కన్నడ ప్రభాకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కన్నడ ప్రభాకర్
జననం
ప్రభాకర్

(1950-03-30)1950 మార్చి 30
ఫ్రేజర్ టౌన్, బెంగుళూరు, మైసూరు రాష్ట్రం (ప్రస్తుతం కర్ణాటక
మరణం2001 మార్చి 25(2001-03-25) (వయసు 50)
మరణ కారణంపచ్చ కామెర్లు
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుటైగర్
వృత్తినటుడు, దర్శకుడు
జీవిత భాగస్వామిఅల్ఫోంజా మేరీ
జయమాల (విడాకులు)
అంజు (విడాకులు)
పిల్లలు5
తల్లిదండ్రులుసి. డి. సుందర రాజ్
అలీస్ దెబోరా

కన్నడ ప్రభాకర్ లేదా టైగర్ ప్రభాకర్ ( 1950 మార్చి 30 – 2001 మార్చి 25) ఒక భారతీయ సినీ నటుడు, నిర్మాత. ఎక్కువగా కన్నడ, తెలుగు సినిమాల్లో నటించాడు. మలయాళం, తమిళం, బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు. 450 కి పైగా సినిమాల్లో నటించిన ప్రభాకర్ ఎక్కువగా ప్రతినాయక పాత్రల్లో నటించాడు.[1][2] తెలుగులో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో అతని పాత్ర సుపరిచతం.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ప్రభాకర్ 1950, మార్చి 30 న అప్పటి మైసూరు రాష్ట్రంలో బెంగుళూరులోని ఫ్రేజర్ టౌన్ లో జన్మించాడు. ప్రభాకర్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మొదటి పెళ్ళి ద్వారా భారతి, గీత, మరో కొడుకును పొందాడు. రెండో సారి నటి జయమాలను వివాహమాడాడు. వీరికి సౌందర్య అనే కూతురు. ఆమెతో విడాకులు తీసుకున్నాక అంజు అనే మరో నటిని వివాహం చేసుకున్నాడు. ఆమె ద్వారా అర్జున్ అనే కొడుకు కలిగాడు. తర్వాత ఆమె కూడా విడాకులు తీసుకున్నది. నటుడిగా తీరికలేకుండా ఉన్నపుడు కొన్ని సంస్థలకు దానాలు చేశాడు. రాజకీయంగా ఎదగాలనుకున్నాడు కానీ అవి కార్యరూపం దాల్చలేదు.

1980 దశకం మధ్యలో ప్రభాకర్ కు ఒక బైక్ ప్రమాదం జరిగింది. దాంతో అతని ఆరోగ్యం దెబ్బతిన్నది. దీని కారణంగానే 2000 మొదట్లో అతనికి మల్టిపుల్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అనే వ్యాధి చుట్టు ముట్టింది.[3] చివరగా 2001 మార్చి 25 న రాత్రి 9:45 గంటలకు బెంగుళూరులో మాల్యా ఆసుపత్రిలో కన్నుమూశాడు.[4]

కెరీర్[మార్చు]

ప్రభాకర్ మొదటగా ఒకలో బడ్జెట్ చిత్రంలో ప్రతినాయకునిగా నటుడిగా తన ప్రస్థానం ప్రారంభించాడు.[5] అతని మొదటి సినిమా కాడిన రహస్య. నెమ్మదిగా స్టంటు, యాక్షన్, థ్రిల్లర్ సినిమాల్లో నటించడం ప్రారంభించాడు. హుళి హెజ్జెఅనే సినిమాలో అతను నిజం పులితో పోరాటం చేయడంతో అభిమానులు అతన్ని టైగర్ ప్రభాకర్ అని ముద్దుగా పిలుచుకుంటారు.

బాగా గుర్తింపు వచ్చిన తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా నటించడం ప్రారంభించాడు. తెలుగు సినిమాల్లో, ఎక్కువగా చిరంజీవి సినిమాల్లో ప్రతినాయకునిగా నటించడంతో తెలుగు ప్రేక్షకులు ఇతన్ని కన్నడ ప్రభాకర్ గా గుర్తించసాగారు.

తెలుగు సినిమాల జాబితా[మార్చు]

కన్నడ ప్రభాకర్ నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

  1. మంత్రి గారి వియ్యంకుడు (1983)
  2. రాక్షసుడు (1986)
  3. పసివాడి ప్రాణం (1987)
  4. రాక్షస సంహారం (1987)
  5. కొదమ సింహం (1990)
  6. జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)
  7. బ్రహ్మాస్త్రం
  8. చుట్టాలున్నారు జాగ్రత్త
  9. ముద్దాయి
  10. పట్టాభిషేకం

మూలాలు[మార్చు]

  1. "Dr. Jayamala's reaction to Vishnuvardhan – Oneindia Entertainment". Archived from the original on 2012-07-16. Retrieved 2016-11-13.
  2. "Tiger Prabhkar Dead". Archived from the original on 2017-07-20. Retrieved 2016-11-13.
  3. "My Dad Prabhakar Did not Die of Gangrene: Vinod Prabhakar". chitraloka.com. 8 April 2015. Archived from the original on 11 April 2015. Retrieved 9 April 2015.
  4. "Tiger Prabhkar Dead". chitraloka.com. 25 March 2001. Archived from the original on 6 December 2014. Retrieved 10 November 2014.
  5. "This fighter finally met his match". The Times of India. 28 March 2001.