శివాజీ రాజా

వికీపీడియా నుండి
(శివాజీరాజా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శివాజీ రాజా
Sivajiraja.jpg
శివాజీ రాజా
జననం1962 ఫిబ్రవరి 26[1]
భీమవరం
ఇతర పేర్లుశివాజీ రాజా
ప్రసిద్ధితెలుగు సినిమా హాస్యనటుడు
మతంహిందూ
భార్య / భర్తఅరుణ
తండ్రిజి. రామరాజు
తల్లిజి. చంద్రావతి

శివాజీ రాజా (ఫిబ్రవరి 26 1962)[2] తెలుగు సినిమా టీవి నటుడు. నటుడుగా 1985లో చిత్రరంగ ప్రవేశం చేసిన శివాజీరాజా 260 చిత్రాలకు పైగానే నటించాడు. ఎం.వి.రఘు దర్శకత్వంలో గొల్లపూడి రాసిన కళ్ళు అనే నాటిక ఆధారంగా రూపొందిన అదే పేరుగల చిత్రంలో నటుడిగా గుర్తింపు పొందిన శివాజీ రాజా ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డు స్వీకరించాడు.[3] పెళ్ళిసందడి, సిసింద్రీ, ఘటోత్కచుడు, మురారి, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాలలో చెప్పుకోదగ్గ పాత్రలలో నటించాడు.

గుణ్ణం గంగరాజు నిర్మాణ సారథ్యంలో జెమినీ టీవీలో ప్రసారమై బాగా ప్రాచుర్యం పొందిన అమృతం ధారావాహికలో కొన్ని ఎపిసోడ్లలో ప్రధాన పాత్రయైన అమృతం పాత్రను పోషించాడు. మాటీవీలో కొద్దికాలం పాటు సంబరాల రాంబాబు అనే ధారావాహిక ను కూడా నిర్వహించాడు. ప్రస్తుతం సినిమా రంగంలోనూ, టీవీ రంగంలోనూ కొనసాగుతున్నాడు.

జీవిత విశేషాలు[మార్చు]

శివాజీ రాజా ఫిబ్రవరి 26, 1962 న రామరాజు, చంద్రావతి దంపతులకు జన్మించాడు. తండ్రి భీమవరం లోని డి.ఎన్.ఆర్ కళాశాలలో అటెండరుగా పని చేసేవాడు. శివాజీ రాజా హైదరాబాదులో పాలిటెక్నిక్ పూర్తి చేసి అక్కడే నటనలో శిక్షణ తీసుకున్నాడు. శిక్షణ పూర్తయ్యాక వారి కుటుంబం చెన్నైకి మారింది.[1]

సినిమా[మార్చు]

శివాజీ రాజా మొదటి సినిమా కళ్ళు. ఆయన నటించిన ఇతర సినిమాలు

  1. సముద్రం
  2. ఘటోత్కచుడు
  3. సిసింద్రీ
  4. మావిచిగురు
  5. పెళ్ళి సందడి
  6. ప్రేయసి రావే
  7. కుర్రాళ్ళ రాజ్యం
  8. ఖడ్గం
  9. మొగుడ్స్ పెళ్ళామ్స్
  10. అల్లరి పెళ్లాం
  11. పుట్టింటికి రా చెల్లి (2004)
  12. దేవరాయ (2012)
  13. నందీశ్వరుడు (2012)

కుటుంబం[మార్చు]

ఆయన భార్య పేరు అరుణ.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Telugu Movie Actor Sivaji Raja". nettv4u.com. Retrieved 12 September 2016.
  2. తెలుగు ఒన్.కాం నుండి
  3. విజయక్రాంతి, సినిమాలు (10 August 2018). "30 ఏళ్లుగా మరవలేని 'కళ్లు'". మూలం నుండి 26 April 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 26 April 2019. Cite news requires |newspaper= (help)

ఇతర లింకులు[మార్చు]