Jump to content

చెప్పకనే చెబుతున్నది

వికీపీడియా నుండి
అల్లరిప్రియుడు సినిమా పోస్టరు

చెప్పకనే చెబుతున్నది ఇదే ఇదే ప్రేమని 1993లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన అల్లరి ప్రియుడు చిత్రంలోనిది. ఈ పాటను భువనచంద్ర రచించగా ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర లు గానం చేసారు. చిత్రంలోని ఈ పాటకు రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాలలు నటించారు.[1]

కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెనో
తమకంతో పాలబుగ్గ తొలి ముద్దును కోరెనో
తడి ఆరని పెదవులపై తొణికిన వెన్నెల మెరుపులు
చెప్పకనే చెప్పకనే
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని

చిలిపిగ నీ చేతులు అణువణువు తడుముతుంటే
మోహపు తెరలిక తొలిగేనా
చలి చలి చిరుగాలులు గిలిగింత రేపుతుంటే
ఆశల అల్లరి అణిగేనా
పదాలతోనే వరించనా సరాగ మాలై తరించనా
స్వరాలతోనే స్ప్రుశించనా సుఖాల వీణ శ్రుతించనా
ఆ వెన్నెల నీ కన్నుల రేకెత్తిన ఆ కోరిక
పొగలై సెగలై ఎదలో రగిలిన క్షణమే

తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం
యవ్వన గిరులను తడిమెననా
నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం
మదనుడి మలుపులు తెలిసేనని
తెల్లారనీకే వయ్యారమా అల్లాడిపోయే ఈ రేయిని
సవాలు చేసే శృంగారమా సహించమాకే ఆ హాయిని
ఆ మల్లెల కేరింతలు నీ నవ్వుల లాలింతలు
వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే

మూలాలు

[మార్చు]
  1. "Allari Priyudu - Cheppakane Chebuthunnadi Song - Lyrics". Retrieved 2020-09-17.

బాహ్య లంకెలు

[మార్చు]