జగన్నాటకం (2015 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జగన్నాటకం
దర్శకత్వంప్రదీప్ నందన్
స్క్రీన్ ప్లేప్రదీప్ నందన్
నిర్మాతఆదిశేష రెడ్డి ఇందుపూరు
తారాగణంశ్రీధర్
ఖేనిష చంద్రన్
ప్రదీప్ నందన్
రుద్రకాంత్‌
అభినవ్ గోమఠం
ఛాయాగ్రహణంసతీష్ ముత్యాల
కూర్పుచంద్ర శేఖర్
సంగీతంఅజయ్ అరసాడ
నిర్మాణ
సంస్థ
చిత్రసౌధం
విడుదల తేదీ
13 మార్చి 2015
సినిమా నిడివి
90 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

జగన్నాటకం 2015లో విడుదలైన తెలుగు సినిమా. చిత్రసౌధం నిర్మాణంలో ఆదిశేష రెడ్డి ఇందుపూరు నిర్మించిన ఈ సినిమాకు ప్రదీప్ నందన్ దర్శకత్వం వహించాడు.[1] శ్రీధర్, ఖేనిష చంద్రన్, ప్రదీప్ నందన్, అభినవ్ గోమఠం, శివాజీరాజా, ఉషశ్రీ, కిరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 13 మార్చి 2015న విడుదలైంది.

కథ[మార్చు]

పృద్వీ (ప్రదీప్ నందన్) స్నేహితులతో కాలక్షేపం చేస్తూ, చిన్న చిన్న గొడవల్లో తన హీరోయిజాన్ని చూపిస్తూ సినిమాల్లో హీరో అవ్వాలనే కోరికతో నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుంటాడు . పృద్వీ కి నాన్న రాఘవయ్య , చెల్లెలు దివ్య(ఉషశ్రీ) అతని సర్వస్వము. ఈ క్రమంలో పృద్వీ భాను(ఖేనిష చంద్రన్) తో ప్రేమలో పడతాడు. పృద్వీ ఇంట్లో కూడా వారి ప్రేమని అంగీకరిస్తారు. ఓ రోజు పృథ్వికి రాజమౌళి సినిమాలో అవకాశం వస్తుంది. దాంతో ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకోవడానికి బయటకి వెళ్తాడు. కానీ వచ్చే సరికి పృథ్వి వాళ్ళ నాన్న చనిపోయి ఉంటాడు. చెల్లెలు దివ్య కనిపించదు. పృద్వీ బయటకి వెళ్ళిన సమయంలో ఇంట్లో ఏమి జరిగింది ? వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడు? చివరికి అతని చెల్లెలు దివ్య ఆచూకీ తెలుసుకున్నాడా? లేదా? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: చిత్రసౌధం
  • నిర్మాత: ఆదిశేష రెడ్డి ఇందుపూరు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రదీప్ నందన్ [3]
  • సంగీతం: అజయ్ అరసాడ
  • సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
  • డాన్స్: ఆట సందీప్
  • ఫైట్స్: వై రవి
  • ఆర్ట్: తిరుమల వి తిరుపతి
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పవర్ శ్రీను
  • పాటలు: గోసాల రాంబాబు

మూలాలు[మార్చు]

  1. Sakshi (26 January 2014). "జగన్నాటకం". Archived from the original on 20 November 2021. Retrieved 20 November 2021.
  2. India Herald (13 March 2015). "జగన్నాటకం : రివ్యూ". Archived from the original on 20 November 2021. Retrieved 20 November 2021.
  3. Sakshi (14 March 2015). "స్క్రీన్‌ప్లే అదిరిందని అభినందిస్తున్నారు". Archived from the original on 20 November 2021. Retrieved 20 November 2021.