మనోరమ (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మనోరమ Manorama [மனோரமா]
Manorama.jpg
జననం Gopishantha Kasi Clockudaiyar
మే 26, 1937
మన్నార్గుడి, తమిళనాడు, India[1]
మరణం అక్టోబర్ 11, 2015
ఇతర పేర్లు ఆచి (Aachi)
వృత్తి రంగస్థల, సినిమా, టి.వి. నటి
క్రియాశీలక సంవత్సరాలు 1958 –2013
పిల్లలు భూపతి

మనోరమ (ఆంగ్లం: Manorama; born Gopishantha తమిళం: கோபிசாந்தா) (మే 26, 1937 - అక్టోబరు 11, 2015) సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటీమణి. ఈమె సుమారు 1500 సినిమాలు మరియు 1000 నాటక ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె ఎక్కువగా తమిళ భాషలో ఎక్కువగా నటించింది.[2] ఈమె కొన్ని మలయాళం, తెలుగు, కన్నడ మరియు హిందీ భాషా చిత్రాలలో కూడా నటించింది. ఈమెను అభిమానులు ఆచి (Aachi) అని ప్రేమగా పిలుస్తారు.[3][4]

1987లో ప్రపంచంలోనే అత్యధిక సినిమాలలో నటించిన సినీ నటిగా ఈమె గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించింది. ఈ రికార్డు 2009 వరకూ ఎవరూ అధిగమించలేదు. మనోరమ ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించారు. తమిళనాడు సీఎం జయలలిత, మాజీ సీఎంలు అణ్ణా దురై, ఎం.జి.రామచంద్రన్, కరుణానిధితో పాటు నందమూరి తారక రామారావుతో కలిసి నటించారు.

ఇక ప్రముఖ హీరోలైన శివాజీ గణేశన్, రజనీకాంత్‌, కమల్ హాసన్తో కలిసి నటించారు. 1958లో తమిళంలో మాలఇట్టామంగై చిత్రంతో మనోరమ తెరంగ్రేటం చేశారు. ఇక చివరి చిత్రం సింగం-2.

జననం[మార్చు]

మనోరమ 1937, మే 26తమిళనాడు లోని మన్నార్‌గుడిలో జన్మించారు. ఈవిడ అసలు పేరు గోపిశాంత.

అవార్డులు[మార్చు]

నటించిన తెలుగు సినిమాలు[మార్చు]

 1. భద్రకాళి (1976)
 2. శుభోదయం (1980)
 3. విచిత్ర సోదరులు (1989) - మునియమ్మ
 4. మైఖేల్ మదన కామరాజు (1991) - గంగాబాయి
 5. అల్లరి ప్రియుడు (1993)
 6. కుంతీ పుత్రుడు (1993)
 7. జంటిల్ మేన్ (1993) - అర్జున్ తల్లి
 8. రిక్షావోడు (1995) - బామ్మ
 9. బావ నచ్చాడు (2001) - భానుపతి
 10. కృష్ణార్జున (2008)
 11. అరుంధతి (2009) - చంద్రమ్మ
 12. యముడు (2010) - మల్లికార్జున తల్లి
 13. అరుణాచలం

మరణం[మార్చు]

గత కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ఆమె చెన్నై లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2015, అక్టోబర్ 11 న తుదిశ్వాస విడిచారు.

మూలాలు[మార్చు]

 1. There’s no stopping her. Hinduonnet. 2009/02/02
 2. "The endearing `aachi'". The Hindu. 2003-07-07. Retrieved 2010-05-26. 
 3. "The Hindu : The endearing `aachi'". Hinduonnet.com. 2003-07-07. Retrieved 2010-05-26. 
 4. ‘Comedy is big responsibility’. Hinduonnet. 10/08/2007

బయటి లింకులు[మార్చు]

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా | ఉత్తమ నటుడు | ఉత్తమ నటి | ఉత్తమ సహాయ నటుడు | ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు | ఉత్తమ బాల నటుడు | ఉత్తమ ఛాయా గ్రహకుడు | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | ఉత్తమ దర్శకుడు | ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు | ఉత్తమ గీత రచయిత | ఉత్తమ సంగీత దర్శకుడు | ఉత్తమ నేపథ్య గాయకుడు | ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం | ఉత్తమ కూర్పు | ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్ | ఉత్తమ బాలల సినిమా | ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం | ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా | ఉత్తమ బెంగాలీ సినిమా | ఉత్తమ ఆంగ్ల సినిమా | ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా | ఉత్తమ మళయాల సినిమా | ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా | ఉత్తమ పంజాబీ సినిమా | ఉత్తమ కొంకణి సినిమా | ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా | ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
"https://te.wikipedia.org/w/index.php?title=మనోరమ_(నటి)&oldid=2444308" నుండి వెలికితీశారు