ఖడ్గం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖడ్గం
దర్శకత్వంకృష్ణవంశీ
రచనకృష్ణవంశీ, సత్యానంద్, ఉత్తేజ్ (మాటలు)
నిర్మాతసుంకర మధుమురళి
తారాగణంమేకా శ్రీకాంత్
రవితేజ
ప్రకాశ్ రాజ్
ఛాయాగ్రహణంభూపతి
సంగీతందేవిశ్రీ ప్రసాద్
విడుదల తేదీ
29 నవంబరు 2002 (2002-11-29)
సినిమా నిడివి
144 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఖడ్గం 2002 లో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన దేశభక్తి ప్రధాన చిత్రం. ఇందులో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బెంద్రే, సంగీత, కిమ్ శర్మ, షఫీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సుంకర మధుమురళి కార్తికేయ మూవీస్ పతాకంపై నిర్మించాడు. కృష్ణవంశీ, ఉత్తేజ్, సత్యానంద్ రచన చేశారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.

నవంబరు 29, 2002 లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఐదు నంది పురస్కారాలను అందుకుంది.

కోటి సినిమా నటుడు కావాలని హైదరాబాదులో అడుగు పెడతాడు. అంజాద్ దైవభక్తి కలిగిన డ్రైవరు. మంచి దేశభక్తి కలవాడు. అతని తమ్ముడు అజర్ ఒక సంవత్సరం పాటు కనిపించకుండాపోయి ఉంటాడు. హైదరాబాదు పోలీసులు మసూద్ అనే తీవ్రవాదిని నిర్బంధిస్తారు. అతన్ని విడిపించడానికి పాకిస్థాన్ తీవ్రవాదులు అజహర్ కు శిక్షణ ఇచ్చి హైదరాబాదులో మతకలహాలు రేపడానికి పథకం వేస్తారు. అజర్ శిక్షణ తర్వాత ఏమీ ఎరగనట్లు వచ్చి తన అన్న అంజాద్ తో కలిసి నివాసం ఉంటూ జైలులో ఉన్న మసూద్ ని ఎలా విడుదల చేయాలో పథకాలు వేస్తుంటాడు.

రాధాకృష్ణ ఒక నిజాయితీ గల పోలీసు అధికారి. అతనికి పాకిస్థాన్ అంటే ద్వేషం. అందుకు కొన్ని వ్యక్తిగత కారణాలు ఉంటాయి. గతంలో అతని ప్రేయసి స్వాతిని ఐఎసై తీవ్రవాదులు చంపేసి ఉంటారు. కోటి, రాధాకృష్ణ, అంజాద్ లు కలిసి మసూద్ ని విడుదల చేసే పథకాన్ని ఎలా అడ్డుకున్నారన్నది మిగతా చిత్ర కథ.

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

ఈచిత్రం లోని పాటల రచయితలు సిరివెన్నెల సీతారామశాస్త్రి,, సుద్దాల అశోక్ తేజ, శక్తి.

మేమే ఇండియన్స్, గానం. హానీ

నువ్వు నువ్వు , గానం.సుమంగళి

ఆహా అల్లరి , గానం.కె ఎస్ చిత్ర , రాక్వైబ్

ఖడ్గం , గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

గోవిందా గోవింద, గానం.దేవీశ్రీ ప్రసాద్

ముసుగు వేయ్యోద్దు , గానం.కల్పన .

బహుమతులు

[మార్చు]
సంవత్సరం ప్రతిపాదించిన విభాగం పురస్కారం ఫలితం
2002 సుంకర మధు మురళి [1] సరోజినీ దేవి అవార్డు పొందిన జాతీయ సమైక్యతా చిత్రాలు గెలుపు
కృష్ణవంశీ నంది ఉత్తమ దర్శకులు గెలుపు
ప్రకాష్ రాజ్ నంది ఉత్తమ సహాయనటులు గెలుపు
పి. రంగారావు నంది ఉత్తమ కళా దర్శకులు గెలుపు
కిషోర్ నంది ఉత్తమ మేకప్ కళాకారులు గెలుపు
రవి తేజ నంది విశేష పురస్కారం గెలుపు
కృష్ణవంశీ ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు దర్శకులు గెలుపు
సంగీత ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు సహాయ నటి గెలుపు
షఫీ ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు విలన్ గెలుపు

మూలాలు

[మార్చు]
  1. "Telugu Cinema Etc". Idlebrain.com. 2003-09-08. Retrieved 2012-08-05.