బావ నచ్చాడు
బావ నచ్చాడు (2001 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్. రవికుమార్ |
---|---|
నిర్మాణం | అరుణా రాజు |
కథ | జనార్ధన మహర్షి |
తారాగణం | అక్కినేని నాగార్జున, సిమ్రాన్, రీమా సేన్, మనోరమ |
సంగీతం | ఎం.ఎం. కీరవాణి |
సంభాషణలు | జనార్ధన మహర్షి |
ఛాయాగ్రహణం | శ్యాం కె. నాయుడు |
కూర్పు | కోలా భాస్కర్ |
భాష | తెలుగు |
బావ నచ్చాడు 2001 లో వచ్చిన టాలీవుడ్ చిత్రం. కె.ఎస్.రవికుమార్ రచన, దర్శకత్వం వహించగా రోజా మూవీస్ బ్యానర్‌లో ఎం. అర్జున రాజు నిర్మించాడు. ఇందులో నాగార్జున అక్కినేని, సిమ్రాన్, రీమా సేన్ ప్రధాన పాత్రల్లో నటించారు, ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.[1]
కథ[మార్చు]
అజయ్ ( నాగార్జున అక్కినేని ) ఒక వ్యాపార ప్రకటనలు తీస్తూంటాడు (దర్శకుడు, నటుడు). తన కాబోయే భార్య ఎలా ఉండాలో కచ్చితమైన ఆలోచన ఉంది. అతని తల్లి ఎంపిక చేసిన ఆమె ఊరు కోవ్వూరుకే చెందిన యువతి మీనాక్షి ( సిమ్రాన్ ) ని పెళ్ళి చేసుకుంటాడు. మీనాక్షి త్వరలోనే గర్భవతి అవుతుంది. కొంత కాలం తరువాత, మీనాక్షికి ఎముక చిట్లుతుంది. మీనాక్షిని చూసుకోవటానికి ఆమె కుటుంబం మొత్తం అజయ్ ఇంట్లో దిగుతుంది. ఆమెకు లహరి ( రీమా సేన్ ) అనే అందమైన సోదరి ఉంది. ఆ కాలంలో సుమ ( సుమన్ రంగనాథన్ ), అజయ్ వద్ద పనిచేసే రెగ్యులర్ మోడల్‌కు ఎముక చిట్లడంతో లహరి ఆమె స్థానంలో అజయ్ సరసన మోడల్ గా పనిచేస్తుంది. లహరిని మోడలింగ్ వృత్తి ఆకర్షిస్తుంది. తరువాత అజయ్‌తో ప్రేమలో పడుతుంది. కానీ అజయ్‌కి ఆమె పట్ల ఎలాంటి భావాలు ఉండవు. మీనాక్షి ఆరోగ్యం బాగుపడడంతో ఆమె కుటుంబం వాళ్ళ ఊరికి తిరిగి వెళ్తుంది. అజయ్‌ను పెళ్ళి చేసుకోవాలనే కోరిక గురించి లహరి మీనాక్షికి చెబుతుంది. మీనాక్షి కోపంతో వెనక్కి భర్త దగ్గరికి వచ్చేస్తుంది, ఇంతలో, లహరి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. మీనాక్షి, లహరితో చాలా సన్నిహితంగా ఉండటంతో, అజయ్‌తో పెళ్ళి చేస్తానని లహరికి హామీ ఇస్తుంది. లహరిని బాధించకుండా అజయ్ తన సంసారాన్ని ఎలా కాపాడుకుంటాడు అనేది మిగిలిన చిత్రం.
తారాగణం[మార్చు]
పాటలు[మార్చు]
పాటల జాబితా | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
సంఖ్య. | పాట | గాయనీ గాయకులు | నిడివి | |||||||
1. | "అనురాగం అనురాగంలో" | హరిహరన్, సుజాత | 5:22 | |||||||
2. | "చందమామా చందమామా" | ఉదిత్ నారాయణ్, చిత్ర, హరిణి | 4:49 | |||||||
3. | "మాటోటుంది మగడా" | శంకర్ మహదేవన్, అనూరాధా శ్రీరామ్ | 5:31 | |||||||
4. | "అక్కా బావ నచ్చాడా" | హరిణి | 4:34 | |||||||
5. | "బ్యాంగ్ బ్యాంగ్" | శంకర్ మహదేవన్, సునీతా రావు | 5:09 | |||||||
6. | "వెరీ సెక్సీ" | శంకర్ మహదేవన్, గంగ | 5:12 | |||||||
మొత్తం నిడివి: |
30:37 |
మూలాలు[మార్చు]
- ↑ Movie Riview Bava Nachadu. idlebrain.com. URL accessed on 19 November 2012.