కృష్ణార్జున

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కృష్ణార్జున
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.వాసు
నిర్మాణం మోహన్ బాబు
రచన మరుధూరి రాజా
తారాగణం మంచు విష్ణు[1],
మమత మోహన్‌దాస్,
అక్కినేని నాగార్జున,
మోహన్ బాబు
సంగీతం ఎం.ఎం.కీరవాణి
కూర్పు గౌతంరాజు
విడుదల తేదీ ఫిబ్రవరి 1, 2008
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కృష్ణార్జున 2008 లో శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ ఫై పి. వాసు దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మించిన సోషియో ఫాంటసీ చిత్రం. ఇందులో మంచు విష్ణు, నాగార్జున, మమత మోహన్ దాస్, మోహన్ బాబు ప్రధాన పాత్రలు పోషించారు.

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

కృష్ణుడి గుడిలో పుట్టిన అర్జున్ అమ్మమ్మతో కలిసి ధనవంతుడైన నాజర్ ఇంటిలో పనిచేస్తుంటాడు. నాజర్ పొగరుబోతు కూతురు మమతను ఓ పెద్దింటి అబ్బాయికిచ్చి పెళ్ళి చేయాలనుకుంటారు. అయితే, జాతకరీత్యా మమతను మొదట పెళ్ళి చేసుకునే వ్యక్తి మృత్యువాత పడతాడని తెలుస్తుంది. ఆ గండం గట్టెక్కడానికి అమాయకుడైన అర్జున్ తో మమతకు మొదటి పెళ్ళి చేసి, ఆ తర్వాత అతన్ని చంపాలని చూస్తారు. ఆ సందర్భంగా ఆమ్మమ్మ చనిపోవడంతో అర్జున్ కూడా చనిపోవాలనుకుంటాడు. అనుకోని విధంగా, అర్జున్ ఎప్పుడూ కొలిచే కృష్ణుడు అతని ప్రయత్నాన్ని అడ్డుకుని ధైర్యంచెప్పి, తిరిగి నాజర్ ఇంటికి పంపుతాడు. మరో పెళ్ళికి సిద్దమవుతున్న మమతను తనదానిగా చేసుకోవడంతో పాటు, జాతకంలోని మరణ గండాన్ని అర్జున్ ఎలా ఎదుర్కొన్నాడనేదే ఈ చిత్ర కథాంశం.

విశేషాలు

[మార్చు]

ఇందులో కొత్త విలన్ దేవ్ గిల్లి, మనోరమ, నాజర్, తనికెళ్లభరణి, ప్రేమ, సునీల్ ఇతర పాత్రలు పోషించారు. మరుదూరి రాజా మాటలు, స్టన్ శివ ఫైట్లు, కీరవాణి పాటలు సమకూర్చారు. పాపులర్ పాట 'యమరంజు మీద వుంది పుంజు' ఇందులో రీమిక్స్ చేశారు. విష్ణు థింక్ స్మార్ట్ విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి.

పాటల జాబితా

[మార్చు]

అ అ ఆ ఇ ఈ , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.శంకర్ మహదేవన్

యమా రంజు మీద , రచన: గురుకిరణ్ , గానం.టిప్పూ , సునీత

ఆజా మెహబూబా, రచన: సాహితి , గానం.ఆచూ, గీతా మాధురి

బుగ్గలెర్రబడ్డ , రచన: సాహితీ, గానం.కీరవాణి, మమతా మోహన్ దాస్

తరువాత బాబా , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.టిప్పూ

పెద్ద మర్రికేమో , రచన : రామజోగయ్య శాస్త్రి,గానం.మనో, బాలకృష్ణన్

ఏది మంచి , రచన: రామజోగయ్య శాస్త్రి,గానం.మధు బాలకృష్ణన్

వుయ్ ఆర్ కమింగ్ , రచన: రామజోగయ్య శాస్త్రి,గానం.ప్రణవి , భార్గవి పిళ్ళై, నోయెల్

మూలాలు

[మార్చు]
  1. సితార, తారా తోరణం. "మంచు కుటుంబంలో మంచి నటుడు - మంచు విష్ణు". www.sitara.net. పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.