ఛార్మీ కౌర్

వికీపీడియా నుండి
(చార్మి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఛార్మి

జన్మ నామంఛార్మి కౌర్
జననం మే 17, 1986
పంజాబ్, ఇండియా
క్రియాశీలక సంవత్సరాలు 2001 నుండి
భార్య/భర్త అవివాహిత

ఛార్మి సినీ రంగ ప్రవేశం అనుకోకుండా జరిగింది. ఒక రోజూ ఆమె స్వస్థలం ముంబాయిలో కాకతాళీయంగా ఛార్మిని చూసిన ఒక సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి ఆమె తల్లిదండ్రులను సంప్రదించి నీతోడు కావాలి తెలుగు సినిమాలో నటించే అవకాశం కలుగజేసాడు. అది 2001, అప్పటికి ఛార్మి వయసు 14 సంవత్సరాలు మాత్రమే. అప్పటికి ఆమె ఇంకా స్కూలు చదువుల్లోనే ఉండటం వలన సెలవులలో మాత్రమే నటించే షరతుపై ఆ చిత్రంలో నటించింది.

తొలి తెలుగు చిత్రం అంతగా విజయం సాధించకపోయినప్పటికీ ఛార్మికి వెంటనే కాదల్ కిసు కిసు అనే తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం విజయవంతమవ్వటంతో ఆమెకు వెను వెంటనే కాదల్ అళివతిల్లై, ఆహా, ఎత్న అళగు తమిళ చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. అవి కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించటంతో ఆమె తెలుగు దర్శకుడు కృష్ణ వంశీ దృష్టిలో పడింది. కృష్ణవంశీ తన శ్రీ ఆంజనేయం చిత్రం ద్వారా ఛార్మిని తెలుగు తెరకు తిరిగి పరిచయం చేశాడు. ఆ చిత్రం, దాని వెంటనే వచ్చిన నీకే మనసిచ్చాను కూడా పరాజయం పొందినప్పటికీ ఛార్మికి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. పుట్టుకతో పంజాబీ అయినప్పటికీ బొద్దుగా, అచ్చ తెలుగు పిల్లలాగ ఉండటం వల్ల అప్పటి నుండి ఆమెకు తెలుగులో విరివిగా అవకాశాలు వచ్చిపడ్డాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ అనతి కాలంలోనే ఆమె తెలుగులో అగ్ర నాయికగా ఎదిగింది.

2007 డిసెంబరులో విడుదలయిన మంత్ర ఊహించని విజయం సాధించి తెలుగు కథానాయికలలో ఛార్మికి ప్రత్యేక స్థానం కట్టబెట్టింది. సస్పెన్స్, హారర్ ప్రధానాంశాలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఛార్మి నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

ఛార్మి నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర నటీ నటులు దర్శకుడు భాష
2013 సేవకుడు శ్రీకాంత్ వి. సముద్ర తెలుగు
2005 జ్యోతిలక్ష్మీ జ్యోతిలక్ష్మీ సత్యదేవ్ కంచరాన పూరి జగన్నాధ్ తెలుగు
2009 మనోరమ గీతాంజలి/గిలి నిషాన్ వి.ఈశ్వరరెడ్డి తెలుగు
2008 సకుటుంబ సపరివార సమేతం శ్రీకాంత్ తెలుగు
ఇంకా పేరు పెట్టని ద్విభాషా చిత్రం (నిర్మాణంలో ఉంది) అరవింద్ తెలుగు, తమిళం
మైకేల్ మదన కామరాజు శ్రీకాంత్, ప్రభు దేవా 'నిధి' ప్రసాద్ తెలుగు
సుందరకాండ పింకీ అల్లరి నరేష్ బాపు తెలుగు
2007 మంత్ర మంత్ర శివాజీ, కౌష తులసీ రామ్ తెలుగు
లవ కుశ ఉపేంద్ర, శివరాజ్ కుమార్, జెన్నిఫర్ కొత్వాల్, రుతిక ఓం సాయి ప్రకాష్ కన్నడం
2006 రాఖీ గౌరి ఎన్. టి. ఆర్. జూనియర్ కృష్ణ వంశీ తెలుగు
చిన్నోడు సుమంత్ కన్మణి తెలుగు
పౌర్ణమి చంద్రకళ ప్రభాస్, త్రిష ప్రభు దేవా తెలుగు
స్టైల్ లారెన్స్, ప్రభు దేవా, కమలిని ముఖర్జీ లారెన్స్ తెలుగు
లక్ష్మీ శైలజ వెంకటేష్, నయన తార వి. వి. వినాయక్ తెలుగు
చుక్కల్లో చంద్రుడు సంధ్య సిద్ధార్థ్, సదా, సలోని శివకుమార్ తెలుగు
2005 అల్లరి పిడుగు సుబ్బలక్ష్మి బాల కృష్ణ, కత్రినా కైఫ్ జయంత్ పరాంజీ తెలుగు
పొలిటికర్ రౌడీ కావేరి మోహన్ బాబు, అబ్బాస్, ప్రకాష్ రాజ్ తెలుగు
అనుకోకుండా ఒక రోజు సహస్ర జగపతి బాబు, శశాంక్, పూజా భారతి చంద్రశేఖర్ ఏలేటి తెలుగు
చక్రం లక్ష్మి ప్రభాస్, అసిన్, ప్రకాష్ రాజ్ కృష్ణ వంశీ తెలుగు
2004 మాస్ ప్రియ నాగార్జున లారెన్స్ తెలుగు
చంటి రవితేజ శోభన్ తెలుగు
గౌరి శ్వేత సుమంత్ బి. వి. రమణ తెలుగు
కాట్టు చంపగం మలయాళం
శ్రీ ఆంజనేయం పద్దు నితిన్ కృష్ణవంశీ తెలుగు
2003 నీకే మనసిచ్చాను శ్రీకాంత్ తెలుగు
కుర్రాడొచ్చాడు శింబు టి. రాజేందర్ తెలుగు
ఆహా, ఎత్నై అళగు తమిళం
2002 కాదల్ అళివతిల్లై తమిళం
కాదల్ కిసు కిసు తమిళం
2001 నీతోడు కావాలి మానస తెలుగు

మూలాలు

[మార్చు]