ప్రగ్యా జైస్వాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రగ్యా జైస్వాల్
Pragya Jaiswal CCL.jpg
సి.సి.ఎల్.-4 ప్రారంభోత్సవ కార్యక్రమంలో
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం
ఎత్తు5' 8"

ప్రగ్యా జైస్వాల్ భారతీయ చలనచిత్ర నటి, మోడల్. తెలుగు, హిందీ చిత్రాలలో నటించారు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

జైస్వాల్ మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించింది. పూణే లోని సింబయాసిస్ లా స్కూల్ లో చదివింది. సింబయాసిస్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోజుల్లో వివిధ రకాల అందాల పోటీలలో పాల్గొని విజయవంతమైన మోడగా ఎదిగింది. కళ, సంస్కృతిరంగంలో ఆమె సాధించిన విజయానికిగాను 2014, జనవరి 22న కోసం సింబయాసిస్ సాంస్కృటిక్ పురస్కారం అందుకుంది.

ఫెమినా మిస్‌ ఇండియా 2008 పోటీల్లో పాల్గొని ‘మిస్‌ ఫ్రెష్‌ ఫేస్‌’, ‘మిస్‌ డాన్సింగ్‌ క్వీన్‌’, ‘మిస్‌ ఫ్రెండ్‌ ఆఫ్‌ ఎర్త్‌’ టైటిళ్లను గెలుచుకుంది.‘దవ్‌’, ‘డాబర్‌ వాటికా’, ‘మిలీనియమ్‌ హైపర్‌ మార్కెట్‌ ఫర్‌ దుబాయ్‌’, ‘రిలయన్స్‌ డిజిటల్‌’, ‘ఎఫ్‌బీబీ’ వంటి ఎన్నో పాపులర్‌ బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా చేసింది.

సినిమా జీవితం[మార్చు]

2014లో తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం ‘డేగ’లో అవకాశం లభించింది. ఆ తరవాత ‘టిట్టూ ఎంబీఎ’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంటరిచ్చింది. అలా ఒకే సంవత్సరంలో తమిళం, తెలుగుతో పాటు హిందీలో కూడా తెరంగేట్రం చేసింది.2015 ఆమె తెలుగులో వచ్చిన మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. తరువాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో నటించింది. జైస్వాల్ గతంలో క్రిష్ తీసిన గబ్బర్ ఈజ్ బ్యాక్ అనే సినిమాలోని పాత్రకోసం ఆడిషన్ ఇచ్చింది. అయితే, ఆసినిమాలో ఆమెకు పాత్ర లభించలేదు. క్రిష్ తరువాతి చిత్రమైన కంచెలో హీరోయిన్ పాత్ర ఇచ్చాడు.

డోవ్ షాంపూ, రిలయన్స్ డిజిటల్, FBB (బిగ్ బజార్ వద్ద ఫ్యాషన్), డాబర్ వాటిక యాంటీ చుండ్రు షాంపూ, దుబాయ్, UAE కోసం మిలీనియం, హైపెర్ మార్కెట్, హెల్త్ డ్రింక్, మలబార్ గోల్డ్ మొదలైన సంస్థలకు బ్రాండ్ అంబాడిజర్ గా చేసింది. ప్రస్తుతం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు బ్రాండ్ అంబాసిడర్ చేస్తుంది.

అభిరుచులు[మార్చు]

ప్రగ్య చక్కటి గాయని. నృత్యమంటే ఎంతో ఇష్టం. హీరోల్లో చిరంజీవి, అల్లుఅర్జున్‌, నాగార్జున అంటే ప్రత్యేక అభిమానం, హీరోయిన్లలో అనుష్క, మాధురీ దీక్షిత్‌లను ఆరాధిస్తుంది. ఇష్టమైన రంగులు నలుపు, తెలుపు, ఎరుపు. ఫేవరెట్‌ డెస్టినేషన్‌ లండన్‌.

చిత్ర సమహారం[మార్చు]

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2014 టిట్టూ ఎం.బి.ఎ గుల్షన్ హిందీ
2014 డేగ /విరట్టు మవి తెలుగు/తమిళం
2015 మిర్చిలాంటి కుర్రాడు వసుంధర తెలుగు
2015 కంచె సీత తెలుగు
2017 ఓం నమో వేంకటేశాయ భావాని తెలుగు
2017 గుంటూరోడు అమృత తెలుగు
2017 నక్షత్రం (సినిమా) కిరణ్ తెలుగు
2017 జయ జానకీ నాయకా ఫల్గుణా తెలుగు
2018 ఆచారి అమెరికా యాత్ర తెలుగు
2018 సైరా తెలుగు/తమిళం
2021 అఖండ తెలుగు [1]

పురస్కారాలు[మార్చు]

సంవత్సరం అవార్డు సినిమా పేరు
2016 జీ తెలుగు అప్సర అవార్డు "ఫైండ్ ఆఫ్ ది ఇయర్" కంచె
18వ ఉగాది పురస్కారం - ఉత్తమ తొలి చిత్ర నటి
సినిమా అవార్డ్స్ 2016 – ఉత్తమ తొలి చిత్ర నటి
ఫిలింఫైర్ అవార్డు 2016[2] – ఉత్తమ తొలి చిత్ర నటి (తెలుగు)
సైమా అవార్డు 2016 – ఉత్తమ తొలి చిత్ర నటి (తెలుగు)

మూలాలు[మార్చు]

  1. Mana Telangana (26 November 2021). "కథ వినకుండానే ఓకే చెప్పా". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.
  2. నేటిఏపి.కాం. "'ప్రగ్యా జైస్వాల్' విషయంలో 'ఫిల్మ్ ఫేర్' కమిటీ పొరపాటు చేసిందా..?". www.netiap.com. Archived from the original on 27 సెప్టెంబరు 2016. Retrieved 24 September 2016.

ఇతర లంకెలు[మార్చు]