నక్షత్రం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నక్షత్రం
Nakshatram film poster.jpg
Film poster
దర్శకత్వంకృష్ణవంశీ
రచనకృష్ణవంశీ
నిర్మాతకె. శ్రీనివాసులు
ఎస్. వేణుగోపాల్
సజ్జు
తారాగణంసందీప్ కిషన్
రెజీనా
సాయి ధరమ్ తేజ్
ప్రగ్యా జైస్వాల్
ప్రకాష్ రాజ్
కూర్పుశివ వై ప్రసాద్
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థలు
శ్రీ చక్ర్ర మీడియా
బుట్ట బొమ్మ క్రియేషన్స్
విన్ విన్ క్రియేషన్స్[1]
విడుదల తేదీ
2017 ఆగస్టు 4
దేశంభారత్
భాషతెలుగు

నక్షత్రం 2017 ఆగస్టు 4న విడుదదలైన తెలుగు చిత్రం.

కథ[మార్చు]

రామారావు (సందీప్ కిషన్) తండ్రి, తాత పోలీసులు. దాంతో ఎస్ ఐ కావాల‌న్న‌ది రామారావు, అత‌ని త‌ల్లి (తుల‌సి) క‌ల‌. రామారావు మావ‌య్య (శివాజీరాజా) కూడా పోలీసే. అత‌ని కూతురు (రెజీనా) సినిమాల్లో నృత్యకారిణి. యాంక‌ర్‌గానూ చేస్తుంటుంది. రామారావు ఎస్ ఐ అయితే పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంటుంది. స్వ‌త‌హాగా పోలీసుల‌ను ఇష్ట‌ప‌డే రామారావు ఓ రోజు క‌మిష‌న‌ర్ కొడుకు రాహుల్‌(త‌నీష్‌) పోలీసుల‌ను అవ‌మానించాడ‌ని గొడ‌వ‌కు దిగుతాడు. ఇద్ద‌రూ క‌ల‌బ‌డ‌తారు. ఆ ద్వేషం క‌మిష‌న‌ర్ కుమారుడు రాహుల్ మ‌న‌సులో ఉంటుంది. రామారావు మీద ప‌గ తీర్చుకోవ‌డం కోసం అత‌ని చివ‌రి అవకాశం అయిన ఎస్ ఐ దేహదారుఢ్య పరీక్షకు వెళ్ల‌నీయ‌కుండా అడ్డుప‌డ‌తాడు. అయినా చివ‌రికి రామారావు ఎస్ ఐ అవుతాడు. ఈ క‌థ‌లో మ‌ధ్య‌లో అలెగ్జాండ‌ర్ (సాయి ధరమ్ తేజ్), అత‌ని ప్రేయ‌సి (ప్రగ్యా జైస్వాల్) కూడా ఉంటారు. వారిద్ద‌రు ఎవ‌రు? వారికీ రామారావుకు సంబంధం ఏంటి? క‌మిష‌న‌ర్ (ప్రకాష్ రాజ్), హోమ్ మినిస్ట‌ర్ (జె. డి. చక్రవర్తి) మంచివారా? చెడ్డ‌వారా? అలెగ్జాండ‌ర్‌, అత‌ని ప్రేయ‌సి ఏమ‌య్యారు? ముక్తార్ భాయ్ ఎవ‌రు? వంటివ‌న్నీ సినిమా కథలో భాగంగా సాగుతాయి.

తారాగణం[మార్చు]

 • సందీప్‌ కిషన్‌
 • సాయి ధరమ్‌ తేజ్‌
 • రెజీనా
 • ప్రగ్యా జైస్వాల్‌
 • ప్రకాష్‌రాజ్‌
 • తనీష్‌
 • శివాజీరాజా
 • జెడి చక్రవర్తి
 • తులసి
 • వైవా హర్ష

సాంకేతికవర్గం[మార్చు]

 • బ్యానర్‌: బుట్టబొమ్మ క్రియేషన్స్‌, విన్‌ విన్‌ విన్‌ క్రియేషన్స్‌
 • కూర్పు: శివ వై ప్రసాద్‌
 • సంగీతం: భీమ్స్‌, భరత్‌ మధుసూదన్‌, హరిగౌర
 • ఛాయాగ్రహణం: శ్రీకాంత్‌ నారోజ్‌
 • నిర్మాతలు: కె. శ్రీనివాసులు, ఎస్‌. వేణుగోపాల్‌, సజ్జు
 • రచన, దర్శకత్వం: కృష్ణవంశీ

మూలాలు[మార్చు]

 1. Vamsi, Krishna (19 October 2016). "Nakshatram first look: Regina, Pragya surprise with drastically different looks". The Indian Express. Archived from the original on 30 అక్టోబరు 2016. Retrieved 30 October 2016.

బయటి లంకెలు[మార్చు]

నక్షత్రం సినిమా