్టరు క్రాంతికుమార్ క్రాంతికుమార్ గీత
1988 బ్రహ్మ,విష్ణు మహేశ్వర బ్రహ్మ అనంత్ నాగ్,వి.రామచంధ్రన్
1988 సంగ్లియన శంకర్‌ నాగ్, భవ్య, దేవరాజ్
1988 పూర్ణ చంద్ర చంద్ర అంబిక,రేఖా
1988 అజిత్ అజిత్ జయమాల,జయమాలిని,రామకృష్ణ
1988 విజయ ఖడ్గ శ్రీనాథ్,అంబిక,ఎమ్పశంకర్,వజ్రముని.
1988 న్యూడిల్లీ సుమలత,ఉర్వశి,
1989 ఇంద్రజిత్(1989చిత్రం) ఇంద్రజిత్ దీపిక చిఖాలియ
1989 అంతింత గండు నానల్ల శంకర్‌ నాగ్,నిశాంతి
1989 అవతార పురుష సుమలత
1989 జైకర్నాటక రజని
1989 అపత్భాందవ ' పారిజాత
1989 హాంగ్‌ కాంగ్‌నల్లి ఎజెంట్ అమర్ అమర్ అంబిక,సుమలత
1989 ఒంటి సలగ ఖుష్బూ
1989 జయభేరి శంకర్‌ నాగ్,భవ్య, వనితావాసు
1990 నమ్ముర హమ్మిర సుమన్ రంగనాథన్,దేవరాజ్
1990 హృదయ హాడితు డా.ప్రసాదు మాలశ్రీ,భవ్య
1990 కెంపు గులాబీ రమేష్ అరవింద్
1990 కెంపు సూర్య సుమన్ రంగనాథన్
1990 మత్సర రజిని,భారతి
1990 ఉత్కర్ష దేవరాజ్,వనితా వాసు
1990 రాణి మహరాణి మాలాశ్రీ,శశికుమార్
1991 నీను నక్కరె హాలు సక్కెరె అంబరీష్ అతిథి
1991 అరణ్యదల్లి అభిమన్యు దేవరాజ్,రమేష్‌ అరవింద్, పునమ్‌దాస్ గుప్తా
1991 గరుడ ధ్వజ అనుపమ,శోభ
1991 కర్ణన సంపత్థు కర్ణ తార
1991 గండు సిడిగుండు మాలాశ్రీ
1991 కదన రమేష్ అరవింద్,రూపా గంగూలీ
1991 పుక్సట్టే గండ హొట్టె తుంబా ఉండ విద్యాశ్రీ,భవ్య
1992 మన్నిన దోణి కార్తిక్ సుధారాణి,వనితా వాసు
1992 బంద నన్నగండ జగ్గెష్,ప్రియాంక అతిథి పాత్ర
1992 ఎంతెదె బంత శ్రీశాంతి
1992 'మైసూరు జాణ నినయ్ ప్రసాదు,అంజన
1992 మేఘమందార మాలాశ్రీ,అంజన
1992 సోలిల్లద సరదార భవ్య,మాలాశ్రీ
1992 సప్తపది(1992 సినిమా) సుధారాణి,రూపిణి
1993 మి.అభిషేక్ అభిషేక్ సుమలత, అనంత్‌నాగ్,మాధవి.
1993 మిడిద హృదయగళు శ్రుతి,నిరోషా
1993 ముంజానెయ మంజు సుధారాణి తార
1994 ఒడ హుట్టిదవరు రాజ్‌కుమార్, మాధవి,శ్రీశాంతి.
1994 మండ్యద గండు శ్రీశాంతి,మేఘన
1994 విజయ కంకణ సుధారాణి,శృతి,దేవరాజ్
1994 రౌడి ఎమ్ఎల్‌ఎ. మాలశ్రీ,విజయశాంతి
1995 అపరేసను అంత కన్వర్‌ లాల్
1995 కరుళిన కుడి విష్ణువర్ధన్, సితార
1995 కళ్యాణోత్సవ శృతి
1997 రంగెనహళ్ళియాగే రంగాద రంగెగౌడ రమేష్ అరవింద్,అశ్విని భావె
1999 హబ్బా విష్ణు వర్దన్,జయప్రద, ఉర్వశి,కస్తూరి,దేవరాజ్,శశికుమార్,
2000 దేవర మగ శివరాజ్‌కుమార్,భానుప్రియ,లైలామెహింది
2001 దిగ్గజరు విష్ణువర్ధన్, తార, సంఘవి
2001 శ్రీ మంజునాథ చిరంజీవి,అర్జున్ సర్జా,మీనా,సౌందర్య కన్నడ-తెలుగు ఉభయభాషాచిత్రం
2003 అణ్ణవ్రు దర్శన్, సుహాసిని, సుమిత్ర
2004 గౌడ్రు గౌడ్రు శతి,మీనా 200వ సినిమా
2006 పాండవరు కెంపెగౌడ
2006 కళ్ళరలి హూవాగి విజయ రాఘవేంద్ర,భారతి,అనంత్‌ నాగ్,సుమలత,
2006 తందెగే తగ్గ మగ చౌడయ్య ఉపేంద్ర,లైలా మెహింది, తేవర్ మగన్ పునర్నిమాణం
2007 ఈ ప్రీతి యెకే భూమి మెలిదె అతిథి పాత్ర
2009 వాయు పుత్ర'' చిరంజీవి సర్జ,అనింద్రిత రాయ్
2010 వీర పరంపరె వరదే గౌడ సుదీప్
2012 కఠారి వీర సురసుందరాంగి యమధర్మరాజు ఉపేంద్ర,రమ్య, దొడ్డన్న
2012 రాణా అమర్‌నాథ్
2012 శ్రీ క్షేత్ర ఆదిచుంచనగిరి అథితి పాత్ర
2012 డ్రామా యాష్,రాధికాపండిత్
2013 బుల్‌బుల్ అమర్‌నాథ దర్శన్,రచితారామ్, '
2014 అంబరీష కెంపేగౌడ మహేష్ సుఖధరే
2016 హ్యాపీ బర్త్‌డే మహేష్ సుఖధరే అతిథి పాత్ర
2016 దొడ్డమనె హుడ్గ దొడ్డమనే రాజీవ దునియా సూరి
2018 రాజసింహ అంబరీష్ రవి రామ్‌ అతిథి పాత్ర
2018 అంబీ నింగ్ వయసాయ్తో అంబి/అంబరీష్ గురుదత్త గనిగ [1]
2018 కురుక్షేత్ర భీష్మ నాగన్న విడుదల కావలసి వుంది

పురస్కారాలు[మార్చు]

మరణం[మార్చు]

ఇతడికి 2014 నుండి ఊపిరితిత్తుల సమస్య ఉంది. 2018, నవంబర్ 24 శనివారం సాయంత్రం ఇతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే ఇతడు తుదిశ్వాస విడిచాడు.[2]

మూలాలు[మార్చు]

  1. "ಅಂಬಿಯಲ್ಲಿ ಸುದೀಪ್‌ ಪಾತ್ರಕ್ಕೆ ಸಿಜಿ ವರ್ಕ್‌". vijaykarnataka. Retrieved 24 December 2017.
  2. విలేఖరి. "అంబరీష్ భౌతిక కాయానికి కుమారస్వామి, దేవెగౌడ నివాళులు". ఆంధ్రజ్యోతి దినపత్రిక. No. 25 November 2018. Archived from the original on 25 November 2018. Retrieved 25 November 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అంబరీష్&oldid=3874643" నుండి వెలికితీశారు