వి. జయరాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వి. జయరాం
జననం1951
మరణం21 మే 2021
జాతీయత భారతదేశం
వృత్తిసినిమాటోగ్రాఫర్‌
పిల్లలు1 కుమారుడు, 1 కుమార్తె

వి. జయరాం తెలంగాణ రాష్ట్రానికి చెందిన సినిమాటోగ్రాఫర్. ఆయన తెలుగు, మలయాళ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. వరంగల్లుకు చెందిన ఈయన 1921, దేవాసురం, మృగయా లాంటి మలయాళ సినిమాలకు, తెలుగులో పెళ్ళిసందడి, ఇద్దరు మిత్రులు, పరదేశి, మేజర్ చంద్రకాంత్ లాంటి సినిమాలకు పనిచేశాడు. 2021 మే నెలలో కరోనా కారణంగా మరణించాడు.

జననం

[మార్చు]

జయరాం 1951లో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లులో జన్మించాడు. తన చిన్నాన్న నడుపుతున్న ఫోటో స్టూడియో చూసి ఫోటోగ్రఫీ మీద ఆసక్తి కలిగింది.[1]

సినీ ప్రస్థానం

[మార్చు]

జయరాం సినిమాలపై ఇష్టంతో 13 ఏళ్ళ వయసులో ఇంటినుంచి వెళ్ళిపోయి చెన్నై చేరుకున్నాడు, అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువుగా ఉండే పాండీబజార్‌ చేరుకున్నాడు. ఆయనకు అక్కడి నుంచి ఆంధ్రాక్లబ్‌కు చేరుకొని దర్శకుడు గుత్తా రామినీడు కనిపిస్తే కలిసి మాట్లాడారు, ఆంధ్రా క్లబ్ కు సెక్రటరీగా ఉన్న గుత్తా రామినీడు మేనేజర్‌ని పిలిచి క్లబ్ లో క్యాషియర్ గా ఉద్యోగం ఇప్పించాడు. అక్కడి నుండి ఆయన అసిస్టెంట్‌ కెమెరామెన్‌, సినిమాటోగ్రాఫర్‌గా ఎదిగాడు.[2]

అసిస్టెంట్ కెమెరామన్‌గా పని చేసిన చిత్రాలు

[మార్చు]

కెమెరామన్‌గా పని చేసిన చిత్రాలు

[మార్చు]

మరణం

[మార్చు]

జయరాం కరోనా బారిన పడి హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2021 మే 21న మరణించాడు. జయరామ్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Cinematographer V Jayaram of 'Devasuram' fame dies following COVID-19 complications". The News Minute (in ఇంగ్లీష్). 2021-05-22. Retrieved 2022-02-14.
  2. Eenadu (21 May 2021). "Jayaram:కరోనాతో కన్నుమూసిన కెమెరామెన్‌ - tollywood cinematographer jayaram is no more". www.eenadu.net. Archived from the original on 21 మే 2021. Retrieved 21 May 2021.
  3. HMTV (21 May 2021). "Tollywood: టాలీవుడ్ లో మరో విషాదం". www.hmtvlive.com. Retrieved 21 May 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  4. Andhrajyothy (21 May 2021). "క‌రోనాతో సీనియర్ సినిమాటోగ్రాఫర్ జయరాం కన్నుమూత". www.andhrajyothy.com. Archived from the original on 21 మే 2021. Retrieved 21 May 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=వి._జయరాం&oldid=3464369" నుండి వెలికితీశారు