భద్రకాళి (సినిమా)
Jump to navigation
Jump to search
భద్రకాళి (1977 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎ.సి.త్రిలోక్ చందర్ |
తారాగణం | మురళీమోహన్, జయప్రద |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | సినీ భారత్ |
భాష | తెలుగు |
భద్రకాళి ఎ.సి.త్రిలోకచందర్ దర్శకత్వంలో సినీ భారత్ పతాకంపై నిర్మించబడి 1977 ఆగష్టు 14న విడుదలైన తెలుగు సినిమా. ఇదే పేరుతో 1976లో విడుదలై విజయవంతమైన తమిళ సినిమాకు ఇది రీమేక్. ఈ చిత్రం ద్వారా ఇళయరాజా సంగీత దర్శకుడిగా తెలుగు సినిమా రంగానికి పరిచయమయ్యాడు.
తారాగణం
[మార్చు]- మురళీమోహన్
- జయప్రద
- గుమ్మడి
- అల్లు రామలింగయ్య
- రాజశేఖరరెడ్డి
- కె.విజయ
- నిర్మల
- పండరీబాయి
- గిరిజారాణి
- రాజేశ్వరి
- మోదుకూరి సత్యం
- నాగభూషణం
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు: ఎ.సి.త్రిలోకచందర్
- కథ: మహర్షి
- మాటలు: బొల్లిముంత శివరామకృష్ణ
- పాటలు: దేవులపల్లి, దాశరథి, కొసరాజు
- సంగీతం: ఇళయరాజా
- నేపథ్యగాయకులు: జేసుదాస్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
పాటలు
[మార్చు]- చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా నిన్ను చూసి మురిసేనూ నేను మేను మరచేను - జేసుదాసు, పి.సుశీల - దాశరథి
- అడిగావే అక్కడ ఇక చూస్కో ఇక్కడ జోరుగా ఆడతా - పి.సుశీల - రచన: కొసరాజు
- ఏమాయేనే తల్లి ఎందుకే నా తల్లీ ఈ భయంకర వేషం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: దేవులపల్లి
- మహిశాసురడను మహారాక్షసుడు మహిలో చెలరేగే - పి.సుశీల బృందం - రచన: దాశరథి
మూలాలు
[మార్చు]- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.