Jump to content

అల్లరి ప్రియుడు

వికీపీడియా నుండి
అల్లరి ప్రియుడు
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం కె.కృష్ణమోహనరావు
తారాగణం రాజశేఖర్,
రమ్యకృష్ణ,
మధుబాల
సంగీతం ఎం.ఎం.కీరవాణి
గీతరచన వేటూరి,
వెన్నెలకంటి
భువనచంద్ర
సీతారామశాస్త్రి
నిర్మాణ సంస్థ ఆర్.కె. ఫిల్మ్స్ ఎసోసియేట్స్
భాష తెలుగు

అల్లరి ప్రియుడు, 1993లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలయిన ఒక తెలుగు సినిమా. ఇందులో రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాల ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఆర్. కె. ఫిల్ం అసోసియేట్స్ పతాకంపై కె. కృష్ణమోహనరావు నిర్మించాడు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు.

ఇందులో కథానాయకుడు రాజశేఖర్ ఒక గాయకుడు. అతడు ఒక కవయిత్రి పాటలను గానం చేస్తూ ప్రసిద్ధుడవుతాడు. అదే సమయంలో ఆమెను ప్రేమిస్తాడు. ఆయితే ఆ అసలు రచయిత్రి రమ్యకృష్ణ కాగా ఆమె తన చెల్లెలు మధుబాలవే రచయిత్రిగా రాజశేఖర్‌కు పరిచయం చేస్తుంది. అలా ఇద్దరమ్మాయిలు, ఒకబ్బాయి మధ్య నడచిన ముక్కోణపు ప్రేమయే ఈ సినిమా కథాంశం. సినిమాలో పాటలు బాగా విజయవంతమయ్యాయి.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
  • రోస్ రోస్ రోస్ రోజాపువ్వా - రచన:వేటూరి, గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బృందం
  • అందమా నీ పేరేమిటి - రచన:వేటూరి, గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బృందం
  • ప్రణయమా నీ పేరేమిటి- రచన:వెన్నెలకంటి, గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బృందం
  • ఏం పిల్లది ఎంత మాటన్నది - - రచన:కీరవాణి, గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  • ఉత్తరాల ఊర్వశి - రచన:వేటూరి, గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  • అహో ఒక మనసుకు నేడే - రచన:సీతారామ శాస్త్రి, గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  • చెప్పకనే చెబుతున్నది - రచన:భువనచంద్ర, గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]