నందమూరి బాలకృష్ణ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
నందమూరి బాలకృష్ణ | |
---|---|
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు | |
In office 2014–ప్రస్తుతం | |
నియోజకవర్గం | హిందూపురం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | నందమూరి బాలకృష్ణ 1960 జూన్ 10 ఆంధ్రప్రదేశ్, ఇండియా |
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ |
జీవిత భాగస్వామి | వసుంధర [1] |
సంతానం | కుమార్తెలు : బ్రాహ్మణి, తేజస్విని కుమారుడు : తారకరామ తేజ మోక్షజ్ఞ |
తల్లి | బసవ రామతారకం |
తండ్రి | నందమూరి తారక రామారావు |
నివాసం | హైదరాబాదు,తెలంగాణ |
వృత్తి | నటుడు నిర్మాత రాజకీయ నాయకుడు |
నందమూరి బాలకృష్ణ (జననం: 1960 జూన్ 10) ఒక తెలుగు సినిమా నటుడు, నిర్మాత, శాసనసభ సభ్యుడు. బాలకృష్ణ వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో చేయుటకు ప్రసిద్ధి. తన సినీజీవితంలో ఎన్నో తెలుగు సినిమాలు చెయ్యడం వలన తెలుగువారికి సుపరిచితుడు. ఇతను నందమూరి తారకరామారావు కుమారుడు. ప్రస్తుతం ఆయన శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం ఎం.ఎల్.ఏగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]బాలకృష్ణ బాల్యం హైదరాబాదులో గడిచింది. ఇంటర్మీడియట్ చదువు పూర్తయిన వెంటనే నటుడు కావాలని కోరుకున్నాడు. కానీ కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయాలనే తండ్రి కోరికను మన్నించి నిజాం కళాశాలలో డిగ్రీ చదివాడు.[2]
కెరీర్
[మార్చు]బాలకృష్ణ పద్నాలుగేళ్ళ వయసులో తండ్రి ఎన్. టి. ఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మకల (1974) చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. మొదట్లో వివిధ సినిమాల్లో సహాయనటుడిగా కనిపించాడు. తర్వాత తండ్రితో కలిసి నటించిన చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. కథానాయకుడు కాకముందు బాలకృష్ణ నటించిన తాతమ్మ కల, దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీమద్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలకు ఎన్. టి. ఆర్ దర్శకత్వం వహించాడు. 2021 లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ వారి కలయికలో మూడవ సినిమా ఎన్టీ రామారావు గారి 12 మంది సంతానంలో బాలకృష్ణ ఆరవ కుమారుడు చిన్నతనంలోనే సినిమాలలోకి ప్రవేశించిన బాలకృష్ణ ఇప్పటికీ వంద కన్నా ఎక్కువ సినిమాల్లో నటించారు. 16 సంవత్సరాల వయసులో అన్నదమ్ముల అనుబంధం అనే సినిమాలో నటించారు. 1984లో సాహసమే జీవితం అనే సినిమాలో మొట్టమొదటిసారిగా హీరోగా నటించడం జరిగింది. బాలకృష్ణ తన కెరీర్ ప్రారంభంలో నటించినా సినిమాలలో సాహసమే జీవితం జననీ జన్మభూమి మంగమ్మగారి మనవడు అపూర్వ సహోదరుడు మువ్వగోపాలుడు ముద్దుల మామయ్య సినిమాలు విజయవంతమయ్యాయి. తెలుగులో మొట్టమొదటి సారిగా తీసిన సైపై సినిమా ఆదిత్య 36 9 లో బాలకృష్ణ పాత్రను, కథను చాలామంది మెచ్చుకున్నారు. రాబోయే కాలంలో జరిగే మార్పులను చాలావరకు ఆ రోజుల్లోనే అంచనా వేశారని చెప్పవచ్చు. 2019 వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారి బయోగ్రఫీ ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమాలలో తన తండ్రి పాత్రను పోషించాడు.[3]
పురస్కారాలు
[మార్చు]- 1994 లో భైరవద్వీపం చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ అవార్డు.
- 2నరసింహ నాయుడు (2001), సింహా ( 2010)లెజెండ్ (2014) ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు.
- నరసింహనాయుడు చిత్రానికి గాను సినీగోయర్స్ అసోసియేషన్ బెస్ట్ యాక్టర్ అవార్డు.
- 2007 లో అక్కినేని అభినయ పురస్కారంతో సత్కరించారు.
- పాండు రంగడు, సింహా, శ్రీరామరాజ్యం చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా భరతముని అవార్డు.
- లెజెండ్ చిత్రానికి గాను 2014 ఉత్తమ కథనాయకునిగా SICA అవార్డు.నంది అవార్డు కూడా
లెజెండ్ మూవీకి వచ్చింది.
రాజకీయ ప్రవేశం
[మార్చు]నటించిన చిత్రాలు
[మార్చు]క్రమ సంఖ్య | సినిమా పేరు | సంవత్సరం | సహ నటీనటులు | సంస్థ | దర్శకులు | ఇతరములు |
---|---|---|---|---|---|---|
1 | తాతమ్మకల | 1974 | ఎన్.టి.ఆర్, భానుమతి | రామకృష్ణా సినీ స్టూడియోస్ | దాసరి నారాయణరావు | |
2 | రాం రహీమ్ | 1974 | రోజారమణి | రాజలక్ష్మి కంబైన్స్ | బి.ఎ.సుబ్బారావు | |
3 | అన్నదమ్ముల అనుబంధం | 1975 | లత | గజలక్ష్మి చిత్ర | ఎస్.డి.లాల్ | |
4 | వేములవాడ భీమకవి | 1975 | ఎన్.టి.ఆర్,షావుకారు జానకి | రామకృష్ణా సినీ స్టూడియోస్ | డి.యోగానంద్ | |
5 | దాన వీర శూర కర్ణ | 1977 | దీప | రామకృష్ణా సినీ స్టూడియోస్ | ఎన్.టి. రామారావు | |
6 | అక్బర్ సలీం అనార్కలి | 1979 | దీప | తారకరామ ఫిలిం యునిట్ | ఎన్.టి. రామారావు | |
7 | శ్రీమద్విరాట్ పర్వం | 1979 | వాణిశ్రీ, ప్రభ, విజయలలిత | రామకృష్ణా సినీ స్టూడియోస్ | ఎన్.టి. రామారావు | |
8 | శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం | 1979 | ఎన్.టి. రామారావు,జయప్రద,జయసుధ | రామకృష్ణా సినీ స్టూడియోస్ | ఎన్.టి. రామారావు | |
9 | రౌడీ రాముడు కొంటె కృష్ణుడు | 1980 | రాజ్యలక్ష్మి | రామకృష్ణా సినీ స్టూడియోస్ | కె. రాఘవేంద్ర రావు | |
10 | అనురాగ దేవత | 1982 | ఎన్.టి. రామారావు,శ్రీదేవి,జయసుధ | రామకృష్ణా సినీ స్టూడియోస్ | తాతినేని రామారావు | |
11 | సింహం నవ్వింది | 1983 | ఎన్.టి. రామారావు,శ్రీదేవి | రామకృష్ణా సినీ స్టూడియోస్ | డి. యోగానంద్ | |
12 | సాహసమే జీవితం | 1984 | విజ్జి | గజలక్ష్మి కంబైన్స్ | వాసు | |
13 | డిస్కో కింగ్ | 1984 | తులసి | శ్రీవిష్ణు ఫిలింస్ | తాతినేని ప్రసాద్ | డిస్కో డ్యాన్సర్ అనే హిందీ సినిమా రిమేక్ |
14 | జనని జన్మభూమి | 1984 | సుమలత | శ్రీ బ్రమరాంబా ఫిలింస్ | కె. విశ్వనాథ్ | |
15 | మంగమ్మ గారి మనవడు | 1984 | సుహాసిని | భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ | కోడి రామకృష్ణ | మన్ వాసనయి అనే సినిమా రిమేక్ |
16 | పల్నాటి పులి | 1984 | భానుప్రియ | శ్రీ సాయి చక్ర ప్రొడక్షన్ | తాతినేని ప్రసాద్ | |
17 | శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర | 1984 | రతి అగ్నిహోత్రి | రామకృష్ణా సినీ స్టూడియోస్ | ఎన్.టి. రామారావు | |
18 | కథానాయకుడు | 1984 | విజయశాంతి | సురేష్ ప్రొడక్షన్స్ | కె. మురళీమోహనరావు | |
19 | ఆత్మబలం (1985 సినిమా) | 1985 | భానుప్రియ | శ్రీ వల్లీ ప్రొడక్షన్స్ | తాతినేని ప్రసాద్ | కర్జ్ అనే సినిమా రిమేక్ |
20 | బాబాయి అబ్బాయి | 1985 | అనితారెడ్డి | ఉషోదయ మూవీస్ | జంధ్యాల | |
21 | భార్య భర్తల బంధం | 1985 | రజని | జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ | వి.బి. రాజేంద్రప్రసాద్ | |
22 | భలే తమ్ముడు | 1985 | ఊర్వశి | శ్రీ సత్య చిత్ర | పరుచూరి బ్రదర్స్ | |
23 | కత్తుల కొండయ్య | 1985 | సుమలత | ప్రసన్న ఆర్ట్స్ | ఎస్.బి.చక్రవర్తి | |
24 | పట్టాభిషేకం | 1985 | విజయశాంతి | రామకృష్ణా సినీ స్టూడియోస్ | కె. రాఘవేంద్ర రావు | |
25 | నిప్పులాంటి మనిషి | 1986 | రాధ | శ్రీ రాజలక్ష్మి ఆర్ట్స్ పిక్చర్స్ | ఎస్.బి.చక్రవర్తి | ఖయామత్ కి రిమేక్ |
26 | ముద్దుల కృష్ణయ్య | 1986 | రాధ | భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్ | కోడి రామకృష్ణ | |
27 | సీతారామ కళ్యాణం | 1986 | రజని | యువ చిత్ర | జంధ్యాల | |
28 | అనసూయమ్మ గారి అల్లుడు | 1986 | భానుప్రియ | రామకృష్ణా సినీ స్టూడియోస్ | ఎ. కోదండరామిరెడ్డి | |
29 | దేశోద్ధారకుడు | 1986 | విజయశాంతి | విజయభాస్కర్ ఫిలిం ప్రొడక్షన్స్ | ఎ. కోదండరామిరెడ్డి | |
30 | కలియుగ కృష్ణుడు | 09.05. 1986 | రాధ | విశ్వనాథ్ ఎంటర్ ప్రైజెస్ | కె.మురళీమోహనరావు | |
31 | అపూర్వ సహోదరులు | 1986 | విజయశాంతి, భానుప్రియ | ఆర్ కే అసోసియేట్స్ | కె. రాఘవేంద్ర రావు | |
32 | భార్గవ రాముడు | 1987 | విజయశాంతి | దేవి కమల్ మూవీస్ | ఎ. కోదండరామిరెడ్డి | |
33 | రాము | 1987 | రజని | సురేష్ ప్రొడక్షన్స్ | వై.నాగేశ్వరరావు | |
34 | అల్లరి కృష్ణయ్య | 1987 | భానుప్రియ | వనిత ఆర్ట్స్ | నందమూరి రమేష్ | |
35 | సాహస సామ్రాట్ | 1987 | విజయశాంతి | దేవి కమల్ మూవీస్ | కె. రాఘవేంద్ర రావు | |
36 | ప్రెసిడెంట్ గారి అబ్బాయి | 1987 | సుహాసిని | ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ | వై.నాగేశ్వరరావు | |
37 | మువ్వ గోపాలుడు | 19.06.1987 | విజయశాంతి, శోభన | భార్గవ్ ఆర్ట్ పిక్చర్స్ | కోడి రామకృష్ణ | |
38 | భానుమతిగారి మొగుడు | 18.11.1987 | విజయశాంతి | డి వి ఎస్ ఎంటర్ ప్రైజెస్ | వై.నాగేశ్వరరావు | |
39 | ఇన్స్‌పెక్టర్ ప్రతాప్ | 1988 | విజయశాంతి | కృష్ణచిత్ర | ముత్యాల సుబ్బయ్య | |
40 | దొంగరాముడు | 1988 | మోహన్ బాబు | గోపి ఆర్ట్ పిక్చర్స్ | కె. రాఘవేంద్రరావు | |
41 | తిరగబడ్డ తెలుగు బిడ్డ | 1988 | భానుప్రియ | తేజస్వి ప్రొడక్షన్ | ఎ. కోదండరామిరెడ్డి | |
42 | భారతంలో బాలచంద్రుడు | 1988 | భానుప్రియ | జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ | కోడి రామకృష్ణ | |
43 | రాముడు భీముడు | 1988 | రాధ, సుహాసిని | సత్యం సినీ ఎంటర్ ప్రైజెస్ | కె.మురళీమోహనరావు | |
44 | రక్తాభిషేకం | 1988 | రజని | రాజీవ్ ప్రొడక్షన్ | ఎ. కోదండరామిరెడ్డి | |
45 | భలే దొంగ | 1989 | విజయశాంతి | తారకరామ ప్రొడక్షన్ | ఎ. కోదండరామిరెడ్డి | |
46 | ముద్దుల మావయ్య | 1989 | విజయశాంతి | భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్ | కోడి రామకృష్ణ | తమిళ సినిమా రీమేక్ |
47 | అశోక చక్రవర్తి | 1989 | భానుప్రియ | శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ | ఎస్.ఎస్.రవిచంద్ర | మలయాళ చిత్రం ఆర్యన్ రీమేక్ |
48 | బాల గోపాలుడు | 1989 | సుహాసిని | పి.బి. ఆర్ట్ ప్రొడక్షన్ | కోడి రామకృష్ణ | |
49 | ప్రాణానికి ప్రాణం | 1990 | రజని | హరీష్ ఎంటర్ ప్రైజెస్ | చలసాని రామారావు | |
50 | నారీ నారీ నడుమ మురారి | 1990 | శోభన,నిరోషా | యువ చిత్ర | ఎ. కోదండరామిరెడ్డి | |
51 | ముద్దుల మేనల్లుడు | 1990 | విజయశాంతి | భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్ | కోడి రామకృష్ణ | |
52 | లారీ డ్రైవర్ | 1990 | విజయశాంతి | జయ ప్రొడక్షన్ | బి. గోపాల్ | |
53 | తల్లిదండ్రులు | 1991 | విజయశాంతి | ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ | తాతినేని రామారావు | |
54 | బ్రహ్మర్షి విశ్వామిత్ర | 1991 | మీనాక్షి శేషాద్రి | బసవ తారకం మెడికల్ ట్రస్ట్ | ఎన్.టి. రామారావు | |
55 | ఆదిత్య 369 | 1991 | మోహిని | శ్రీ దేవీ మూవీస్ | సింగీతం శ్రీనివాసరావు | |
56 | ధర్మక్షేత్రం | 1992 | దివ్యభారతి | శ్రీ రాజీవ్ ప్రొడక్షన్ | ఎ. కోదండరామిరెడ్డి | |
57 | రౌడీ ఇన్‌స్పెక్టర్ | 1992 | విజయశాంతి | విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ | బి. గోపాల్ | |
58 | అశ్వమేధం | 1992 | నగ్మా, మీనా | వైజయంతి మూవీస్ | కె. రాఘవేంద్రరావు | |
59 | నిప్పురవ్వ | 1993 | విజయశాంతి | యువరత్నా ఆర్ట్స్ | ఎ. కోదండరామిరెడ్డి | |
60 | బంగారు బుల్లోడు | 1993 | రమ్యకృష్ణ, రవీనా టాండన్ | జగపతి ఆర్ట్ పిక్చర్స్ | రవిరాజా పినిశెట్టి | |
61 | భైరవ ద్వీపం | 1994 | రోజా | చందమామ విజయ కంబైన్స్ | సింగీతం శ్రీనివాసరావు | |
62 | గాండీవం | 1994 | రోజా | శ్రీ లక్ష్మీ నరసింహ కంబైన్స్ | ప్రియదర్శన్ | |
63 | బొబ్బిలి సింహం | 1994 | రోజా, మీనా | విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ | ఎ. కోదండరామిరెడ్డి | |
64 | టాప్ హీరో | 1994 | సౌందర్య | శ్రీ చిత్ర క్రియేషంస్ | ఎస్.వి.కృష్ణారెడ్డి | |
65 | మాతో పెట్టుకోకు | 1995 | రోజా, రంభ | భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్ | ఎ. కోదండరామిరెడ్డి | |
66 | వంశానికొక్కడు | 1996 | ఆమని | శ్రీ దేవి మూవీస్ | శరత్ వి | |
67 | శ్రీ కృష్ణార్జున విజయం | 1996 | రోజా | చందమామ విజయ కంబైన్స్ | సింగీతం శ్రీనివాసరావు | |
68 | పెద్దన్నయ్య | 1997 | రోజా, ఇంద్రజ | రామకృష్ణా హార్టీకల్చరల్ సినీ స్టూడియోస్ | శరత్ | |
69 | ముద్దుల మొగుడు | 1997 | మీనా | రమా ఫిలిమ్స్ | ఎ. కోదండరామిరెడ్డి | |
70 | దేవుడు | 1997 | రమ్యకృష్ణ, కాంచన | శ్రీ చిత్ర క్రియేషన్స్ | రవిరాజా పినిశెట్టి | |
71 | యువరత్న రాణా | 1998 | హీరా | ఋగ్వేద ప్రొడక్షన్స్ | ఎ. కొదండరామిరెడ్డి | |
72 | పవిత్రప్రేమ | 1998 | లైలా, రోషిణి | శ్రీనివాస ప్రొడక్షన్స్ | ముత్యాల సుబ్బయ్య | |
73 | సమరసింహా రెడ్డి | 1999 | అంజలా జవేరీ, సిమ్రాన్, సంఘవి | శ్రీ సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్ | బి. గోపాల్ | |
74 | సుల్తాన్ | 1999 | రోజా, రచన | పి.బి. ఆర్ట్స్ | శరత్ | |
75 | కృష్ణ బాబు | 1999 | మీనా, రాశి | శ్రీనివాస ప్రోడక్షన్ | ముత్యాల సుబ్బయ్య | |
76 | వంశోద్ధారకుడు | 2000 | రమ్యకృష్ణ, ఆమని | గాయత్రి ఫిలింస్ | సరత్ | |
77 | గొప్పింటి అల్లుడు | 2000 | సిమ్రాన్ | రామకృష్ణా సినీ స్టూడియోస్ | ఇ.వి.వి.సత్యనారాయణ | |
78 | నరసింహ నాయుడు | 2001 | సిమ్రాన్, ప్రీతి జింఘానియా | శ్రీ వెంకటరమణ ప్రొడక్షన్ | బి. గోపాల్ | |
79 | భలేవాడివి బాసు | 2001 | అంజలా జవేరి,శిల్పా శెట్టి | శ్రీదేవీమూవీస్ | పి ఎ అరుణ్ ప్రసద్ | |
80 | సీమ సింహం | 2002 | సిమ్రాన్, రీమా సేన్ | బాలాజీ క్రియేషన్స్ | రామ్ ప్రసాద్ | |
81 | చెన్నకేశవరెడ్డి | 2002 | టబు, శ్రియా సరన్ | శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్ | వి.వి.వినాయక్ | |
82 | పల్నాటి బ్రహ్మ నాయుడు | 2003 | ఆర్తి అగర్వాల్, సొనాలీ బింద్రె | శ్రీ వెంకట రమణ ప్రోడక్షన్ | బి. గోపాల్ | |
83 | లక్ష్మీ నరసింహా | 2004 | ఆసిన్ | శ్రీ సాయిగణేష్ ప్రోడక్షన్ | జయంత్ సి పరాన్జీ | తమిళ చిత్రం సామి రీమేక్ |
84 | విజయేంద్ర వర్మ | 2004 | లయ, అంకిత, సంగీత | ఆదిత్య ప్రోడక్షన్ | స్వర్ణ సుబ్బారావు | |
85 | అల్లరి పిడుగు | 2005 | కత్రినా కైఫ్, ఛార్మి | పి.బి ఆర్ట్స్ | జయంత్ సి పరాన్జీ | |
86 | వీరభద్ర | 2006 | తనూశ్రీ దత్తా, సదా | అంబిక సినిమా ప్రొడక్షన్స్ | ఎస్. రవికుమార్ చౌదరి | |
87 | మహారథి | 2007 | స్నేహ, మీరా జాస్మిన్ | శ్రీ లలిత కళాంజలి ప్రొడక్షన్స్ | పి. వాసు | |
88 | ఒక్క మగాడు | 2008 | అనుష్క,సిమ్రాన్ | బొమ్మరిల్లు | వై. వి. ఎస్. చౌదరి | |
89 | పాండురంగడు | 2008 | స్నేహ, తబు | అర్.కె. ఫిలిమ్ అసోసియేషన్ | కె. రాఘవేంద్రరావు | |
90 | మిత్రుడు | 2009 | ప్రియమని | వైష్ణవి సినిమా | మహదేవ్ | |
91 | సింహా | 2010 | నయనతార, స్నేహా ఉల్లాల్ | యునైటెడ్ మూవీస్ | బోయపాటి శ్రీను | |
92 | పరమ వీర చక్ర | 2011 | అమీషా పటేల్, నేహా ధుపియ, షీలా | తేజ సినిమా | దాసరి నారాయణ రావు | |
93 | శ్రీరామరాజ్యం | 2011 | నయనతార | శ్రీ సాయిబాబా మూవీస్ | బాపు | |
94 | అధినాయకుడు | 2012 | లక్ష్మీ రాయ్ | శ్రీ కీర్తీ క్రీయేషన్స్ | పరుచూరి మురళి | |
95 | ఊ..కొడతారా ఉలిక్కిపడతారా | 2012 | పంచిబొర | మంచు ఎంటర్ టైన్ మెంట్ | శేకర్ రాజ | |
96 | శ్రీమన్నారాయణ | 2012 | పార్వతి మెల్టన్, ఇషా చావ్లా | యెల్లోఫ్లవర్స్ | రవి చావలి | |
97 | లెజెండ్ | 2014 | సొనల్ చౌహన్, రథిక అప్తే | 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ వారాహి చలన చిత్రం | బోయపాటి శ్రీను | |
98 | లయన్ | 2015 | త్రిష, రథిక అప్తే | రుద్రపాటి రమణ రావు | సత్యదేవ్ | |
99 | డిక్టేటర్ | 2016 | సొనల్ చౌహన్, అంజలి | ఎరోస్ ఇంటర్నేషనల్ | శ్రీవాస్ | |
100 | గౌతమీపుత్ర శాతకర్ణి (సినిమా) | 2017 | శ్రియా సరన్ | క్రిష్ | ||
101 | పైసా వసూల్ | 2017 | శ్రియా సరన్ | భవ్య క్రియేషన్స్ | పూరి జగన్నాథ్ | |
102 | జై సింహ | 2018 | నయనతార | కె. ఎస్. రవికుమార్ | ||
103 | ఎన్.టి.ఆర్. కథానాయకుడు | 2019 | ఎన్.బి.కె. ఫిల్స్మ్ | క్రిష్ | ||
104 | ఎన్.టి.ఆర్. మహానాయకుడు | 2019 | ఎన్.బి.కె. ఫిల్స్మ్ | క్రిష్ | ||
105 | రూలర్ | 2019 | సోనాల్ చౌహాన్, వేదిక | సి.కె. ఎంటర్టైన్మెంట్స్ హ్యాపీ మూవీస్ |
కె. ఎస్. రవికుమార్ | |
106 | అఖండ | 2021 | ప్రగ్య జైస్వాల్ | ద్వారక క్రియేషన్స్ | బోయపాటి శ్రీను | |
107 | వీర సింహా రెడ్డి | 2023 | శృతి హాసన్, శ్రీలీల | మైత్రీ మూవీ మేకర్స్ | గోపీచంద్ మలినేని | |
108 | భగవంత్ కేసరి | 2023 | కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్, శ్రీలీల | షైన్ స్క్రీన్ | అనిల్ రావిపూడి | |
109 | డాకు మహారాజ్ | 2024 | ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్ | సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా | బాబీ | |
నర్తనశాల | 2020 | సౌందర్య | ఎన్.బి.కె. ఫిల్స్మ్ | బాలకృష్ణ | విడుదల కాలేదు |
పురస్కారాలు
[మార్చు]- 2014: ఉత్తమ నటుడు - లెజెండ్
మూలాలు
[మార్చు]- ↑ "Balakrishna and Vasundhara Wedding Card బాలకృష్ణ - వసుంధర గార్ల పెళ్లి ఆహ్వాన పత్రిక". Telugu Adda. 2023-12-27.
- ↑ "బాలకృష్ణ గురించి ఈ విశేషాలు మీకు తెలుసా?". www.eenadu.net. Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.
- ↑ "Balakrishna: I fully trust in Boyapati Sreenu". TeluguBulletin.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-03-13. Retrieved 2022-03-21.
బయటి లింకులు
[మార్చు]- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- విస్తరించవలసిన వ్యాసాలు
- Pages using infobox officeholder with unknown parameters
- నందమూరి కుటుంబం
- నంది పురస్కారాలు
- 1960 జననాలు
- నంది ఉత్తమ నటులు
- తెలుగు సినిమా నటులు
- తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు
- జీవిస్తున్న ప్రజలు
- రాజకీయాలలో సినీనటులు
- ఫిలింఫేర్ అవార్డుల విజేతలు
- నిజాం కళాశాల పూర్వవిద్యార్ధులు
- అనంతపురం జిల్లా రాజకీయ నాయకులు
- కృష్ణా జిల్లా సినిమా నటులు
- కృష్ణా జిల్లా సినిమా నిర్మాతలు
- అనంతపురం జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2014)
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2019)
- సినీ వారసత్వం గల తెలుగు సినిమా వ్యక్తులు