పెళ్ళి సందడి (1996 సినిమా)
పెళ్ళి సందడి | |
---|---|
దర్శకత్వం | కె. రాఘవేంద్రరావు |
నిర్మాత | అశ్వనీ దత్, అల్లు అరవింద్ |
తారాగణం | శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ |
ఛాయాగ్రహణం | వి. జయరాం |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | శ్రీ రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్ |
పంపిణీదార్లు | గీతా ఆర్ట్స్ |
విడుదల తేదీ | జనవరి 12, 1996 |
సినిమా నిడివి | 129 ని |
దేశం | భారతదేశం |
పెళ్ళిసందడి 1996 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన విజయవంతమైన కుటుంబ, ప్రేమకథా చిత్రం. ఈ సినిమాలో శ్రీకాంత్, దీప్తి భట్నాగర్, రవళి ప్రధాన పాత్రలు పోషించారు. అశ్వనీ దత్, అల్లు అరవింద్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. 1996 జనవరి 12 న సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. సుమారు 1.25 కోట్ల రూపాయలతో నిర్మితమైన ఈ చిత్రం 12-15 కోట్ల రూపాయలు వసూలు చేసింది.[2][3] ఈ చిత్రం 5 విభాగాల్లో నంది పురస్కారాలు, ఉత్తమ సంగీతానికి ఫిల్మ్ ఫేర్ పురస్కారం దక్కించుకుంది. కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి.[4] ఈ చిత్రాన్ని 1997 లో మేరే సప్నోంకీ రాణీ అనే పేరుతోనూ, 1998 లో నినైదేన్ వందాయ్ అనే పేరుతో తమిళంలోకి పునర్నిర్మాణం అయింది. 2021 లో ఈ సినిమా స్ఫూర్తితో పెళ్ళిసందD సినిమా విడుదలైంది.
కథ
[మార్చు]విజయ్ ది సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. తండ్రి, ముగ్గురు అక్కలు, బావలతో కలిసి నివసిస్తుంటాడు. పెళ్ళి వయసు రావడంతో తండ్రి అతన్ని తొందరగా పెళ్ళి చేసుకోమని బలవంతం చేస్తుంటాడు. ఆ పనిని తన ముగ్గురు అల్లుళ్ళకు అప్పజెబుతాడు. విజయ్ మాత్రం తనకు కలలో కనిపించిన స్వప్న సుందరిని మాత్రమే పెళ్ళి చేసుకుంటానని చెబుతాడు. అతని బావలు పోలికలు చెప్పమని అడిగితే బొడ్డు పక్కన ఉన్న పుట్టుమచ్చ ఉందని మాత్రమే చెబుతాడు. అలాంటి అమ్మాయి వెతకడం అసంభవం అనీ ఆ ఆలోచన మానుకోమని సలహా ఇస్తారు. విజయ్ తండ్రి తెలిసిన వాళ్ళ ద్వారా దగ్గర్లోనే ఉన్న మరో సంబంధం మాట్లాడతాడు. విజయ్ అయిష్టంగానే పెళ్ళి చూపులకు వెళతాడు. తీరా వెళ్ళాక ఆ సంబంధం వద్దనడానికి అతనికి ఏ కారణం కనిపించదు. అతని ఆలోచనలతో సంబంధం లేకుండా నిశ్చితార్థం జరిగిపోతుంది.
ఒకసారి విజయ్ బంధువుల పెళ్ళికి తన బావలతో కలిసి వెళతాడు. అక్కడ తన స్వప్న సుందరి లక్షణాలను పోలిన అమ్మాయిని కనపడుతుంది కానీ మళ్ళీ ఆమె జాడ కానరాదు. విజయ్ ఎలాగైన ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలనే పట్టుదలతో ఉంటాడు. విజయ్ కి ఊటీలో సంగీత ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వస్తుంది. స్వప్న మళ్ళీ ఆ విద్యార్థుల్లో ఒకరిగా కనిపిస్తుంది. విజయ్ స్వప్న ప్రేమలో పడతారు. విజయ్ మళ్ళీ ఇంటికి తిరిగివచ్చి తన ప్రేమను గురించి ఇంట్లోవాళ్ళకి చెప్పాలనుకుంటాడు. కానీ అంతలోనే తండ్రి కళ్యాణితో పెళ్ళి ఏర్పాట్లు చేస్తుంటాడు. ఈ లోపుగా స్వప్న తన అక్క కల్యాణికి కాబోతున్న భర్త తాను ప్రేమించిన విజయ్ అని తెలుస్తుంది. స్వప్న అక్క కోసం తన ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధమవుతుంది. స్వప్న విజయ్ తో అసలు విషయం చెప్పకుండా తాను ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లు అబద్ధం చెప్పి తన ప్రేమను మరిచిపోమంటుంది. ఈ లోపు కల్యాణికి కూడా స్వప్న, విజయ్ ల ప్రేమ విషయం గురించి తెలుసుకుని చెల్లెల్ని విజయ్ తో పెళ్ళికి ఒప్పించడంతో కథ ముగుస్తుంది.
తారాగణం
[మార్చు]- విజయ్ గా శ్రీకాంత్
- స్వప్న దీప్తి భట్నాగర్
- కల్యాణి గా రవళి
- విజయ్ తండ్రి కైకాల సత్యనారాయణ
- విజయ్ బావ గా బ్రహ్మానందం
- విజయ్ బావ గా తనికెళ్ళ భరణి
- విజయ్ బావ గా శివాజీ రాజా
- ఏవీఎస్
- బాబు మోహన్
- మన్నవ బాలయ్య
- రాజా రవీంద్ర
- పైడితల్లిగా చిట్టి బాబు
- అనంత్
- శ్రీలక్ష్మి
- రజిత
పురస్కారాలు
[మార్చు]- ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎం. ఎం. కీరవాణికి ఫిల్మ్ ఫేర్ (తెలుగు) పురస్కారం
- ఉత్తమ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నంది పురస్కారం
- ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎం. ఎం. కీరవాణికి నంది పురస్కారం
- ఉత్తమ నృత్య దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నంది పురస్కారం
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించగా సామవేదం షణ్ముఖశర్మ, చంద్రబోస్ పాటలు రాశారు.
- సౌందర్యలహరి, స్వప్నసుందరి , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- రమ్యకృష్ణ లాగ ఉంటదా , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం. ఎం ఎం కీరవాణి, మనో
- హృదయమనే కోవెలలో వెలిగే దీపం , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- సరిగమ పదనిస రాగం, త్వరపడుతున్నది మాఘం , రచన: చంద్రబోస్, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- నవమన్మథుడా అతి సుందరుడా నిను వలచిన ఆ ఘనుడు , రచన: సామవేదం షణ్ముఖశర్మ, గానం. కె ఎస్ చిత్ర
- కిల కిల కిల, రచన: వేటూరి సుందర రామమూర్తి గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- మా పెరటి జాంచెట్టు , రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- చెమ్మ చెక్క చారడేసి మొగ్గ, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- అయినా చిక్కలేదు చిన్నదాని ,రచన: ఎం ఎం కీరవాణి , గానం.ఎం ఎం కీరవాణి .
సంభాషణలు
[మార్చు]- కాఫీలు తాగారా, టిఫినీలు చేశారా? ఇంకోసారి కాఫీలు తాగుతారా, ఇంకోసారి టిఫినీలు చేస్తారా?
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (12 January 2021). "పెళ్లి సందడి@25.. రాఘవేంద్రరావు ఎమోషనల్ ట్వీట్". Sakshi. Archived from the original on 1 జూన్ 2021. Retrieved 1 June 2021.
- ↑ "పెళ్ళిసందడి చిత్రానికి 25 ఏళ్ళు". ragalahari.com. 13 Jan 2021. Retrieved 19 May 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "రూ.85లక్షల బడ్జెట్.. రూ.15కోట్ల కలెక్షన్స్". eenadu.net. Retrieved 19 May 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "పెళ్లి సందడి@25.. రాఘవేంద్రరావు ఎమోషనల్ ట్వీట్". sakshi.com. Retrieved 19 May 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link)