శ్రీఆంజనేయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీఆంజనేయం
దర్శకత్వము కృష్ణవంశీ
నిర్మాత కృష్ణవంశీ
రచన కృష్ణవంశీ
తారాగణం నితిన్
ఛార్మీ కౌర్
అర్జున్ సర్జా
ప్రకాశ్ రాజ్
రమ్యకృష్ణ
సంగీతం మణిశర్మ
విడుదలైన తేదీలు జూలై 24, 2004
దేశము భారతదేశం
భాష తెలుగు

శ్రీఆంజనేయం 2004 లో విడుదలైన సోషియో ఫాంటసీ తెలుగు చిత్రం.[1]

కథ[మార్చు]

రామాపురం అనే గ్రామంలో ఒక సివిల్ ఇంజనీరు (ప్రకాష్ రాజ్) సీతమ్మ తల్లి డ్యాం అనే ఆనకట్టను కట్టడానికి ప్రభుత్వం నియమిస్తుంది. ప్రాంతీయంగా ప్రాబల్యం ఉన్న ఓ రాజకీయ నాయకుడు బ్రహ్మం (పిల్ల ప్రసాద్) దాన్ని అడ్డుకుంటాడు. ఆ ఇంజనీరు బెదిరింపులకు లొంగకపోవడంతో బ్రహ్మం అతన్ని, అతని భార్యను చంపిస్తాడు. వారిద్దరి కొడుకు అంజి (నితిన్) అనాథ అవుతాడు. అతన్ని ఆ ఊరి రామాలయ పూజారి (చంద్రమోహన్) తో పాటు మిగతా గ్రామస్తులు అతన్ని పెంచి పెద్ద జేస్తారు. అంజి చిన్నప్పటి నుంచి ఆంజనేయుడికి వీరభక్తుడు.


బ్రహ్మానికి ఆ ఊర్లో 100 ఏళ్ళ పురాతనమైన గుడి అడుగున గ్రానైటు శిలలు ఉన్నాయని తెలిసి ఆ గుడిని కూల్చేసి వేరే దగ్గర కొత్త దేవాలయం నిర్మించాలని చూస్తుంటాడు. అంజి దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తాడు కానీ బ్రహ్మం దగ్గరున్న గూండాలను చూసి భయపడుతుంటాడు. ఒక రోజు ఆంజనేయ స్వామి (అర్జున్) మారు వేషంలో అంజి కర్తవ్యాన్ని గురించి చెప్పడానికి వస్తాడు. అతన్ని అప్పటి దాకా ఆగిపోయిన సీతమ్మ తల్లి డ్యాం ను మళ్ళీ ప్రారంభించేలా అతన్ని ప్రోత్సహిస్తాడు. ఈ ప్రయత్నంలో బ్రహ్మం మనుషులు అతన్ని అనేకరకాలుగా అడ్డుకుంటూ ఉంటారు. వారందరినీ ఎదుర్కొని అంజి తన కర్తవ్యాన్ని ఎలా నెరవేర్చాడన్నది మిగతా కథ.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

సంగీతం[మార్చు]

మణిశర్మ స్వరపరచిన ఈ సినిమా పాటలు మారుతి మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలయ్యాయి.

సంఖ్య. పాటసాహిత్యంగానం నిడివి
1. "ఊరేగి రావయ్య"  వేటూరి సుందరరామమూర్తిశంకర్ మహదేవన్ 5:48
2. "రామ రామ రఘురామ"  సిరివెన్నెల సీతారామశాస్త్రిమల్లికార్జున్ 5:17
3. "అవ్వాయి తువ్వాయి"  సిరివెన్నెల సీతారామశాస్త్రిటిప్పు, శ్రేయా ఘోషాల్ 4:09
4. "పూల ఘుమ ఘుమ"  సిరివెన్నెల సీతారామశాస్త్రిశ్రేయా ఘోషాల్ 5:04
5. "శ్లోకం"   కె. ఎస్. చిత్ర, కల్పన రాఘవేంద్ర 2:37
6. "తిక మక"  సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 4:50
7. "ఏ యోగమనుకోను"  సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 3:14
మొత్తం నిడివి:
31:00

మూలాలు[మార్చు]

  1. జీవి. "శ్రీ ఆంజనేయం సినిమా సమీక్ష". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Retrieved 12 December 2016.

బయటి లంకెలు[మార్చు]