అర్జున్ సర్జా
| అర్జున్ సర్జా | |
| జన్మ నామం | అర్జున్ సర్జా |
| జననం | 1964 ఆగస్టు 15 కర్ణాటక |
| ఇతర పేర్లు | జెంటిల్ మాన్ |
| భార్య/భర్త | నివేదిత |
| పిల్లలు | ఐశ్వర్య అర్జున్ , అంజన |
| ప్రముఖ పాత్రలు | మా పల్లెలో గోపాలుడు జెంటిల్ మాన్ శ్రీ మంజునాథ |
అర్జున్ పేరున కల మరిన్ని వ్యాసాల కొరకు అర్జున్ (అయోమయనివృత్తి) చూడండి.
అర్జున్ అనే పేరుతో ప్రసిద్ధమైన శ్రీనివాస సర్జా ఒక భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత. ప్రధానంగా తమిళ చిత్రపరిశ్రమలో, ఇంకా తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ చలనచిత్రాల్లో కూడా పనిచేశాడు. మొత్తం 160 సినిమాలకుపైగా నటించాడు. వీటిలో చాలా వరకు కథానాయక పాత్రలే.[1][2][3] 12 సినిమాలకు దర్శకత్వం వహించాడు. యాక్షన్ ప్రధానమైన చిత్రాల్లో నటించినందుకు గుర్తింపుగా ఈయనను మీడియాలో యాక్షన్ కింగ్ అనే బిరుదుతో పిలుస్తుంటారు.[4][5][6][7] భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ ఉన్న కొద్ది దక్షిణాది తారల్లో ఈయనా ఒకడు.[8][9] 2026 తెలుగు చిత్రం సీతా పయనం నకు ఆయన దర్శకత్వం, రచనలతో పాటు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరించాడు. ఇందులో అతిథి పాత్ర కూడా పోషించాడు.[10]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఇతని వివాహము నివేదితతో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు, ఐశ్వర్య సర్జా, అంజనా సర్జా. ఇతను హనుమంతుని వీర భక్తుడు. ఈ కారణం చేతనే శ్రీఆంజనేయం చిత్రంలో ఆంజనేయునిగా నటించాడు. అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా కన్నడ సినిమాల్లో నటించాడు.
అర్జున్ సినిమాలు
[మార్చు]తెలుగు
[మార్చు]- మా పల్లెలో గోపాలుడు (1985)
- మన్నెంలో మొనగాడు (1986)
- కౌబాయ్ నెం.1 (1986)
- కోనసీమ కుర్రాడు (1986)
- చిన్నారి దేవత (1987)
- తాయారమ్మ తాండవ కృష్ణ (1987)
- త్రిమూర్తులు (1987)
- మొనగాడు (1987)
- రాక్షస సంహారం (1987)
- డాక్టర్ గారి అబ్బాయ్ (1988)
- చట్టంతో చదరంగం (1988)
- వేగుచుక్క పగటిచుక్క (1988)
- సిరిపురం చిన్నోడు (1988)
- కూలీ (1988)
- ఆగష్టు 15 రాత్రి (1988)
- ప్రజాప్రతిఘటన (1990)
- జెంటిల్ మాన్ (1993)
- మావూరి మరాజు (1994)
- కోనసీమ మొనగాడు (1996)
- ద్రోహి (1995)
- గ్యాంగ్ ఫైటర్ (1996)
- శుభవార్త (1998)
- బోస్ (2000)
- టు లేడీస్ అండ్ జెంటిల్ మేన్ (2001)
- శ్రీ మంజునాథ (2001)
- హనుమాన్ జంక్షన్ (2001)
- పుట్టింటికి రా చెల్లి (2004)
- శ్రీఆంజనేయం (2004)
- స్వాగతం (2008)
- రామ రామ కృష్ణ కృష్ణ (2010)
- వాయుపుత్ర
- సింహబలుడు
- గిరి
- గ్యాంబ్లర్
- ఘరానా ఇన్ స్పెక్టర్
- ఒకే ఒక్కడు
- శివకాశి
- మరక్కార్: అరేబియా సముద్ర సింహం (2021)
- ఇద్దరు (2023)
- సీతా పయనం (2026)
తమిళం
[మార్చు]- యార్? (1985)
- ఫ్రెండ్షిప్
- శక్తి
- గోకులం (1993)
- అగత్యా (2025)
మూలాలు
[మార్చు]- ↑ "150 is just another number for this Ageless Charmer". indiaglitz. 29 July 2017. Archived from the original on 4 మే 2018. Retrieved 3 May 2018.
- ↑ "Arjun Sarja is now 150 not out". The Times of India. 15 May 2017. Retrieved 3 May 2018.
- ↑ "I've completed 150 films; let me experiment at least now". The Times of India. 22 June 2017. Retrieved 3 May 2018.
- ↑ Prasad, G (12 September 2008). "Promoting patriotism in a 'powerful' way is his style". The Hindu. Chennai, India. Archived from the original on 16 September 2008. Retrieved 5 February 2010.
- ↑ Ashok Kumar, S.R. (14 July 2005). "For king of action, direction is a passion". The Hindu. Chennai, India. Archived from the original on 11 May 2006. Retrieved 5 February 2010.
- ↑ Ashok Kumar, S.R. (26 December 2008). "Lots of action, little logic". The Hindu. Chennai, India. Archived from the original on 2 February 2009. Retrieved 5 February 2010.
- ↑ "Arjun on a Mission". The Times of India. 11 May 2009. Archived from the original on 4 November 2012. Retrieved 5 February 2010.
- ↑ "Actor Arjun crosses a new milestone". The Hans India. 30 May 2017. Retrieved 3 May 2018.
- ↑ "Arjun in Allu Arjun's next movie!". Telugu Cinema. 27 March 2017. Archived from the original on 3 May 2018. Retrieved 3 May 2018.
- ↑ "సీతా పయనం ట్రైలర్: లిఫ్ట్ అడిగితే ఓకే అన్నా." Sakshi. Retrieved 2026-02-08.
బయటి లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అర్జున్ సర్జా పేజీ