పరదేశి (1998 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పరదేశి
పద్మావతీ కళ్యాణ.jpg
దర్శకత్వంకె.రాఘవేంద్రరావు
నిర్మాతసి. అశ్వనీ దత్
అల్లు అరవింద్
నటవర్గంమాధవ్,
మోనా,
తనూజ, విశ్వ
ఛాయాగ్రహణంవి. జయరామ్
కూర్పుమార్తాండ్ కె వెంకటేష్
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీలు
1998 జనవరి 14 (1998-01-14)[1]
భాషతెలుగు

పరదేశి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తెలుగు కామెడీ చిత్రం . ఈ చిత్రంలో విశ్వాస్, మాధవ్ దల్వి, తనూజా, మొన్నెట్ నటించారు.[2] ఈ చిత్రాన్ని ప్రధానంగా USA లో 93 రోజుల షెడ్యూల్‌లో చిత్రీకరించారు.

కథ[మార్చు]

జువ్వలపాలెం గ్రామంలో రాయుడు, నాయుడు అనే పెద్ద మనుషులు ఉంటారు. రాయుడు దండిగా పొలాలు ఉన్న మోతుబరి రైతు. నాయుడు మంచి పాడిసంపద ఉన్న వాడు. ఇద్దరూ ఒకప్పుడు స్నేహితులైనా చిన్న పంతాలకు పోయి ఒకరి మీద ఒకరు చెణుకులు విసురుకుంటూ ఉంటారు. వారిద్దరు కొడుకులు గోపాల్, కృష్ణ మాత్రం మంచి స్నేహితులు. రాయుడి చిన్ననాటి స్నేహితుడు బంగార్రాజు అమెరికాలో బాగా స్థిరపడిన ధనవంతుడు. అతనికి ఒకే కూతురు ఉంటుంది. బంగార్రాజు తన కూతురిని రాయుడి కొడుక్కిచ్చి పెళ్ళి చేయాలని అనుకుని అతన్ని తన దగ్గరకు పంపించమంటాడు. నాయుడు కూడా రాయుడి మీద పోటీగా తన కొడుకు కృష్ణను కూడా అమెరికాకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తాడు. స్నేహితులిద్దరూ అమెరికా వెళుతున్నందుకు సంతోషిస్తారు. అయితే గోపాల్ కి మాత్రం బంగార్రాజు కూతురిని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేక కృష్ణని తన స్థానంలో వెళ్ళమని, అతని స్థానంలో తను ఉంటానని చెప్పి ఒప్పిస్తాడు.

అమెరికా చేరగానే బంగార్రాజు కుటుంబానికి కూడా మార్చుకున్న పేర్లతోనే పరిచయమవుతారు. కృష్ణకు బంగార్రాజు కూతురు, కుటుంబం ఇద్దరూ నచ్చేస్తారు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

All music is composed by ఎం.ఎం. కీరవాణి.

సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
0.Untitledసాహిత్యం  
1."తెలుగింటి పెరటిలోన"చంద్రబోస్ (రచయిత)కె.ఎస్. చిత్ర, ఉన్నికృష్ణన్ 
2."చందన చర్చిత"వేటూరి సుందరరామమూర్తిమనో, సంగీత, మాల్గాడి శుభ 
3."బూరెల వారి అమ్మాయికి"చంద్రబోస్మనో, స్వర్ణలత, సంగీత, కీరవాణి, చంద్రబోస్, మాల్గాడి శుభ 
4."బొండుమల్లి బుగ్గ మీద"చంద్రబోస్రాజేష్, సౌమ్య, మాల్గాడి శుభ, తబిత, ఉన్నికృష్ణన్, స్వర్ణలత 
5."జగతి సిగలో"వేటూరి సుందరరామమూర్తిసుజాతా మోహన్, కీరవాణి 
6."మైలీ మైలీ"చంద్రబోస్కె.ఎస్. చిత్ర, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 
7."చూసారా"చంద్రబోస్ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మాల్గాడి శుభ 
8."తణుకో అరకో"చంద్రబోస్సుజాతా మోహన్, మనో 
9."పరదేశీ"చంద్రబోస్మనో, మాల్గాడి శుభ 

మూలాలు[మార్చు]

  1. "Paradesi (1998)". Indiancine.ma. Retrieved 2021-12-27.
  2. "పరదేశి". filmibeat.com.{{cite web}}: CS1 maint: url-status (link)